మారిన అస్తిత్వ సందర్భానికి 'ప్రాతినిధ్యం'!
-జీవిత ఉత్సవం
-స్త్రీత్వం అంటే...
-మనుషుల గురించిన అడవి కథలు
-చిందు బాగోతం
-'దృక్పథ' వికాసం
-'వేమన పద్య' చిత్రాలు
నాలుగు రచనలను ఒకచోట సంకలనం చేసినపుడు, వాటిలో ఒకటో రెండో బాగుండడం ఒకరకమైన ప్రాతినిధ్యం. సంకలనం లక్ష్య ప్రకటనను అవి ప్రతిఫలిస్తాయి. ఈ అర్థంలోనే అవి 'బాగుంటాయి'. అయితే, మరోరకం ప్రాతినిధ్యాన్ని కూడా మనం చూస్తాం. రాజకీయ, సామాజిక పొరల్లోంచి బలంగాను, అంతే విలక్షణతోను వినిపించే గొంతుకలకూ ప్రాతినిధ్య స్వభావం ఉంటుంది.
అటువంటి ప్రాతినిధ్యం... అస్తిత్వవరణానికి కొత్త కోణాలను, వర్ణాలను అందిస్తుంది. ప్రముఖ రచయిత్రులు డా. సామాన్య, కుప్పిలి పద్మ సంకలనం చేసిన 'ప్రాతినిధ్య' కథల్లో సరిగ్గా అటువంటి ప్రయత్నమే జరిగింది. శివసాగర్ ముఖచిత్రంతో వచ్చిన ఈ సంకలనంలో 2012లో వివిధ పత్రికల్లో అచ్చయిన కథల్లోంచి 13 ఎంపిక చేసి ప్రచురించారు. సంపాదకుల మాటల్లో చెప్పాలంటే... ఇది తొలి అడుగు. అంటే, ఏటా ఒక సిరీస్‌లా 'ప్రాతినిధ్య' కథలను అందిస్తారన్నమాట.
పనిగంటలు-రాజ్యాధికారం-శరీర అంగాలపై స్వీయ అధికారం దిశగా స్త్రీవాద రాజకీయాలు ఎదిగిన క్రమం మనకు తెలుసు. అలాగే, భూమి-ఆత్మగౌరవం-రాజ్యాంగంలో భాగమైన అ«ధికారం వైపుగా దళిత ఉద్యమం రూపొందుతున్న తీరూ అనుభవమే. సొంత అనుభవానికి, సామాజిక వాస్తవికతకు మధ్య గల గతితర్కాన్ని అర్థం చేసుకునేందుకు ఈ రెండు అస్తిత్వ ఉద్యమాలూ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమం మరింత విస్తరించి... వలస పాలన-జాతీయోద్యమం-మార్కెట్‌తో అనుసంధానం దిశగా అస్తిత్వవాద చర్చ పదునెక్కింది. 1990ల్లో సరళీకృత ఆర్థిక విధానాలు, 2000 సంవత్సరం నుంచి ఎన్జీవోలు, పర్యావరణ రాజకీయాలు ఈ చర్చను కొత్త మలుపు తిప్పాయి.
ఒకరకంగా చెప్పాలంటే... 1990ల నాటి అస్తిత్వ ప్రశ్నలను రద్దు చేస్తూనో, దిద్దుబాటు చేస్తూనో... 2000 తరువాత మారిన ప్రాధాన్యాలను నమోదు చేస్తూనో... 'ప్రాతినిధ్య' కథలు సాగాయి. అమెరికన్-ఆఫ్రికన్ సాహిత్యంలో 'నలుపు' ఆత్మగౌరవ చిహ్నంగా నిగనిగలాడగా, దళిత ఉద్యమం దాన్ని ఉన్నతీకరించింది. దళిత విద్యావంతురాలి కోణంలోంచి... 'నలుపు'కు ఉండే నిరాకరణ, గుర్తింపు కోణాలు... రెండింటినీ వినోదిని సవాల్ చేస్తుంది (ప్రియుడు కావాలి).
విధ్వంసం-అభివృద్ధికి మధ్య గల గతితర్కంలో మనిషికి లేశమాత్ర పాత్ర కూడా లేదన్న దిగ్భ్రాంతికరమైన సమాజ పరిణామ వాస్తవాన్ని సామాన్య పట్టుకున్నారు (జర్నీ), నిర్వాసిత్వంతో ముడిపడిన పర్యావరణ అస్తిత్వ ఉద్యమాలకు ఇది ఒకరకమైన సవాలే. ఇక అద్దె గర్భాల సమస్యను పేదరికం వైపు నుంచి కాక, స్త్రీలలో పెరిగిన ఆర్థిక చైతన్యం వైపు నుంచి కుప్పిలి పద్మ చర్చించారు (మదర్‌హుడ్-రియాల్టీ చెక్). శిల్పం-శైలీల కోసం రాస్తున్న కాలం కాదని సంపాదకులు ఎలాగూ అన్నారు కాబట్టి... ఆ వైపునకు మనమూ వెళ్ళాల్సిన పని లేదు. కాకపోతే, సైంటిస్టుగా పనిచేస్తున్న ఆవిడకు గత రెండు, మూడు దశాబ్దాలుగా గ్రామీణ జీవనంలో వస్తున్న మార్పులేవీ తెలియవని అనుకోవాలా? (జర్నీ) కులం పట్టు పట్టణాల్లోనూ సడలలేదని తెలిసీ... మరోసారి దాన్ని నిరూపించే ప్రయత్నం ఎందుకో? (అవుటాఫ్ కవరేజ్ ఏరియా- పసునూరి రవీందర్).
© 2017,www.logili.com All Rights Reserved.