"స్వర రాగ కదంబం గురించి....
కర్ణాటక సంగీత పాఠక పుస్తకాలు వివిధ భాషలలో అనేకం ప్రచురితమయ్యాయి. వీటిలో సరళీస్వరములతో మొదలైన అటతాళ వర్ణముల వరకు ఆయా పాఠకంశాల వివరణ, వాటి రాగ లక్షణముల వివరణ సర్వసాధారణంగ మనం గమనించుతాము.
స్వర రాగ కదంబం వీటన్నిటికి భిన్నంగా ఒక ప్రత్యేకత కలిగి ఉంది. కర్ణాటక సంగీత విద్యార్ధులకు, సంగీత ప్రియులకు ఉపయోగకరంగా రూపొందించబడిన ఈ పుస్తకంలో సరళీస్వరములు మొదలుకొని మంగళం వరకూ గల కొన్ని ప్రఖ్యాత రచనలను స్పృశించడం జరిగింది. సప్తస్వరాల పరిచయం, పాట ఆవిర్భావం, రాగ లక్షణం, అభ్యాసాలు వగైరాల పరిచయమే కాక గీతములు, స్వరజతులు, కృతులలోని సాహిత్యానికి ప్రతిపదార్ధాలు విపులీకరించబడ్డాయి, ప్రతి పాఠానికి ముందు ఆ పాఠానికి సంబంధించిన విషయ జ్ఞానాన్ని పొందుపరిచి, ప్రత్యక్షంగా సంగీతానికి అత్యంత ఆవశ్యకమైన గురు శిష్య సంబంధంపై ఒక అవగాహన కలిగించడం జరిగింది.
కర్ణాటక సంగీతానికి ఎంతో సేవ చేసిన నాటి వాగ్గేయకారుల జీవిత విశేషాలే కాక సంగీత సరస్వతికీ ముద్దుబిడ్డలైన ఎందరో సంగీతజ్ఞుల చిత్రాలతో నేటి తరం విద్యార్ధులకు ఆసక్తి కలిగించే విధంగా స్వర రాగ కదంబం రూపొందించబడింది.
భాషాపరంగా 'రాగం' అంటే 'అనురాగం', 'రంగు' అర్ధాలు. సంగీతానికి మూలమైన స్వరాలను రాగరంజితమైన పుష్పగుచ్చంగా సంగీత సరస్వతికి వినమ్రతతో సమర్పించే ఓ చిరు ప్రయత్నమే ఈ స్వర రాగ కదంబం..
శ్రీ పోలాకి సూర్యనారాయణ (గ్రంథకర్త గురించి) :
శ్రీ పోలాకి సూర్యనారాయణ గారు శ్రీమతి అనసూయ, శ్రీ రాజారావు గారి పుత్రుడు. వీరు విజయనగరంలో జన్మించారు. సంగీత ప్రవీణ, శ్రీ వెంకటేశ్వరా విశ్వవిద్యాలయం, తిరుపతి డిప్లోమో మరియు సర్టిఫికెట్ మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల, విజయనగరంలో వీరి విద్యాభ్యాసం. మహామహోపాధ్యాయ పద్మభూషణ్ డాక్టర్ నూకల చినసత్యనారాయణ గారి మానస పుత్రుడు. శ్రీ ద్వారం దుర్గా ప్రసాద్, డాక్టర్ మైధిలీ, శ్రీ పి.వి.ఎస్.ఎస్.శాస్త్రి, శ్రీ బి.ఎ.నారాయణ, శ్రీ పి.రాజు, శ్రీ పి.చిన్న గారు వీరి గురువులు.
1986 - భారత ప్రభుత్వం మానవ వనరుల మంత్రిత్వ శాఖ వారి జాతీయ స్కాలర్ షిప్. 1997-98 ఆంధ్రప్రదేశ రాష్ట్ర ప్రభుత్వ 'ఉత్తమ గాయకుడు' పురస్కారం, బంగారు పతకం. వీరికి గుర్తింపు తెచ్చింది.
ప్రముఖ సంస్థలలో కచేరీలు, ప్రసంగాలు : ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, భక్తి టివి మరియు ఎన్నో సాంస్కృతిక సంస్థల వారి కచేరీలు, ఆయా కార్యక్రమాలకు సలహాదారుగా వ్యవహరించారు.
నార్త్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్, అలహాబాదు నిర్వహించిన సమావేశంలో "కర్ణాటక సంగీత ప్రక్రియలు" అనే అంశం పై ప్రసంగం. శ్రీ పోలాకి సూర్యనారాయణగారు నిర్వహించిన సెమినార్లు.
కేరళ రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహించిన సెమినార్లలో ప్రసంగాలు, కచేరీలు
ప్రస్తుతం వీరు సప్తపర్ణిలో కర్ణాటక సంగీత శిక్షణా తరగతులు మరియు ఇంటర్నెట్ ద్వారా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.
"స్వర రాగ కదంబం గురించి.... కర్ణాటక సంగీత పాఠక పుస్తకాలు వివిధ భాషలలో అనేకం ప్రచురితమయ్యాయి. వీటిలో సరళీస్వరములతో మొదలైన అటతాళ వర్ణముల వరకు ఆయా పాఠకంశాల వివరణ, వాటి రాగ లక్షణముల వివరణ సర్వసాధారణంగ మనం గమనించుతాము. స్వర రాగ కదంబం వీటన్నిటికి భిన్నంగా ఒక ప్రత్యేకత కలిగి ఉంది. కర్ణాటక సంగీత విద్యార్ధులకు, సంగీత ప్రియులకు ఉపయోగకరంగా రూపొందించబడిన ఈ పుస్తకంలో సరళీస్వరములు మొదలుకొని మంగళం వరకూ గల కొన్ని ప్రఖ్యాత రచనలను స్పృశించడం జరిగింది. సప్తస్వరాల పరిచయం, పాట ఆవిర్భావం, రాగ లక్షణం, అభ్యాసాలు వగైరాల పరిచయమే కాక గీతములు, స్వరజతులు, కృతులలోని సాహిత్యానికి ప్రతిపదార్ధాలు విపులీకరించబడ్డాయి, ప్రతి పాఠానికి ముందు ఆ పాఠానికి సంబంధించిన విషయ జ్ఞానాన్ని పొందుపరిచి, ప్రత్యక్షంగా సంగీతానికి అత్యంత ఆవశ్యకమైన గురు శిష్య సంబంధంపై ఒక అవగాహన కలిగించడం జరిగింది. కర్ణాటక సంగీతానికి ఎంతో సేవ చేసిన నాటి వాగ్గేయకారుల జీవిత విశేషాలే కాక సంగీత సరస్వతికీ ముద్దుబిడ్డలైన ఎందరో సంగీతజ్ఞుల చిత్రాలతో నేటి తరం విద్యార్ధులకు ఆసక్తి కలిగించే విధంగా స్వర రాగ కదంబం రూపొందించబడింది. భాషాపరంగా 'రాగం' అంటే 'అనురాగం', 'రంగు' అర్ధాలు. సంగీతానికి మూలమైన స్వరాలను రాగరంజితమైన పుష్పగుచ్చంగా సంగీత సరస్వతికి వినమ్రతతో సమర్పించే ఓ చిరు ప్రయత్నమే ఈ స్వర రాగ కదంబం.. శ్రీ పోలాకి సూర్యనారాయణ (గ్రంథకర్త గురించి) : శ్రీ పోలాకి సూర్యనారాయణ గారు శ్రీమతి అనసూయ, శ్రీ రాజారావు గారి పుత్రుడు. వీరు విజయనగరంలో జన్మించారు. సంగీత ప్రవీణ, శ్రీ వెంకటేశ్వరా విశ్వవిద్యాలయం, తిరుపతి డిప్లోమో మరియు సర్టిఫికెట్ మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల, విజయనగరంలో వీరి విద్యాభ్యాసం. మహామహోపాధ్యాయ పద్మభూషణ్ డాక్టర్ నూకల చినసత్యనారాయణ గారి మానస పుత్రుడు. శ్రీ ద్వారం దుర్గా ప్రసాద్, డాక్టర్ మైధిలీ, శ్రీ పి.వి.ఎస్.ఎస్.శాస్త్రి, శ్రీ బి.ఎ.నారాయణ, శ్రీ పి.రాజు, శ్రీ పి.చిన్న గారు వీరి గురువులు. 1986 - భారత ప్రభుత్వం మానవ వనరుల మంత్రిత్వ శాఖ వారి జాతీయ స్కాలర్ షిప్. 1997-98 ఆంధ్రప్రదేశ రాష్ట్ర ప్రభుత్వ 'ఉత్తమ గాయకుడు' పురస్కారం, బంగారు పతకం. వీరికి గుర్తింపు తెచ్చింది. ప్రముఖ సంస్థలలో కచేరీలు, ప్రసంగాలు : ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, భక్తి టివి మరియు ఎన్నో సాంస్కృతిక సంస్థల వారి కచేరీలు, ఆయా కార్యక్రమాలకు సలహాదారుగా వ్యవహరించారు. నార్త్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్, అలహాబాదు నిర్వహించిన సమావేశంలో "కర్ణాటక సంగీత ప్రక్రియలు" అనే అంశం పై ప్రసంగం. శ్రీ పోలాకి సూర్యనారాయణగారు నిర్వహించిన సెమినార్లు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహించిన సెమినార్లలో ప్రసంగాలు, కచేరీలు ప్రస్తుతం వీరు సప్తపర్ణిలో కర్ణాటక సంగీత శిక్షణా తరగతులు మరియు ఇంటర్నెట్ ద్వారా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.
© 2017,www.logili.com All Rights Reserved.