ఆదిలాబాద్ నేలలు నిన్న మొన్నటిదాకా దట్టమయిన అడవిని మోసిన ఎగుడు దిగుడు నేలలయినప్పటికీ చాలా సారవంతమయిన నల్లరేగడి నేలలు. కొంచెం శ్రద్ధ పెట్టే పాలకులుంటే బంగారం పండించగలవు. కానీ ఇక్కడి జనం అత్యధికంగా ఆదివాసులు కావడం వల్ల వీరి విషయంలో శ్రద్ధ పెట్టవలసిన అగత్యం ఉన్నట్టు ఈ రాష్ట్రాన్ని ఏలిన ఏ పార్టీ భావించలేదు. నిజానికి ఇది ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ తాలూకాలకే కాదు మొత్తంగా ఆ జిల్లాకే వర్తిస్తుంది. ఆ జిల్లాలో బలమైన స్థానిక శూద్ర వ్యవసాయదారుల కులమేదీ లేదు. దేశంలో అటువంటి ప్రాంతాలేవీ గడిచిన యాభై ఏళ్లలో వ్యవసాయ అభివృద్ధిని సాధించలేదు.
కార్గిల్ లో భారత సైనికులు ఎంతమంది చనిపోయారన్నది వివాదాస్పదంగా ఉండవచ్చుగానీ విశాఖపట్నంలో మాత్రం ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం కూడా అంతకంటే ఎక్కువ మంది ఆదివాసులు 'విషజ్వరాలకు' చనిపోయారు. అయితే వీళ్ళ కోసం ఎవరూ నిధులు వసూలు చేయలేదు, ఏ సినీతారలూ సంఘీభావంగా ఊరేగింపులు తీయలేదు, ఏ ప్రభుత్వ ఉద్యోగులూ ఒక రోజు జీతం ఇవ్వలేదు, ఏ చంద్రబాబూ సానుభూతి ప్రదర్శన నిర్వహించలేదు. సైన్యం కంటే ఏజెన్సీ ఆదివాసులకే ఇవి ఎక్కువ అవసరం అని వేరే చెప్పనవసరం లేదు. కానీ మన 'దేశభక్తి' స్వరూపం అట్లాంటిది.
- కె బాలగోపాల్
ఆదిలాబాద్ నేలలు నిన్న మొన్నటిదాకా దట్టమయిన అడవిని మోసిన ఎగుడు దిగుడు నేలలయినప్పటికీ చాలా సారవంతమయిన నల్లరేగడి నేలలు. కొంచెం శ్రద్ధ పెట్టే పాలకులుంటే బంగారం పండించగలవు. కానీ ఇక్కడి జనం అత్యధికంగా ఆదివాసులు కావడం వల్ల వీరి విషయంలో శ్రద్ధ పెట్టవలసిన అగత్యం ఉన్నట్టు ఈ రాష్ట్రాన్ని ఏలిన ఏ పార్టీ భావించలేదు. నిజానికి ఇది ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ తాలూకాలకే కాదు మొత్తంగా ఆ జిల్లాకే వర్తిస్తుంది. ఆ జిల్లాలో బలమైన స్థానిక శూద్ర వ్యవసాయదారుల కులమేదీ లేదు. దేశంలో అటువంటి ప్రాంతాలేవీ గడిచిన యాభై ఏళ్లలో వ్యవసాయ అభివృద్ధిని సాధించలేదు. కార్గిల్ లో భారత సైనికులు ఎంతమంది చనిపోయారన్నది వివాదాస్పదంగా ఉండవచ్చుగానీ విశాఖపట్నంలో మాత్రం ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం కూడా అంతకంటే ఎక్కువ మంది ఆదివాసులు 'విషజ్వరాలకు' చనిపోయారు. అయితే వీళ్ళ కోసం ఎవరూ నిధులు వసూలు చేయలేదు, ఏ సినీతారలూ సంఘీభావంగా ఊరేగింపులు తీయలేదు, ఏ ప్రభుత్వ ఉద్యోగులూ ఒక రోజు జీతం ఇవ్వలేదు, ఏ చంద్రబాబూ సానుభూతి ప్రదర్శన నిర్వహించలేదు. సైన్యం కంటే ఏజెన్సీ ఆదివాసులకే ఇవి ఎక్కువ అవసరం అని వేరే చెప్పనవసరం లేదు. కానీ మన 'దేశభక్తి' స్వరూపం అట్లాంటిది. - కె బాలగోపాల్© 2017,www.logili.com All Rights Reserved.