బాల బాలికల కానందముగా
బాలహృదయములు అలరునట్లుగా
బాల చిత్తములు చిగుర్చునట్లుగ
పాటలు పాడండి
పదములు కూర్చండి...
ఆలమందలను ఆకర్షించే
బాలకృష్ణ మురళీ నాదమువలె
బాలబాలికల నాకర్షించే
పాటలు పాడండి
పదములు కూర్చండి...
ఎచ్చరికలతో ఊ ఊ అంటూ
ముచ్చటపడి వినవచ్చే పిల్లల్లు
మెచ్చే కధలను తేలికమాటల
స్వేచ్చగ చెప్పండి.
ముచ్చటలాడండి!!
పిల్లల చెవులకు ఇంపగు పలుకులు
పిల్లల మదిలో నిలిపే నీతులు
పిల్లల కోసము పిట్టకధలుగా
పెద్దలు చెప్పండి
సుద్దులు పలకండీ!!
100 బాల గేయాలను చాలా అద్భుతంగా బాలబాలికలకు రెడ్డి రాఘవయ్యగారు అందించారు.
- రెడ్డి రాఘవయ్య
బాల బాలికల కానందముగా బాలహృదయములు అలరునట్లుగా బాల చిత్తములు చిగుర్చునట్లుగ పాటలు పాడండి పదములు కూర్చండి... ఆలమందలను ఆకర్షించే బాలకృష్ణ మురళీ నాదమువలె బాలబాలికల నాకర్షించే పాటలు పాడండి పదములు కూర్చండి... ఎచ్చరికలతో ఊ ఊ అంటూ ముచ్చటపడి వినవచ్చే పిల్లల్లు మెచ్చే కధలను తేలికమాటల స్వేచ్చగ చెప్పండి. ముచ్చటలాడండి!! పిల్లల చెవులకు ఇంపగు పలుకులు పిల్లల మదిలో నిలిపే నీతులు పిల్లల కోసము పిట్టకధలుగా పెద్దలు చెప్పండి సుద్దులు పలకండీ!! 100 బాల గేయాలను చాలా అద్భుతంగా బాలబాలికలకు రెడ్డి రాఘవయ్యగారు అందించారు. - రెడ్డి రాఘవయ్య
© 2017,www.logili.com All Rights Reserved.