అనగనగా అంటూ కధ మొదలు పెట్టి చెప్తుంటే పెల్లలే కాదు పెద్దవారు కూడా ఎంతో ఆసక్తిగా వింటారు. కధ అంటే బాల్యం....
ఎవరికైనా జీవితంలో 'బాల్యం' ను మించిన గొప్ప నిధి ఏది వుండదు. తరువాత కాలంలో జీవితంలో ఎన్ని సాధించినా ఆ బాల్యం తాలూకు గుర్తులు, జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూనే ప్రతి వ్యక్తీ జీవిస్తూ ఉంటాడు. అలాంటి అందమైన, ఆహ్లాదకరమైన బాల్యం అందించడం ప్రతి తల్లీ, తండ్రి కనీస బాధ్యత.
కధల పుస్తకాల విషయానికి వస్తే నిజంగా పిల్లలకు కధల పుస్తకాలను మించిన గొప్ప మిత్రులు ఎవ్వరూ ఉండరు. ఈ కధల పుస్తకాలు పిల్లలకు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కూడా చెప్తాయి.
పిల్లల మనో వికాసం మీద కధల పుస్తకాలు చూపించే ప్రభావం అంతా ఇంతా కాదు. బాల్యంలో చదివే ఈ కధలు వారికి మంచి మిత్రులుగా జీవితాంతం వారికి తోడుగా నిలుస్తాయి.
పిల్లల కధలలో ప్రధాన పాత్ర పోషించేది మొక్కలు, పక్షులు, జంతువులు. ఈ కధలు చదవడం వలన లేదా వినడం వలన బాల్యం నుంచి వారి మనసులో ప్రకృతి పట్ల, ప్రేమ, బాధ్యత పెంపొందుతాయి. ఉదాహరణకు ఈ కధలలో జంతువులకు, పక్షులకు కూడా కుటుంబాలు ఉంటాయి. తల్లి పక్షి, తండ్రి పక్షి, పిల్లల పక్షులు ఇలా వారి కుటుంబాల గురించి, వారి మధ్య ఉండే బంధం, ఆత్మీయత గురించి చదవడం వలన పిలల్లో వాటిని హింసించాలన్న ఆలోచన కానీ, వాటికి హాని చేయాలన్న తలంపు కానీ రాదు. ఎవరైతే అన్ని ప్రాణులపట్ల గౌరవం, అభిమానం చూపుతారో వారు పెరిగి పెద్దవారయ్యాక సంఘానికి ఆదర్శంగా నిలబడతారు తప్ప సమాజానికి తలనొప్పిగా తయారవరు.
కధలు చదవడం వలన పిల్లల్లో ఆలోచనాశక్తి పెంపొందుతుంది ప్రతి విషయంలో ఉండే మంచి, చెడులను అర్ధం చేసుకోగలుగుతారు. పిల్లలు రాత్రివేళ నిద్రించే ముందు కధలు చెప్పడం వలన అవి వారిని ఒక ఊహ ప్రపంచంలో విహరింపజేస్తాయి. ఫలితంగా ఉదయం నుంచి వారి మీద పడిన ఒత్తిడి నుంచి వారికి ఉపశమనం లభిస్తుంది. ఒక్కసారి మీ పిల్లలకు రోజుకు కనీసం ఒక్క కధ అయినా చెప్పండి, దాని గురించి మాట్లడండి. వారిలో వచ్చే మార్పుకు మిరే ఆశ్చర్యపోతారు.
- ఆదెళ్ళ శైలబాల
అనగనగా అంటూ కధ మొదలు పెట్టి చెప్తుంటే పెల్లలే కాదు పెద్దవారు కూడా ఎంతో ఆసక్తిగా వింటారు. కధ అంటే బాల్యం.... ఎవరికైనా జీవితంలో 'బాల్యం' ను మించిన గొప్ప నిధి ఏది వుండదు. తరువాత కాలంలో జీవితంలో ఎన్ని సాధించినా ఆ బాల్యం తాలూకు గుర్తులు, జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూనే ప్రతి వ్యక్తీ జీవిస్తూ ఉంటాడు. అలాంటి అందమైన, ఆహ్లాదకరమైన బాల్యం అందించడం ప్రతి తల్లీ, తండ్రి కనీస బాధ్యత. కధల పుస్తకాల విషయానికి వస్తే నిజంగా పిల్లలకు కధల పుస్తకాలను మించిన గొప్ప మిత్రులు ఎవ్వరూ ఉండరు. ఈ కధల పుస్తకాలు పిల్లలకు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కూడా చెప్తాయి. పిల్లల మనో వికాసం మీద కధల పుస్తకాలు చూపించే ప్రభావం అంతా ఇంతా కాదు. బాల్యంలో చదివే ఈ కధలు వారికి మంచి మిత్రులుగా జీవితాంతం వారికి తోడుగా నిలుస్తాయి. పిల్లల కధలలో ప్రధాన పాత్ర పోషించేది మొక్కలు, పక్షులు, జంతువులు. ఈ కధలు చదవడం వలన లేదా వినడం వలన బాల్యం నుంచి వారి మనసులో ప్రకృతి పట్ల, ప్రేమ, బాధ్యత పెంపొందుతాయి. ఉదాహరణకు ఈ కధలలో జంతువులకు, పక్షులకు కూడా కుటుంబాలు ఉంటాయి. తల్లి పక్షి, తండ్రి పక్షి, పిల్లల పక్షులు ఇలా వారి కుటుంబాల గురించి, వారి మధ్య ఉండే బంధం, ఆత్మీయత గురించి చదవడం వలన పిలల్లో వాటిని హింసించాలన్న ఆలోచన కానీ, వాటికి హాని చేయాలన్న తలంపు కానీ రాదు. ఎవరైతే అన్ని ప్రాణులపట్ల గౌరవం, అభిమానం చూపుతారో వారు పెరిగి పెద్దవారయ్యాక సంఘానికి ఆదర్శంగా నిలబడతారు తప్ప సమాజానికి తలనొప్పిగా తయారవరు. కధలు చదవడం వలన పిల్లల్లో ఆలోచనాశక్తి పెంపొందుతుంది ప్రతి విషయంలో ఉండే మంచి, చెడులను అర్ధం చేసుకోగలుగుతారు. పిల్లలు రాత్రివేళ నిద్రించే ముందు కధలు చెప్పడం వలన అవి వారిని ఒక ఊహ ప్రపంచంలో విహరింపజేస్తాయి. ఫలితంగా ఉదయం నుంచి వారి మీద పడిన ఒత్తిడి నుంచి వారికి ఉపశమనం లభిస్తుంది. ఒక్కసారి మీ పిల్లలకు రోజుకు కనీసం ఒక్క కధ అయినా చెప్పండి, దాని గురించి మాట్లడండి. వారిలో వచ్చే మార్పుకు మిరే ఆశ్చర్యపోతారు. - ఆదెళ్ళ శైలబాల© 2017,www.logili.com All Rights Reserved.