Panchatantram

By Bojja Tharakam (Author)
Rs.100
Rs.100

Panchatantram
INR
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 5 - 15 Days
Also available in:
Title Price
Panchatantram Rs.400 In Stock
Check for shipping and cod pincode

Description

 

దళిత చరిత్రకు దర్పణం
కోస్తా ఆంధ్రలో అంబేద్కర్ ఆలోచనలతో ప్రభావితమై ఎదిగిన దళిత ఉద్యమ చరిత్రేబొజ్జా తారకం గారి నవల 'పంచతంత్రం'. విద్యా ఉద్యోగావకాశాలనుఅందిపుచ్చుకుంటున్న తొలితరం దళితులుఅప్పుడప్పుడే వారి అనుభవంలోకివస్తున్న 'స్వాతంత్య్రం', మొదటి తరం దళిత నాయకత్వం ఎదిగిన తీరు వంటిఅంశాలను ఈ నవల కళ్ళకు కట్టినట్టు చిత్రించింది. కేవలం పరిశోధన ద్వారారాయగలిగే నవల కాదిది. గొప్ప జీవితానుభవం ఉన్నవాళ్ళు మాత్రమే రాయగలరు.

తారకంగారి తండ్రి బొజ్జా అప్పలస్వామిగారు మొదటితరం అంబేద్కరిస్టు. ఆయనజీవితంపోరాటమే 'పంచతంత్రంనవలకు నేపథ్యం. తారకంగారు కూడా సుదీర్ఘమైనరాజకీయ జీవితం ఉన్న వ్యక్తి. మూడు తరాల పోరాటాలకు ప్రతినిధి. 1947 తర్వాతఎగసిన అంబేద్కర్ ఉద్యమాలతోనే ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది.1970లలో ఉవ్వెత్తున లేచిన రైతాంగ ఉద్యమాలుపౌరహక్కుల ఉద్యమాలు ఆయనను రాటుదేలిన పోరాట యోధుణ్ణి చేశాయి. 1985లో జరిగిన కారంచేడు మారణకాండ ఆయన్ని పూర్తిస్థాయి దళిత నాయకుణ్ణి చేసింది. ఏడుపదుల వయస్సులో లక్ష్మింపేట ఉద్యమాన్ని కూడా ఆయనే ముందుండి నడుపుతున్నారు. ఈ నేపథ్యంరాజకీయ ప్రభావాలుచారిత్రక ఘట్టాలన్నీ 'పంచతంత్రంనవలను అర్థం చేసుకోవడానికిచాలా అవసరం.

తెలుగు దళిత సాహిత్యంలో 'పంచతంత్రంఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందుతుంది. తొలి దశ దళిత ఉద్యమ చరిత్ర కథాంశంగా నవలలు ఇంతవరకూ రాలేదు. గాంధేయవాదాన్ని వదిలించుకుంటూ వామపక్ష ఉద్యమాలకు వెలుపల స్వతంత్రంగా ఎదిగిన దళిత ఉద్యమాల చరిత్ర మీద రాసిన నవలలేమీ లేవు. చిలుకూరి దేవపుత్ర గారి 'పంచమంనవల కారంచేడు తర్వాతి పోరాటాలను చర్చిస్తేకల్యాణరావుగారి 'అంటరాని వసంతంనవల దళితుల సాంస్కృతిక వారసత్వంక్రైస్తవంలోకి మారడంపీడనకు దోపిడీకి వ్యతిరేకంగా వారు చేసిన భూపోరాటాలుచివరగా నక్సలైటు ఉద్యమంలో భాగం కావడాన్ని చిత్రీకరించింది. వేముల ఎల్లయ్య 'కక్క'నవల తెలంగాణ మాదిగ జీవితంభాషసంస్కృతిని వివరిస్తుంది. వీటన్నిటికీ భిన్నంగా 'పంచతంత్రంఆంధ్రలో అంబేద్కర్ ఆలోచనా విధానంతో ప్రభావితమైన దళిత ఉద్యమ క్రమాన్ని చూపిస్తుంది.

మాలపల్లెకుజమీందారీ కుటుంబానికి మధ్య ఘర్షణ ప్రధాన ఇతివృత్తంగా సాగే ఈ నవలలో ముఖ్యపాత్రలు మూడు. కాపు కులస్తుడైన జమీందారు విశ్వనాథంమాల యువకుడు విద్యార్థి నాయకుడు అయిన సూరన్నమిలట్రీలో పనిచేసి వచ్చిన మరో మాల కులస్తుడు సుబ్బారావు. సూరన్న బాల్యం నుంచి అనేక అవమానాలకువివక్షకు గురవుతూ చివరికి తన కృషితో,చైతన్యంతో విద్యార్థి నాయకుడుగా ఎదిగిన తీరును చాలా బాగా చిత్రించారు. 

సుబ్బారావు మాలపల్లెకు నైతిక ధైర్యాన్నిస్తూసూరన్నను కాపాడుకుంటూ దళిత ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తాడు. పాలేర్లుగా,వెట్టిచాకిరీ చేసే కూలీలుగాఅంటరానివారిగా అవమానాలకుఅణచివేతకు గురవుతూ బతుకుతున్న దళితులు విద్యావకాశాల వల్ల,ఉద్యమ చైతన్యం వల్ల, 'స్వాతంత్య్రంతెచ్చిన వెసులుబాటు వల్ల విద్యావంతులుగానాయకులుగా రూపొందడంజమీందార్ల అక్రమ ఆక్రమణ నుండి భూముల్ని తిరిగి తీసుకోవడంజమీందారు ఆస్తులకు అండగా ఉన్న రెవిన్యూ పోలీసు వ్యవస్థను వ్యతిరేకించడం వంటి ఘటనలన్నిటినీ అత్యంత వాస్తవికంగా మన కళ్ళ ముందు నిలిపారు రచయిత. తారకంగారి కథన శైలికవిత్వం తొణికిసలాడే భాష ఈ నవలను మరింత పఠన యోగ్యం చేశాయి.
కె. సత్యనారాయణ
(ఆదివారం ఆంద్ర జ్యోతి 10 మార్చ్ 2013 సౌజన్యం తో )
  దళిత చరిత్రకు దర్పణంకోస్తా ఆంధ్రలో అంబేద్కర్ ఆలోచనలతో ప్రభావితమై ఎదిగిన దళిత ఉద్యమ చరిత్రేబొజ్జా తారకం గారి నవల 'పంచతంత్రం'. విద్యా ఉద్యోగావకాశాలనుఅందిపుచ్చుకుంటున్న తొలితరం దళితులు, అప్పుడప్పుడే వారి అనుభవంలోకివస్తున్న 'స్వాతంత్య్రం', మొదటి తరం దళిత నాయకత్వం ఎదిగిన తీరు వంటిఅంశాలను ఈ నవల కళ్ళకు కట్టినట్టు చిత్రించింది. కేవలం పరిశోధన ద్వారారాయగలిగే నవల కాదిది. గొప్ప జీవితానుభవం ఉన్నవాళ్ళు మాత్రమే రాయగలరు.తారకంగారి తండ్రి బొజ్జా అప్పలస్వామిగారు మొదటితరం అంబేద్కరిస్టు. ఆయనజీవితం, పోరాటమే 'పంచతంత్రం' నవలకు నేపథ్యం. తారకంగారు కూడా సుదీర్ఘమైనరాజకీయ జీవితం ఉన్న వ్యక్తి. మూడు తరాల పోరాటాలకు ప్రతినిధి. 1947 తర్వాతఎగసిన అంబేద్కర్ ఉద్యమాలతోనే ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది.1970లలో ఉవ్వెత్తున లేచిన రైతాంగ ఉద్యమాలు, పౌరహక్కుల ఉద్యమాలు ఆయనను రాటుదేలిన పోరాట యోధుణ్ణి చేశాయి. 1985లో జరిగిన కారంచేడు మారణకాండ ఆయన్ని పూర్తిస్థాయి దళిత నాయకుణ్ణి చేసింది. ఏడుపదుల వయస్సులో లక్ష్మింపేట ఉద్యమాన్ని కూడా ఆయనే ముందుండి నడుపుతున్నారు. ఈ నేపథ్యం, రాజకీయ ప్రభావాలు, చారిత్రక ఘట్టాలన్నీ 'పంచతంత్రం' నవలను అర్థం చేసుకోవడానికిచాలా అవసరం.తెలుగు దళిత సాహిత్యంలో 'పంచతంత్రం' ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందుతుంది. తొలి దశ దళిత ఉద్యమ చరిత్ర కథాంశంగా నవలలు ఇంతవరకూ రాలేదు. గాంధేయవాదాన్ని వదిలించుకుంటూ వామపక్ష ఉద్యమాలకు వెలుపల స్వతంత్రంగా ఎదిగిన దళిత ఉద్యమాల చరిత్ర మీద రాసిన నవలలేమీ లేవు. చిలుకూరి దేవపుత్ర గారి 'పంచమం' నవల కారంచేడు తర్వాతి పోరాటాలను చర్చిస్తే, కల్యాణరావుగారి 'అంటరాని వసంతం' నవల దళితుల సాంస్కృతిక వారసత్వం, క్రైస్తవంలోకి మారడం, పీడనకు దోపిడీకి వ్యతిరేకంగా వారు చేసిన భూపోరాటాలు, చివరగా నక్సలైటు ఉద్యమంలో భాగం కావడాన్ని చిత్రీకరించింది. వేముల ఎల్లయ్య 'కక్క'నవల తెలంగాణ మాదిగ జీవితం, భాష, సంస్కృతిని వివరిస్తుంది. వీటన్నిటికీ భిన్నంగా 'పంచతంత్రం' ఆంధ్రలో అంబేద్కర్ ఆలోచనా విధానంతో ప్రభావితమైన దళిత ఉద్యమ క్రమాన్ని చూపిస్తుంది.మాలపల్లెకు, జమీందారీ కుటుంబానికి మధ్య ఘర్షణ ప్రధాన ఇతివృత్తంగా సాగే ఈ నవలలో ముఖ్యపాత్రలు మూడు. కాపు కులస్తుడైన జమీందారు విశ్వనాథం, మాల యువకుడు విద్యార్థి నాయకుడు అయిన సూరన్న, మిలట్రీలో పనిచేసి వచ్చిన మరో మాల కులస్తుడు సుబ్బారావు. సూరన్న బాల్యం నుంచి అనేక అవమానాలకు, వివక్షకు గురవుతూ చివరికి తన కృషితో,చైతన్యంతో విద్యార్థి నాయకుడుగా ఎదిగిన తీరును చాలా బాగా చిత్రించారు. సుబ్బారావు మాలపల్లెకు నైతిక ధైర్యాన్నిస్తూ, సూరన్నను కాపాడుకుంటూ దళిత ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తాడు. పాలేర్లుగా,వెట్టిచాకిరీ చేసే కూలీలుగా, అంటరానివారిగా అవమానాలకు, అణచివేతకు గురవుతూ బతుకుతున్న దళితులు విద్యావకాశాల వల్ల,ఉద్యమ చైతన్యం వల్ల, 'స్వాతంత్య్రం' తెచ్చిన వెసులుబాటు వల్ల విద్యావంతులుగా, నాయకులుగా రూపొందడం, జమీందార్ల అక్రమ ఆక్రమణ నుండి భూముల్ని తిరిగి తీసుకోవడం, జమీందారు ఆస్తులకు అండగా ఉన్న రెవిన్యూ పోలీసు వ్యవస్థను వ్యతిరేకించడం వంటి ఘటనలన్నిటినీ అత్యంత వాస్తవికంగా మన కళ్ళ ముందు నిలిపారు రచయిత. తారకంగారి కథన శైలి, కవిత్వం తొణికిసలాడే భాష ఈ నవలను మరింత పఠన యోగ్యం చేశాయి.- కె. సత్యనారాయణ (ఆదివారం ఆంద్ర జ్యోతి 10 మార్చ్ 2013 సౌజన్యం తో )

Features

  • : Panchatantram
  • : Bojja Tharakam
  • : HBT
  • : HYDBOOKT97
  • : Paperback
  • : 289
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Panchatantram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam