బాధ నుండి విముక్తినిచ్చేందుకు వైధ్యులు ప్రయత్నిస్తారు. అయితే తెర మీద దర్శకుడు, నేపధ్య సంగీతకారులు కనపడనట్లే, ఒక వైద్యుడు చేసే చికిత్స వెనుక ఎంతో చరిత్ర, ఎందరిదో త్యాగము ఉంది. వైధ్యవిజ్ఞాన్ని ఈనాటి స్థాయికి తెచ్చేందుకు ఎందరో మహనీయులు ఎంతగానో శ్రమించారు. స్థూలంగా కొందరి మేధ, కృషి, త్యాగం గురించి తెలుసుకోవాలన్న ఆకాంక్ష తీర్చడానికే ఈ 'వైధ్యం-శాస్త్రజ్ఞులు'.
ఫ్రాన్స్ కంతటికీ తలమానికమైన సర్జన్ గా రూపొందినవాడు 'డ్యుపుట్రయిన్'. వైధ్యవిద్యార్థిగా దరిద్రంలో ఓలలాడుతూ చదువుకోవడానికి దీపాల్లో నూనె లేక డిసెక్షన్ రూమ్ లో కళేబరాల నుండి వచ్చిన కొవ్వు వాడుకున్నాడు. క్రింది దవడను తొలగించే శాస్త్ర చికిత్స మొదట చేసింది ఇతనే. గర్భకోసపు క్యాన్సర్ లో మొట్టమొదటి సరిగా సెర్విక్స్ ఆపరేషన్ చేసి తొలగించింది ఇతనే. తొలిసారిగా కృత్రిమంగా మలద్వారాన్ని వేరొకచోట ఏర్పాటు చేసింది ఇతనే.
జ్వరాలకు వాడే డోవర్స్ పౌడర్ కనుగొన్న డాక్టర్ ఒక ఓడదొంగ అంటే నమ్ముతారా? పాపులర్ సైన్స్ రచయితగా ఎన్నో విలువైన గ్రంథాలను లక్షల మంది పాఠకులకు అందించిన ప్రముఖ రచయిత డాక్టర్ పరుచూరి రాజారామ్ గారు అందిస్తున్న మరో విజ్ఞాన సౌరభం 'వైధ్యం-శాస్త్రజ్ఞులు'!
ప్రత్యేకంగా ఈ పుస్తకం బాలలకు ఎంతో స్పూర్తిదాయకంగా ఉంటుందని, వాళ్ళు శాస్త్రీయ దృక్పధంతో ఆలోచించేందుకు, ఎదిగేందుకు ఉపకరిస్తుందని ఆశిస్తూ.......
-డాక్టర్ పరుచూరి రాజారామ్.
బాధ నుండి విముక్తినిచ్చేందుకు వైధ్యులు ప్రయత్నిస్తారు. అయితే తెర మీద దర్శకుడు, నేపధ్య సంగీతకారులు కనపడనట్లే, ఒక వైద్యుడు చేసే చికిత్స వెనుక ఎంతో చరిత్ర, ఎందరిదో త్యాగము ఉంది. వైధ్యవిజ్ఞాన్ని ఈనాటి స్థాయికి తెచ్చేందుకు ఎందరో మహనీయులు ఎంతగానో శ్రమించారు. స్థూలంగా కొందరి మేధ, కృషి, త్యాగం గురించి తెలుసుకోవాలన్న ఆకాంక్ష తీర్చడానికే ఈ 'వైధ్యం-శాస్త్రజ్ఞులు'. ఫ్రాన్స్ కంతటికీ తలమానికమైన సర్జన్ గా రూపొందినవాడు 'డ్యుపుట్రయిన్'. వైధ్యవిద్యార్థిగా దరిద్రంలో ఓలలాడుతూ చదువుకోవడానికి దీపాల్లో నూనె లేక డిసెక్షన్ రూమ్ లో కళేబరాల నుండి వచ్చిన కొవ్వు వాడుకున్నాడు. క్రింది దవడను తొలగించే శాస్త్ర చికిత్స మొదట చేసింది ఇతనే. గర్భకోసపు క్యాన్సర్ లో మొట్టమొదటి సరిగా సెర్విక్స్ ఆపరేషన్ చేసి తొలగించింది ఇతనే. తొలిసారిగా కృత్రిమంగా మలద్వారాన్ని వేరొకచోట ఏర్పాటు చేసింది ఇతనే. జ్వరాలకు వాడే డోవర్స్ పౌడర్ కనుగొన్న డాక్టర్ ఒక ఓడదొంగ అంటే నమ్ముతారా? పాపులర్ సైన్స్ రచయితగా ఎన్నో విలువైన గ్రంథాలను లక్షల మంది పాఠకులకు అందించిన ప్రముఖ రచయిత డాక్టర్ పరుచూరి రాజారామ్ గారు అందిస్తున్న మరో విజ్ఞాన సౌరభం 'వైధ్యం-శాస్త్రజ్ఞులు'! ప్రత్యేకంగా ఈ పుస్తకం బాలలకు ఎంతో స్పూర్తిదాయకంగా ఉంటుందని, వాళ్ళు శాస్త్రీయ దృక్పధంతో ఆలోచించేందుకు, ఎదిగేందుకు ఉపకరిస్తుందని ఆశిస్తూ....... -డాక్టర్ పరుచూరి రాజారామ్.© 2017,www.logili.com All Rights Reserved.