మన హృదయాలలోనే ప్రతినిత్యం ఒక పెద్ద కురుక్షేత్రం జరుగుతూంది. మంచి ఆలోచనల్ని ఒకవైపు, చెడు ఆలోచనలన్నీ ఇంకొకవైపు నిలిచి, నిత్యం ఘర్షణపడుతుంటాయి. ఈ పోరాటానికి భారత యుద్ధాన్నే దృష్టాంతంగా చూపుతారు కొందరు. భారతంలో ఉపాఖ్యానాలకు, పంచతంత్రంలో కధలకు మన ఇతిహాసాలలో సామ్యాలు చూపుతూ వ్యాఖ్యానాలు వ్రాసి సమాధానాలు చెప్పినవారు కూడా ఉన్నారు కొందరు. మన పవిత్ర పురాణాలన్నీ కట్టుకధలంటే నేను ఒప్పుకోను. మంచి చెడ్డల మధ్య పోరాటానికి రెండు పక్షాలు వహించి నిలవడం మనకు వీలవుతుందా? శ్రీ కృష్ణుడు, అర్జునుడు, సీత, హనుమంతుడు, భరతుడు మొదలయిన పాత్రలన్నీ సత్యం మూర్తీభవించిన పుజావిగ్రహాలు కాని, కేవలం కధలలోని పాత్రలు కావు. పెద్దలను ఆదర్శపురుషులను వీరులుగా చేసి వీరపూజ చేయడం, వారిని అనుసరించడం ఒక పద్ధతి. కధలు చదివి అందులో ఉన్న ప్రకారం అనుసరించడం మరో పద్ధతి. భరతుడు, సీత, భీముడు ఇలాంటివారిని అనుసరించడం, మూర్తీభవించిన ఆదర్శాలను అనుసరించినట్లే ! దాహం వేసినప్పుడు ఆ దాహం తీరడానికి గంగా, కావేరి , కృష్ణ, గోదావరిలాంటి నడులనుంచి నీరు తీసుకోవచ్చు. కాని ఆ నీరు తీసుకోవడానికి దగిన సాధనాలు మాత్రం అందుబాటులో లేవు. నిజానికి ఈ జీవనదులన్ని దైవసమానమైనవి. వాటిని కొలిచి, ఆరాధించాలి. రామాయణం,భారతం మనకు అలంటి జీవనదుల వంటివి. ఆ పుణ్యనదులలో మునిగి అంతా తరిద్దాం రండి !
...... చక్రవర్తి రాజగోపాలాచార్య
రాజాజీగా ప్రసిద్ధుడైన చక్రవర్తి రాజగోపాలాచారి (Chakravarthi Rajagopalachari) స్వాతంత్ర సమరయోధుడు మరియు రాజకీయవేత్త. స్వతంత్ర భారతదేశపు మొదటి మరియు చివరి గవర్నర్ జనరల్. ఆయన సంయుక్త మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1937లో పనిచేశాడు. భారతదేశపు అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందిన తొలివ్యక్తులలో ఒకడు (1954లో). రాజాజీతమిళనాడు రాష్ట్రములోని సేలం జిల్లా, తోరపల్లి గ్రామములో 1878, డిసెంబర్ 10న జన్మించాడు.
(ఈ సంవత్సరం కొత్తగా విడుదల అయిన పుస్తకం.)
మన హృదయాలలోనే ప్రతినిత్యం ఒక పెద్ద కురుక్షేత్రం జరుగుతూంది. మంచి ఆలోచనల్ని ఒకవైపు, చెడు ఆలోచనలన్నీ ఇంకొకవైపు నిలిచి, నిత్యం ఘర్షణపడుతుంటాయి. ఈ పోరాటానికి భారత యుద్ధాన్నే దృష్టాంతంగా చూపుతారు కొందరు. భారతంలో ఉపాఖ్యానాలకు, పంచతంత్రంలో కధలకు మన ఇతిహాసాలలో సామ్యాలు చూపుతూ వ్యాఖ్యానాలు వ్రాసి సమాధానాలు చెప్పినవారు కూడా ఉన్నారు కొందరు. మన పవిత్ర పురాణాలన్నీ కట్టుకధలంటే నేను ఒప్పుకోను. మంచి చెడ్డల మధ్య పోరాటానికి రెండు పక్షాలు వహించి నిలవడం మనకు వీలవుతుందా? శ్రీ కృష్ణుడు, అర్జునుడు, సీత, హనుమంతుడు, భరతుడు మొదలయిన పాత్రలన్నీ సత్యం మూర్తీభవించిన పుజావిగ్రహాలు కాని, కేవలం కధలలోని పాత్రలు కావు. పెద్దలను ఆదర్శపురుషులను వీరులుగా చేసి వీరపూజ చేయడం, వారిని అనుసరించడం ఒక పద్ధతి. కధలు చదివి అందులో ఉన్న ప్రకారం అనుసరించడం మరో పద్ధతి. భరతుడు, సీత, భీముడు ఇలాంటివారిని అనుసరించడం, మూర్తీభవించిన ఆదర్శాలను అనుసరించినట్లే ! దాహం వేసినప్పుడు ఆ దాహం తీరడానికి గంగా, కావేరి , కృష్ణ, గోదావరిలాంటి నడులనుంచి నీరు తీసుకోవచ్చు. కాని ఆ నీరు తీసుకోవడానికి దగిన సాధనాలు మాత్రం అందుబాటులో లేవు. నిజానికి ఈ జీవనదులన్ని దైవసమానమైనవి. వాటిని కొలిచి, ఆరాధించాలి. రామాయణం,భారతం మనకు అలంటి జీవనదుల వంటివి. ఆ పుణ్యనదులలో మునిగి అంతా తరిద్దాం రండి ! ...... చక్రవర్తి రాజగోపాలాచార్య రాజాజీగా ప్రసిద్ధుడైన చక్రవర్తి రాజగోపాలాచారి (Chakravarthi Rajagopalachari) స్వాతంత్ర సమరయోధుడు మరియు రాజకీయవేత్త. స్వతంత్ర భారతదేశపు మొదటి మరియు చివరి గవర్నర్ జనరల్. ఆయన సంయుక్త మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1937లో పనిచేశాడు. భారతదేశపు అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందిన తొలివ్యక్తులలో ఒకడు (1954లో). రాజాజీతమిళనాడు రాష్ట్రములోని సేలం జిల్లా, తోరపల్లి గ్రామములో 1878, డిసెంబర్ 10న జన్మించాడు. (ఈ సంవత్సరం కొత్తగా విడుదల అయిన పుస్తకం.)© 2017,www.logili.com All Rights Reserved.