వున్నట్టుండి ఎవరో మెత్తని చేతులతో మన గది తలుపులు కొట్టినట్టు వచ్చేసే తోలి యవ్వనం గురించి, ఇంతకుముందు ఎవరైనా మాట్లాడారా? మాట్లాడినా ఇప్పుడు రాజిరెడ్డి మాట్లాడే పద్ధతి వేరే. తోలి స్పర్శల తెల్లవారు జాము కలల్ని శోధించుకునే పెన్సిల్ రాతలు చదువుతున్నప్పుడు మన పదహారు, పదిహేడుల మీంచి సినిమా రీలు గిర్రున తిప్పుతాడు రాజిరెడ్డి.
'నేను' తప్ప
ఈ ప్రపంచంలో
ఇంకేమి
నాకు లేదు.
నువ్వు తప్ప
ఈ ప్రపంచం నుంచి
ఇంకేమి
నాకు అక్కర్లేదు.
'మన వెలుగూ వెన్నలా ఆమే'
నీకు తెలుసా?
నీవు ఉన్నావన్న
ఒకే ఒక్క కారణంగా
నేను
ఈ ప్రపంచాన్ని
క్షమించేశాను.
'ప్రేమ'
తాత్వికత అనేది అత్యంత గంభీరమైన సత్యాల భోగట్టా అనీ,
మహోదాత్త జీవన వాస్తవికతల మేలుకొలుపు అనీ,
చెప్పుకుంటున్న కాలంలో అనుదిన జీవితం వైపు చూపూ,
ఆలోచనా, అనుభూతుల్ని మళ్ళిస్తున్నాడు రాజిరెడ్డి.
- అఫ్సర్
వున్నట్టుండి ఎవరో మెత్తని చేతులతో మన గది తలుపులు కొట్టినట్టు వచ్చేసే తోలి యవ్వనం గురించి, ఇంతకుముందు ఎవరైనా మాట్లాడారా? మాట్లాడినా ఇప్పుడు రాజిరెడ్డి మాట్లాడే పద్ధతి వేరే. తోలి స్పర్శల తెల్లవారు జాము కలల్ని శోధించుకునే పెన్సిల్ రాతలు చదువుతున్నప్పుడు మన పదహారు, పదిహేడుల మీంచి సినిమా రీలు గిర్రున తిప్పుతాడు రాజిరెడ్డి. 'నేను' తప్ప ఈ ప్రపంచంలో ఇంకేమి నాకు లేదు. నువ్వు తప్ప ఈ ప్రపంచం నుంచి ఇంకేమి నాకు అక్కర్లేదు. 'మన వెలుగూ వెన్నలా ఆమే' నీకు తెలుసా? నీవు ఉన్నావన్న ఒకే ఒక్క కారణంగా నేను ఈ ప్రపంచాన్ని క్షమించేశాను. 'ప్రేమ' తాత్వికత అనేది అత్యంత గంభీరమైన సత్యాల భోగట్టా అనీ, మహోదాత్త జీవన వాస్తవికతల మేలుకొలుపు అనీ, చెప్పుకుంటున్న కాలంలో అనుదిన జీవితం వైపు చూపూ, ఆలోచనా, అనుభూతుల్ని మళ్ళిస్తున్నాడు రాజిరెడ్డి. - అఫ్సర్© 2017,www.logili.com All Rights Reserved.