ఉసిరి కాయ
ఏదైనా విషయం మనకి క్షుణ్ణంగా తెలిసినప్పుడు "అది నాకు కొట్టిన పిండి” అంటాం తెలుగులో. అదే సంస్కృతంలో ఐతే "కరతలామలకం" అంటాం. “కర తలం" అంటే అరచెయ్యి. "ఆమలకం" అంటే ఉసిరి పండు. అంటే అరచేతిలోని ఉసిరిపండు ఎప్పుడైనా నోట్లో వేసుకుని ఆరగించడానికి ఎలాగైతే అనువుగా, సులువుగా ఉంటుందో, ఏదైనా పని లేదా విషయం మీద మనకి పూర్తి స్పష్టత, కచ్చితమైన అవగాహన ఉన్నప్పుడు (ease and clearness of perception) మాత్రమే మనం ఆ పనిని అంత సులువుగా చేయగలం; ఆ విషయం మీద అంతే అనర్గళంగా మాట్లాడగలం. ఈ జాతీయం ఎప్పుడు, ఎలా పుట్టిందనే విషయం అలావుంచితే, ఉసిరి పండు మాత్రం దానికున్న ఆహార, ఔషధ విలువల రీత్యా ఎప్పుడూ తినదగినట్టిదే. పరగడుపున ఉసిరి పండు తినడమైతే మరింత శ్రేష్ఠం. "అభుక్త్వామలకం పథ్యం" అనే ఆర్యోక్తి అందరికీ తెలిసినదే. "అభుక్త్వా అంటే భుజించక ముందు-అంటే పరగడుపున - ఆమలకం తినదగినది" అని దీని అర్థం.
మన ప్రాచీనులు ఉసిరి పండును త్రిఫలాలలో ఒకటిగా భావించారు. అలా ఔషధ విలువలున్న మూడు ప్రముఖ ఫలాలలో అది ఒకటి. మిగిలిన రెండూ కరక్కాయ, తాని(తాండ్ర) కాయ. ఆయుర్వేదంలో "త్రిఫలాల” తో చేసే ఎన్నో ఔషధ యోగాలున్నాయి.
సంస్కృతంలో "ఆమలకమ్" అని పిలిచే ఉసిరిని హిందీలో "ఆమ్లికా”, "ఆమలక్", "ఆంధ్రా" అనే పేర్లతో పిలుస్తారు. ఈ చెట్టును తమిళంలో "నెల్లి" అనీ, మలయాళంలో "నెల్లి మఠం" అనీ, కన్నడంలో "నెల్లిక" అనీ అంటారు. ఉసిరిని ఆంగ్లంలో Indian Gooseberry అనీ, Emblic Myrobalan (ఎంబ్లిక్ మైరోబలాన్) అనీ అంటారు. ఉసిరి కాయలు పుల్లదనంలోనూ, ఆకారంలోనూ కొంతవరకు పాశ్చాత్య..................
ఉసిరి కాయ ఏదైనా విషయం మనకి క్షుణ్ణంగా తెలిసినప్పుడు "అది నాకు కొట్టిన పిండి” అంటాం తెలుగులో. అదే సంస్కృతంలో ఐతే "కరతలామలకం" అంటాం. “కర తలం" అంటే అరచెయ్యి. "ఆమలకం" అంటే ఉసిరి పండు. అంటే అరచేతిలోని ఉసిరిపండు ఎప్పుడైనా నోట్లో వేసుకుని ఆరగించడానికి ఎలాగైతే అనువుగా, సులువుగా ఉంటుందో, ఏదైనా పని లేదా విషయం మీద మనకి పూర్తి స్పష్టత, కచ్చితమైన అవగాహన ఉన్నప్పుడు (ease and clearness of perception) మాత్రమే మనం ఆ పనిని అంత సులువుగా చేయగలం; ఆ విషయం మీద అంతే అనర్గళంగా మాట్లాడగలం. ఈ జాతీయం ఎప్పుడు, ఎలా పుట్టిందనే విషయం అలావుంచితే, ఉసిరి పండు మాత్రం దానికున్న ఆహార, ఔషధ విలువల రీత్యా ఎప్పుడూ తినదగినట్టిదే. పరగడుపున ఉసిరి పండు తినడమైతే మరింత శ్రేష్ఠం. "అభుక్త్వామలకం పథ్యం" అనే ఆర్యోక్తి అందరికీ తెలిసినదే. "అభుక్త్వా అంటే భుజించక ముందు-అంటే పరగడుపున - ఆమలకం తినదగినది" అని దీని అర్థం. మన ప్రాచీనులు ఉసిరి పండును త్రిఫలాలలో ఒకటిగా భావించారు. అలా ఔషధ విలువలున్న మూడు ప్రముఖ ఫలాలలో అది ఒకటి. మిగిలిన రెండూ కరక్కాయ, తాని(తాండ్ర) కాయ. ఆయుర్వేదంలో "త్రిఫలాల” తో చేసే ఎన్నో ఔషధ యోగాలున్నాయి. సంస్కృతంలో "ఆమలకమ్" అని పిలిచే ఉసిరిని హిందీలో "ఆమ్లికా”, "ఆమలక్", "ఆంధ్రా" అనే పేర్లతో పిలుస్తారు. ఈ చెట్టును తమిళంలో "నెల్లి" అనీ, మలయాళంలో "నెల్లి మఠం" అనీ, కన్నడంలో "నెల్లిక" అనీ అంటారు. ఉసిరిని ఆంగ్లంలో Indian Gooseberry అనీ, Emblic Myrobalan (ఎంబ్లిక్ మైరోబలాన్) అనీ అంటారు. ఉసిరి కాయలు పుల్లదనంలోనూ, ఆకారంలోనూ కొంతవరకు పాశ్చాత్య..................© 2017,www.logili.com All Rights Reserved.