రాజాజీ గాంధీకి సన్నిహితుడయినా, తర్వాత బంధువయినా, చాలా విషయాలలో గాంధీజీని అనుసరించినా తరచూ గాంధీజీతో విభేదిస్తూ కూడా వచ్చాడు. మహోన్నత పదవి, ఆఖరు గవర్నర్ జనరల్ పదవిని చేపట్టినా కూడా ఆ తర్వాత దీనికన్నా చిన్న పదవులను చేపట్టడంలో అధికారం పై మోజుకన్నా, ఆకర్షణకన్నా, కార్యనిర్వహణ పై ధ్యాస - బహుశా భగవద్గీతలోని అనాసక్తి యోగంలోని నిష్కామకర్మ ప్రభావం కూడా ఉందేమో. రాజాజీ స్వాతంత్ర్యసమరంలో పాల్గొనడం వాళ్ళ ఒక ప్రధాన ప్రయోజనం నెరవేరింది. దక్షిణ భారతదేశం భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఉత్తర భారతదేశంతో పాటూ క్రియాశీలంగా భాగస్వామిగా కొనసాగడం తద్వారా దేశ సమగ్రతకు దోహదం చేయడం ఈ ప్రయోజనం.
గాంధీజీలాంటివారు గొప్ప ఆశయాలు, విలువలు ప్రతిపాదించడంలో అందెవేసిన చేతులైతే, పటేలు, రాజాజీలు ఈ ఆశయాలనూ, విలువలనూ అమలుపరచడానికి అవసరమైన విధానాలను, పద్ధతులను సమకూర్చడంలో చాలా శ్రమ చేసినవారు. ఈ పుస్తకం చదివితే పటేలుకు, రాజాజీకి మధ్య ఉన్న సాన్నిహిత్యం వారి ఆలోచనలూ, భావాలలో గల సామీప్యం అర్థమవుతుంది. చాలా సందర్భాలలో వాళ్ళిద్దరూ ఎంతో ప్రాక్టికల్ గా కనిపిస్తారు. ఇద్దరికీ వున్నా భేదం ఒక్కటే. రాజాజీ గొప్ప రచయిత కూడా కావడం. రాజాజీ, పటేల్ ల ఆలోచనాధారలలో సమానలక్షణాలున్నాయి. పటేల్ లో ఆచరణాత్మకంగా కనిపించే కొన్ని లక్షణాలు రాజాజీ కాలంలో వ్యక్తమవుతాయి.
- అడ్లూరు రఘురామరాజు
రాజాజీ గాంధీకి సన్నిహితుడయినా, తర్వాత బంధువయినా, చాలా విషయాలలో గాంధీజీని అనుసరించినా తరచూ గాంధీజీతో విభేదిస్తూ కూడా వచ్చాడు. మహోన్నత పదవి, ఆఖరు గవర్నర్ జనరల్ పదవిని చేపట్టినా కూడా ఆ తర్వాత దీనికన్నా చిన్న పదవులను చేపట్టడంలో అధికారం పై మోజుకన్నా, ఆకర్షణకన్నా, కార్యనిర్వహణ పై ధ్యాస - బహుశా భగవద్గీతలోని అనాసక్తి యోగంలోని నిష్కామకర్మ ప్రభావం కూడా ఉందేమో. రాజాజీ స్వాతంత్ర్యసమరంలో పాల్గొనడం వాళ్ళ ఒక ప్రధాన ప్రయోజనం నెరవేరింది. దక్షిణ భారతదేశం భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఉత్తర భారతదేశంతో పాటూ క్రియాశీలంగా భాగస్వామిగా కొనసాగడం తద్వారా దేశ సమగ్రతకు దోహదం చేయడం ఈ ప్రయోజనం. గాంధీజీలాంటివారు గొప్ప ఆశయాలు, విలువలు ప్రతిపాదించడంలో అందెవేసిన చేతులైతే, పటేలు, రాజాజీలు ఈ ఆశయాలనూ, విలువలనూ అమలుపరచడానికి అవసరమైన విధానాలను, పద్ధతులను సమకూర్చడంలో చాలా శ్రమ చేసినవారు. ఈ పుస్తకం చదివితే పటేలుకు, రాజాజీకి మధ్య ఉన్న సాన్నిహిత్యం వారి ఆలోచనలూ, భావాలలో గల సామీప్యం అర్థమవుతుంది. చాలా సందర్భాలలో వాళ్ళిద్దరూ ఎంతో ప్రాక్టికల్ గా కనిపిస్తారు. ఇద్దరికీ వున్నా భేదం ఒక్కటే. రాజాజీ గొప్ప రచయిత కూడా కావడం. రాజాజీ, పటేల్ ల ఆలోచనాధారలలో సమానలక్షణాలున్నాయి. పటేల్ లో ఆచరణాత్మకంగా కనిపించే కొన్ని లక్షణాలు రాజాజీ కాలంలో వ్యక్తమవుతాయి. - అడ్లూరు రఘురామరాజు© 2017,www.logili.com All Rights Reserved.