ఒకనాటి ఉదయం ఆయన సరస్వతీనదికి స్నానానికై వెళ్ళాడు. ఆహ్నికాలన్నీ తీర్చుకుని అక్కడ ఒక ప్రశాంత ప్రదేశంలో కూర్చున్నాడు. ధ్యానంలో 'మునిగిపోయాడు. అప్పుడా మహర్షికి ప్రపంచ భవిష్యత్తు తలపునకు వచ్చింది. త్వరలో కలియుగం రాబోతున్నది. కలికాలంలో మానవులు నీతిబాహుబై, అధర్మపరులై నిరంతరం పాపపంకిలంలో పడి కొట్టు కోనున్నారు. వారివల్ల లోకం ఎన్నో ఆపదలకూ అనర్థాలకూ గురికావలసి ఉన్నది. ఈ విషయం తన దివ్యజ్ఞానం వల్ల ఆయన ముందుగానే తెలుసుకున్నాడు. పుణ్యాత్ముడు కనుక మానవకోటికి మేలుచేయాలన్న సంకల్పం కలిగింది. ఆయనకు. వారిని | సన్మార్గప్రవర్తకులుగా చేసేటందుకు కొన్ని నియమాలు, కట్టుబాట్లు ఏర్పరచి, ధర్మస్వరూపం ఏమిటో తెలియజెప్పాలనుకున్నాడు...
అప్పటివరకూ వేదమంతా ఒకరాశిలో ఉన్నది. కలగాపులగంగా ఉన్న వేదం చదవడం జనులకు సుసాధ్యంగా లేదు. అందుకని ఆయన వేదాలను నాలుగు విధాలుగా విభజించాడు. వాటికి బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం- అని పేరు పెట్టాడు. తరువాత, మానవులకు ఇంకా సులువుగా ఉండే నిమిత్తం వేదార్థాలనూ, వర్ణాశ్రమ ధర్మాలనూ అనేక తార్కాణాలతో, కథలతో మరింత విప్పి చెపుతూ పురాణేతిహాసాలను కల్పించాడు. వీటికి పంచమ వేదమని | నామకరణం చేశాడు. వీటన్నిటినీ లోకంలో వ్యాప్తం చేయడానికై తన శిష్యులకు జప్పాడు. ఋగ్వేదం పైలుడికీ, యజుర్వేదం జైమినికి, సామవేదం వైశంపాయనుడికీ, అధర్వణవేదం సుమంతుడికి బోధించాడు. పంచమవేదమైన పురాణేతిహాసాలను రోమహర్షణుడికి చెప్పాడు. అటుపిమ్మట ఆ మునులంతా.......
రాజాజీ మెచ్చిన భాగవతం అవతారిక ద్వాపరయుగం చివరిభాగంలో కృష్ణద్వైపాయనుడనే ఒక మహానుభావుడు ఈ భరతభూమి పై అవతరించాడు. ఆయన తల్లి సత్యవతి, తండ్రి పరాశరమునీంద్రుడు. ఒకానొక కారణార్థం శ్రీమహావిష్ణువు అంశంతో జన్మించినవాడు కావడం వల్ల ఆయన పుట్టుకతోనే మహాయోగి అయినాడు. గొప్ప తపస్సు చేసి భగవంతుని అనుగ్రహం సంపాదించాడు. సకల వేదశాస్త్ర పారంగతుడూ, బ్రహ్మజ్ఞానీ, త్రికాలవేత్తా అయి జగద్విఖ్యాతి పొందాడు. ఒకనాటి ఉదయం ఆయన సరస్వతీనదికి స్నానానికై వెళ్ళాడు. ఆహ్నికాలన్నీ తీర్చుకుని అక్కడ ఒక ప్రశాంత ప్రదేశంలో కూర్చున్నాడు. ధ్యానంలో 'మునిగిపోయాడు. అప్పుడా మహర్షికి ప్రపంచ భవిష్యత్తు తలపునకు వచ్చింది. త్వరలో కలియుగం రాబోతున్నది. కలికాలంలో మానవులు నీతిబాహుబై, అధర్మపరులై నిరంతరం పాపపంకిలంలో పడి కొట్టు కోనున్నారు. వారివల్ల లోకం ఎన్నో ఆపదలకూ అనర్థాలకూ గురికావలసి ఉన్నది. ఈ విషయం తన దివ్యజ్ఞానం వల్ల ఆయన ముందుగానే తెలుసుకున్నాడు. పుణ్యాత్ముడు కనుక మానవకోటికి మేలుచేయాలన్న సంకల్పం కలిగింది. ఆయనకు. వారిని | సన్మార్గప్రవర్తకులుగా చేసేటందుకు కొన్ని నియమాలు, కట్టుబాట్లు ఏర్పరచి, ధర్మస్వరూపం ఏమిటో తెలియజెప్పాలనుకున్నాడు... అప్పటివరకూ వేదమంతా ఒకరాశిలో ఉన్నది. కలగాపులగంగా ఉన్న వేదం చదవడం జనులకు సుసాధ్యంగా లేదు. అందుకని ఆయన వేదాలను నాలుగు విధాలుగా విభజించాడు. వాటికి బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం- అని పేరు పెట్టాడు. తరువాత, మానవులకు ఇంకా సులువుగా ఉండే నిమిత్తం వేదార్థాలనూ, వర్ణాశ్రమ ధర్మాలనూ అనేక తార్కాణాలతో, కథలతో మరింత విప్పి చెపుతూ పురాణేతిహాసాలను కల్పించాడు. వీటికి పంచమ వేదమని | నామకరణం చేశాడు. వీటన్నిటినీ లోకంలో వ్యాప్తం చేయడానికై తన శిష్యులకు జప్పాడు. ఋగ్వేదం పైలుడికీ, యజుర్వేదం జైమినికి, సామవేదం వైశంపాయనుడికీ, అధర్వణవేదం సుమంతుడికి బోధించాడు. పంచమవేదమైన పురాణేతిహాసాలను రోమహర్షణుడికి చెప్పాడు. అటుపిమ్మట ఆ మునులంతా.......© 2017,www.logili.com All Rights Reserved.