రంగనాధ రామచంద్రరావు స్వయంగా కధకుడు. బాలసాహిత్యకారుడు. మంచి అనువాదకుడు. కేంద్ర సాహిత్య అకాడెమీ కోసం నవలలు, కదా సంపుటాలు, జీవిత చిత్రణలు అనువదించి తెలుగు సాహితీ లోకానికి అందించారు. తాత, ముత్తాతల వైపు నుంచి కన్నడ భాషా సంస్కృతిని, రాయలసీమలోని ఆదోనిలో పుట్టి, పెరిగి, విద్యనభ్యసించిన కారణంగా బాల్యం నుంచి తెలుగు సాహిత్య సంస్కృతులను తనలో ఇంకించుకుని కన్నడ - తెలుగు అనువాదకుడిగా రంగనాధ రామచంద్రరావు గణనీయమైన కృషి చేశారు. రంగనాధ తెలుగు కన్నడీకుడు. బహుశా ఇటువంటి అనువాద సంస్కారం, రెండు భాషా సంస్కృతుల మధ్య వారధి నిర్మించాలనే సంవేదన ఉన్నటువంటి అనువాద రచయితలు మనకు తెలుగులో అరుదేమో?
ఈ పన్నెండు మూలకధల్లోని కదల శైలి, పాత్రల శైలులు, ఏ విధంగా సాగాయో నాకు తెలియదు. రంగనాధ తన అనువాదంలో కధన శైలి, పాత్రల శైలుల విషయంలో ఆయా రచయితల శైలీ విన్యాసాలను పట్టించుకున్నట్టు తెలుస్తుంది. తెలుగు పాఠకుడి కోసం వివిధ భాషా, సామాజిక, సాంస్కృతిక నేపధ్యాలకు అనుగుణంగా రంగనాధ రామచంద్రరావు తగిన భాషా వ్యూహాన్ని అనుసరించినట్లు స్పష్టంగా వెల్లడవుతుంది. ఈ అనువాద కధల శైలి సరళంగా, స్పష్టంగా, సూటిగా, తెలుగుతనాన్ని విడవకుండా హృద్యమంగా సాగి హాయిగా చదివింపజేస్తుంది. ఇది రంగనాధ విజయం, చదివాక అలజడి ప్రారంభమవుతుంది. అది కన్నడ రచయితల ప్రతిభా, పాటవాల ప్రభంజనం.
- ఆచార్య కేతు విస్వనథ రెడ్డి
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్దు గ్రహీత
రంగనాధ రామచంద్రరావు స్వయంగా కధకుడు. బాలసాహిత్యకారుడు. మంచి అనువాదకుడు. కేంద్ర సాహిత్య అకాడెమీ కోసం నవలలు, కదా సంపుటాలు, జీవిత చిత్రణలు అనువదించి తెలుగు సాహితీ లోకానికి అందించారు. తాత, ముత్తాతల వైపు నుంచి కన్నడ భాషా సంస్కృతిని, రాయలసీమలోని ఆదోనిలో పుట్టి, పెరిగి, విద్యనభ్యసించిన కారణంగా బాల్యం నుంచి తెలుగు సాహిత్య సంస్కృతులను తనలో ఇంకించుకుని కన్నడ - తెలుగు అనువాదకుడిగా రంగనాధ రామచంద్రరావు గణనీయమైన కృషి చేశారు. రంగనాధ తెలుగు కన్నడీకుడు. బహుశా ఇటువంటి అనువాద సంస్కారం, రెండు భాషా సంస్కృతుల మధ్య వారధి నిర్మించాలనే సంవేదన ఉన్నటువంటి అనువాద రచయితలు మనకు తెలుగులో అరుదేమో? ఈ పన్నెండు మూలకధల్లోని కదల శైలి, పాత్రల శైలులు, ఏ విధంగా సాగాయో నాకు తెలియదు. రంగనాధ తన అనువాదంలో కధన శైలి, పాత్రల శైలుల విషయంలో ఆయా రచయితల శైలీ విన్యాసాలను పట్టించుకున్నట్టు తెలుస్తుంది. తెలుగు పాఠకుడి కోసం వివిధ భాషా, సామాజిక, సాంస్కృతిక నేపధ్యాలకు అనుగుణంగా రంగనాధ రామచంద్రరావు తగిన భాషా వ్యూహాన్ని అనుసరించినట్లు స్పష్టంగా వెల్లడవుతుంది. ఈ అనువాద కధల శైలి సరళంగా, స్పష్టంగా, సూటిగా, తెలుగుతనాన్ని విడవకుండా హృద్యమంగా సాగి హాయిగా చదివింపజేస్తుంది. ఇది రంగనాధ విజయం, చదివాక అలజడి ప్రారంభమవుతుంది. అది కన్నడ రచయితల ప్రతిభా, పాటవాల ప్రభంజనం. - ఆచార్య కేతు విస్వనథ రెడ్డి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్దు గ్రహీత© 2017,www.logili.com All Rights Reserved.