'ప్రగతి పదంలో భారత మహిళ' అనే పేరుతో జానమద్ది హనుమచ్చాస్త్రి గారు అనేక మంది భారతీయ మహిళల సంక్షిప్త జీవన రేఖలు గ్రంధంగా కూర్చారు. వీరంతా భారతదేశ చరిత్రలో ఆధునిక యుగారంభం నుంచి ఈనాటి వరకు వివిధ రంగాలలో కృషిచేసి, తమ ముద్రను సమాజం మీద వేసినవారే. ఈ మహిళల్లో జన్మత విదేశీయులైనవారున్నారు వారు భారతదేశం వచ్చి భారతీయ సమాజానికి సేవలందించారు. జన్మతః భారతీయులైనాగాని విదేశాలలో కృషిచేసిన మీరానాయర్ వంటి వారి జీవనరేఖలు ఇందులో ఉన్నాయి. సంగీతం, నాట్యం, నటన మొదలైన కళారంగాల్లో తమ ముద్ర వేసిన ఆనాటి బెంగుళూరు నాగరత్నమ్మ నుంచి ఇటీవలి ఏమ్. ఎస్.సుబ్బలక్ష్మి, ఇప్పటి లతామంగేష్కర్, యామినీ కృష్ణమూర్తి వంటి కళాకారిణుల జీవిత పరిచయాలూ ఉన్నాయి. స్వాతంత్రోద్యమ సమరంలో తమ విబిన్న దృక్పదాలతో ఉద్యమకృషి నిర్వహించిన లక్ష్మి సెహగాల్, అరుణా ఆసఫ్ అలీ వంటి మహిళల పరిచయాలూ ఇందులో లభిస్తాయి.
'ప్రగతి పదంలో భారత మహిళ' అనే పేరుతో జానమద్ది హనుమచ్చాస్త్రి గారు అనేక మంది భారతీయ మహిళల సంక్షిప్త జీవన రేఖలు గ్రంధంగా కూర్చారు. వీరంతా భారతదేశ చరిత్రలో ఆధునిక యుగారంభం నుంచి ఈనాటి వరకు వివిధ రంగాలలో కృషిచేసి, తమ ముద్రను సమాజం మీద వేసినవారే. ఈ మహిళల్లో జన్మత విదేశీయులైనవారున్నారు వారు భారతదేశం వచ్చి భారతీయ సమాజానికి సేవలందించారు. జన్మతః భారతీయులైనాగాని విదేశాలలో కృషిచేసిన మీరానాయర్ వంటి వారి జీవనరేఖలు ఇందులో ఉన్నాయి. సంగీతం, నాట్యం, నటన మొదలైన కళారంగాల్లో తమ ముద్ర వేసిన ఆనాటి బెంగుళూరు నాగరత్నమ్మ నుంచి ఇటీవలి ఏమ్. ఎస్.సుబ్బలక్ష్మి, ఇప్పటి లతామంగేష్కర్, యామినీ కృష్ణమూర్తి వంటి కళాకారిణుల జీవిత పరిచయాలూ ఉన్నాయి. స్వాతంత్రోద్యమ సమరంలో తమ విబిన్న దృక్పదాలతో ఉద్యమకృషి నిర్వహించిన లక్ష్మి సెహగాల్, అరుణా ఆసఫ్ అలీ వంటి మహిళల పరిచయాలూ ఇందులో లభిస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.