రామజన్మభూమి - బాబ్రీ మసీదు వ్యవహారం అంతకంటే ముందునుండే నడుస్తున్నా 1980ల్లోని నడిమి కాలంలో ఉత్తర భారతదేశంలోని అధిక భాగంలో అది రాజకీయాలను శాసించే విషయంకావటంలోని అసలు నిజాన్ని వెలికి తీయటమే ఈ వాస్తవ వివరణ ప్రయోజనం. అది ప్రధానంగా మతపరమైన విషయమే అయినా దానిని రాజకీయపరంగా, ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే, ఎన్నికల ప్రయోజనాలకోసం బాహాటంగానే కొల్లగొట్టడం జరిగింది. 1989, 1991 సంవత్సరాలల్లో లోక్ సభ ఎన్నికలలోనూ, ఉత్తరప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలోనూ మతావేశం ఓటర్లను తనవైపుకు తిప్పుకుంది. ఇన్నాళ్ల తరువాత ఈ వాస్తవ చిత్రణవల్ల రాజకీయంగా ఏమీ ఉపయోగం లేనట్లు కన్పించవచ్చు - ఎందుకంటే కొన్ని ఎన్నికలలో తప్పుడు సమాచారం రాజ్యమేలింది గనుక. రెండు, మూడు దుర్ఘటనల తరువాతయినా మతాన్ని, ఎన్నికల రాజకీయాల్ని విడగొట్ట గలిగితే భారత లౌకిక పాలనా పద్దతికి ఎంతగానో సేవలందించినట్లే: ప్రజలకు కనువిప్పుకల్గించినట్లే....
పీ.వి. నరసింహారావు(రచయిత గురించి) :
భారత ప్రధానిగా శ్రీ పీ.వీ. నరసింహారావు 1996 లో పదవీ విరమణ గావించిన తరువాత 1992 లో అయోధ్యలో ఏం జరిగిందో వ్రాసిపెట్టుకున్నారు. అనేక అనుబంధాలతో కూడిన సుదీర్ఘ అధ్యయనాన్ని ఆయన అనేక కారణాలవల్ల తాము జీవించి ఉండగా ప్రచురించలేదు. 2004 డిసెంబర్ లో ఆయన మరణించే ముందు కొద్దిరోజుల వరకు ఆయన ఈ గ్రంధాన్ని మెరుగులు దిద్దుతూనే ఉన్నారు. రావుగారి కుటుంబ సభ్యుల్ని సంప్రదించి ఆయన కాగితాల నుండి గ్రహించినవే. ఈ గ్రంధానికి ఆధారం. గ్రంధకర్త కోర్కెననుసరించి ఈ గ్రంథం ఆయన మరణానంతరం ప్రచురింపబడుతున్నది.
ఈ పుస్తకంలోని కొన్ని ముఖ్యవిషయాలు :
- అయోధ్య 1949 : విగ్రహాలు మసీదులోకి?
- అయోధ్య 1986 : తాళాలు తీసారు?
- అయోధ్య 1989 : శిలాన్యాస్?
- అయోధ్య 1990 : సంక్షోభం నివారించబడింది?
- అయోధ్య 1992 : వివాదానికి దారితీసిన అంశాలు?
- అయోధ్యలో ఏం జరిగింది? ఎందుకు?
- బాబ్రీమసీద్ వివాదంలో1989, 1990సంవత్సరాలలో జరిగిన ప్రధాన మతపరదాడులు?, జాతీయ సమైక్యతామండలి సమావేశపు తీర్మానాలు?, లోక్ సభలో ప్రధాని ప్రకటన, ప్రధాని పంపిన లేఖ, సుప్రీంకోర్టు నివేదకలు, సుప్రీంకోర్టు తీర్పు వంటి అనేక విషయాలను ఈ పుస్తకంలో వివరించటం జరిగింది.
- రావెల సాంబశివరావు
రామజన్మభూమి - బాబ్రీ మసీదు వ్యవహారం అంతకంటే ముందునుండే నడుస్తున్నా 1980ల్లోని నడిమి కాలంలో ఉత్తర భారతదేశంలోని అధిక భాగంలో అది రాజకీయాలను శాసించే విషయంకావటంలోని అసలు నిజాన్ని వెలికి తీయటమే ఈ వాస్తవ వివరణ ప్రయోజనం. అది ప్రధానంగా మతపరమైన విషయమే అయినా దానిని రాజకీయపరంగా, ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే, ఎన్నికల ప్రయోజనాలకోసం బాహాటంగానే కొల్లగొట్టడం జరిగింది. 1989, 1991 సంవత్సరాలల్లో లోక్ సభ ఎన్నికలలోనూ, ఉత్తరప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలోనూ మతావేశం ఓటర్లను తనవైపుకు తిప్పుకుంది. ఇన్నాళ్ల తరువాత ఈ వాస్తవ చిత్రణవల్ల రాజకీయంగా ఏమీ ఉపయోగం లేనట్లు కన్పించవచ్చు - ఎందుకంటే కొన్ని ఎన్నికలలో తప్పుడు సమాచారం రాజ్యమేలింది గనుక. రెండు, మూడు దుర్ఘటనల తరువాతయినా మతాన్ని, ఎన్నికల రాజకీయాల్ని విడగొట్ట గలిగితే భారత లౌకిక పాలనా పద్దతికి ఎంతగానో సేవలందించినట్లే: ప్రజలకు కనువిప్పుకల్గించినట్లే.... పీ.వి. నరసింహారావు(రచయిత గురించి) : భారత ప్రధానిగా శ్రీ పీ.వీ. నరసింహారావు 1996 లో పదవీ విరమణ గావించిన తరువాత 1992 లో అయోధ్యలో ఏం జరిగిందో వ్రాసిపెట్టుకున్నారు. అనేక అనుబంధాలతో కూడిన సుదీర్ఘ అధ్యయనాన్ని ఆయన అనేక కారణాలవల్ల తాము జీవించి ఉండగా ప్రచురించలేదు. 2004 డిసెంబర్ లో ఆయన మరణించే ముందు కొద్దిరోజుల వరకు ఆయన ఈ గ్రంధాన్ని మెరుగులు దిద్దుతూనే ఉన్నారు. రావుగారి కుటుంబ సభ్యుల్ని సంప్రదించి ఆయన కాగితాల నుండి గ్రహించినవే. ఈ గ్రంధానికి ఆధారం. గ్రంధకర్త కోర్కెననుసరించి ఈ గ్రంథం ఆయన మరణానంతరం ప్రచురింపబడుతున్నది. ఈ పుస్తకంలోని కొన్ని ముఖ్యవిషయాలు : - అయోధ్య 1949 : విగ్రహాలు మసీదులోకి? - అయోధ్య 1986 : తాళాలు తీసారు? - అయోధ్య 1989 : శిలాన్యాస్? - అయోధ్య 1990 : సంక్షోభం నివారించబడింది? - అయోధ్య 1992 : వివాదానికి దారితీసిన అంశాలు? - అయోధ్యలో ఏం జరిగింది? ఎందుకు? - బాబ్రీమసీద్ వివాదంలో1989, 1990సంవత్సరాలలో జరిగిన ప్రధాన మతపరదాడులు?, జాతీయ సమైక్యతామండలి సమావేశపు తీర్మానాలు?, లోక్ సభలో ప్రధాని ప్రకటన, ప్రధాని పంపిన లేఖ, సుప్రీంకోర్టు నివేదకలు, సుప్రీంకోర్టు తీర్పు వంటి అనేక విషయాలను ఈ పుస్తకంలో వివరించటం జరిగింది. - రావెల సాంబశివరావు© 2017,www.logili.com All Rights Reserved.