తెలుగుభాష స్థితిగతుల గురించి, దాన్ని సరిదిద్దవలసిన అవసరం గురించి రాయడం ఎంత తేలికో, అంత కష్టం, క్లిష్టం కూడా. బోర్డులు తెలుగులో ఉండడం లేదని, తెలుగు వాళ్ళ రాజధానిలో ఆటోవాళ్లు తెలుగులో మాట్లాడ్డం లేదనో, ఏదో స్కూల్ లో తెలుగులో మాట్లాడితే పిల్లల్ని దండిస్తున్నారానో, టివీ యాంకర్లు డుమువులు తప్ప తక్కిన వాక్యమంతా ఇంగ్లీషు పదాలతో నింపేస్తున్నారానో కోపం తెచ్చుకునే వాళ్లు చాలామంది ఉన్నారు. పెద్దగా లోతుల్లోకి వెళ్లకుండా ఆవేశపడిపోయే అభిప్రాయాలు మనవాళ్ళకు చాలానే ఉంటాయి. ఇద్దరు తెలుగువాళ్లు కలిస్తే వేరే భాషల్లో మాట్లాడుకుంటారని మన మీద మనమే వేసుకునే ఆనవాయితీ ఛలోక్తి దగ్గర్నుంచి, సాటి తెలుగువాడు బాగుపడితే మరో తెలుగువాడు ఓర్వలేడనే సామాజిక నిర్ధారణ దాకా తెలుగువాళ్ల అభిప్రాయ సంపుటిలో భాగం.
రాజేందర్ వ్యాసాలు చదివినప్పుడు - భాషమీద ఇటువంటి ఆలోచనలెన్నో మనల్ని ముసురుకుంటాయి. ఉద్వేగాలు, ఆవేశాలు పైచేయి కాకుండా, జాగ్రత్తగా రాసిన వ్యాసాలివి. అన్యాయమై పోతున్న తెలుగుభాష కూడా కొన్ని అన్యాయాలు చేస్తున్నదని, రాష్ట్రంలో మైనారిటీ భాషలను, ఆదివాసీ భాషలను కొరగాకుండా చేస్తున్నదని గ్రంధకర్త గుర్తించారు. తెలుగుభాషలోనే అధికార మాండలికానికి, ఇతర మాండలికాలకు మధ్య ఉన్న అంతస్తుల అంతరాన్ని చర్చించారు. ప్రజలభాషకు, ప్రమాణభాషకు మధ్య ఉన్న దురాన్ని ప్రశ్నించారు. వివిధ రంగాలలో పనిచేస్తున్న ఇటువంటి మేధావులు సమిష్టిగా నిర్మాణాత్మకమైన కృషి చేస్తే, తెలుగుకు అధికారాన్ని, అధికారంలో తెలుగును సాధించడం కష్టమేమి కాదనిపిస్తుంది.
- రాజేందర్ జింబో
రచయిత గురించి
'జింబో' పేరుతో కవిత్వం, కధలు, సాహిత్యవ్యాసాలు రాశారు. రాస్తున్నారు. 28 సెప్టెంబర్ 1956వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లా వేములవాడలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్. ఎల్ బి., బి. సి. జే., ఎల్. ఎల్. ఎమ్ చదివారు.
ఏడేళ్ళు న్యాయవాదిగా పనిచేసి 1989వ సంవత్సరంలో మున్సిఫ్ మేజిస్ట్రేట్ గా న్యాయవ్యవస్థలో చేరి రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో పనిచేశారు. ప్రస్తుతం జిల్లా జడ్జి (సీనియర్ ఫ్యాకల్టి మెంబెర్) గా ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడెమీ, సికింద్రాబాద్ లో పనిచేస్తున్నారు.
హాజిర్ హై, రెండక్షరాలు, లోపలివర్షం వీరి కవితా సంపుటాలు. 'చూస్తుండగానే'... నాలుగవ కవితా సంపుటి. లోపలి వర్షాన్ని Rain Inside పేరుతో దేశెట్టి కేశవరావు ఆంగ్లంలోకి అనువదించారు.
రూల్ ఆఫ్ లా, జింబో కధలు, మా వేములవాడ కధలు అన్న మూడు కధా సంపుటాలు వచ్చాయి. 'జింబో కధల' ని ZAMANTH and Other Stories పేరుతో డా. టి. శ్రీనివాసరెడ్డి ఆంగ్లంలోకి అనువదించారు
'గుండెతడి' పేరుతో సాహిత్య వ్యాసాలు, 'తగవు' పేరుతో రేడియో లీగల్ నాటికలను వెలువరించారు.
న్యాయశాస్త్రానికి సంబంధించిన యాభై వరకు 'లా' పుస్తకాలను, లెక్కలేనన్ని న్యాయ సంబంధిత వ్యాసాలను రాశారు.రాస్తున్నారు. 'గుండెతడి' పేరుతో ఆంధ్రభూమి దిన పత్రికలో ఓ సంవత్సరం పాటు, ప్రస్తావన శీర్షికతో ఆంధ్రప్రభ దినపత్రికలో రెండు సంవత్సరాల పాటు సాహిత్య వ్యాసాల కాలమ్స్ ని వారం వారం నిర్వహించారు. కరీంనగర్ నుంచి వెలువడుతున్న 'జనం సాక్షి' దినపత్రికలో 'ప్రస్తావన' శీర్షికతో ప్రతి ఆదివారం కాలమ్ ని రాస్తున్నారు. అదే పత్రికలో వీరి 'మా వేములవాడ కధలు' ప్రస్తుతం పునుర్ముద్రితమవుతున్నాయి.
తెలుగుభాష స్థితిగతుల గురించి, దాన్ని సరిదిద్దవలసిన అవసరం గురించి రాయడం ఎంత తేలికో, అంత కష్టం, క్లిష్టం కూడా. బోర్డులు తెలుగులో ఉండడం లేదని, తెలుగు వాళ్ళ రాజధానిలో ఆటోవాళ్లు తెలుగులో మాట్లాడ్డం లేదనో, ఏదో స్కూల్ లో తెలుగులో మాట్లాడితే పిల్లల్ని దండిస్తున్నారానో, టివీ యాంకర్లు డుమువులు తప్ప తక్కిన వాక్యమంతా ఇంగ్లీషు పదాలతో నింపేస్తున్నారానో కోపం తెచ్చుకునే వాళ్లు చాలామంది ఉన్నారు. పెద్దగా లోతుల్లోకి వెళ్లకుండా ఆవేశపడిపోయే అభిప్రాయాలు మనవాళ్ళకు చాలానే ఉంటాయి. ఇద్దరు తెలుగువాళ్లు కలిస్తే వేరే భాషల్లో మాట్లాడుకుంటారని మన మీద మనమే వేసుకునే ఆనవాయితీ ఛలోక్తి దగ్గర్నుంచి, సాటి తెలుగువాడు బాగుపడితే మరో తెలుగువాడు ఓర్వలేడనే సామాజిక నిర్ధారణ దాకా తెలుగువాళ్ల అభిప్రాయ సంపుటిలో భాగం. రాజేందర్ వ్యాసాలు చదివినప్పుడు - భాషమీద ఇటువంటి ఆలోచనలెన్నో మనల్ని ముసురుకుంటాయి. ఉద్వేగాలు, ఆవేశాలు పైచేయి కాకుండా, జాగ్రత్తగా రాసిన వ్యాసాలివి. అన్యాయమై పోతున్న తెలుగుభాష కూడా కొన్ని అన్యాయాలు చేస్తున్నదని, రాష్ట్రంలో మైనారిటీ భాషలను, ఆదివాసీ భాషలను కొరగాకుండా చేస్తున్నదని గ్రంధకర్త గుర్తించారు. తెలుగుభాషలోనే అధికార మాండలికానికి, ఇతర మాండలికాలకు మధ్య ఉన్న అంతస్తుల అంతరాన్ని చర్చించారు. ప్రజలభాషకు, ప్రమాణభాషకు మధ్య ఉన్న దురాన్ని ప్రశ్నించారు. వివిధ రంగాలలో పనిచేస్తున్న ఇటువంటి మేధావులు సమిష్టిగా నిర్మాణాత్మకమైన కృషి చేస్తే, తెలుగుకు అధికారాన్ని, అధికారంలో తెలుగును సాధించడం కష్టమేమి కాదనిపిస్తుంది. - రాజేందర్ జింబో రచయిత గురించి 'జింబో' పేరుతో కవిత్వం, కధలు, సాహిత్యవ్యాసాలు రాశారు. రాస్తున్నారు. 28 సెప్టెంబర్ 1956వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లా వేములవాడలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్. ఎల్ బి., బి. సి. జే., ఎల్. ఎల్. ఎమ్ చదివారు. ఏడేళ్ళు న్యాయవాదిగా పనిచేసి 1989వ సంవత్సరంలో మున్సిఫ్ మేజిస్ట్రేట్ గా న్యాయవ్యవస్థలో చేరి రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో పనిచేశారు. ప్రస్తుతం జిల్లా జడ్జి (సీనియర్ ఫ్యాకల్టి మెంబెర్) గా ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడెమీ, సికింద్రాబాద్ లో పనిచేస్తున్నారు. హాజిర్ హై, రెండక్షరాలు, లోపలివర్షం వీరి కవితా సంపుటాలు. 'చూస్తుండగానే'... నాలుగవ కవితా సంపుటి. లోపలి వర్షాన్ని Rain Inside పేరుతో దేశెట్టి కేశవరావు ఆంగ్లంలోకి అనువదించారు. రూల్ ఆఫ్ లా, జింబో కధలు, మా వేములవాడ కధలు అన్న మూడు కధా సంపుటాలు వచ్చాయి. 'జింబో కధల' ని ZAMANTH and Other Stories పేరుతో డా. టి. శ్రీనివాసరెడ్డి ఆంగ్లంలోకి అనువదించారు 'గుండెతడి' పేరుతో సాహిత్య వ్యాసాలు, 'తగవు' పేరుతో రేడియో లీగల్ నాటికలను వెలువరించారు. న్యాయశాస్త్రానికి సంబంధించిన యాభై వరకు 'లా' పుస్తకాలను, లెక్కలేనన్ని న్యాయ సంబంధిత వ్యాసాలను రాశారు.రాస్తున్నారు. 'గుండెతడి' పేరుతో ఆంధ్రభూమి దిన పత్రికలో ఓ సంవత్సరం పాటు, ప్రస్తావన శీర్షికతో ఆంధ్రప్రభ దినపత్రికలో రెండు సంవత్సరాల పాటు సాహిత్య వ్యాసాల కాలమ్స్ ని వారం వారం నిర్వహించారు. కరీంనగర్ నుంచి వెలువడుతున్న 'జనం సాక్షి' దినపత్రికలో 'ప్రస్తావన' శీర్షికతో ప్రతి ఆదివారం కాలమ్ ని రాస్తున్నారు. అదే పత్రికలో వీరి 'మా వేములవాడ కధలు' ప్రస్తుతం పునుర్ముద్రితమవుతున్నాయి.
© 2017,www.logili.com All Rights Reserved.