ఈ నిఘంటువు పేరు సంఖ్యా వాచక పదకోశము. అంటే సంఖ్యావాచక పదాలకి వివరణ ఇచ్చేది, ఉదా: అగ్నులు-3, పాండవులు-5, ఋషులు-7, అష్టైశ్వర్యాలు-8, అష్టకష్టాలు-8, నవరత్నాలు-9, నవరసాలు-9, అష్టాదశపురాణాలు-18, చతుషష్టికళలు-64, కౌరవులు-100..... అనటాన్ని మనం వింటుంటాం కానీ అవి ఏమిటి అనేది మనకు తెలియదు. 'అష్టకష్టాలు పడుతున్నడురా' అంటాం. వాడు అష్టైశ్వర్యాలతో తులతూగుతున్నాడంటాం, అవీ మనకు తెలియవు. అవీ ఏమిటన్నది చెప్పేది ఈ సంఖ్యావాచక పదకోశం, సంఖ్యాపరంగా సమగ్రమైన ఇట్టి గ్రంధము ఇంతవరకు వేలువడియుండలేదు.
ఇందులో ఏక(1) సంఖ్యలో మొదలై అష్టోత్తరశత(108) సంఖ్యా వరకు వచ్చు పదాలకు వివరణలను ఎంతో వ్యయప్రయాసలకోర్చి తీర్చిదిద్దారు బి.అనంతరావు గారు. గ్రంథలు చదివే వారికే కాక విద్యార్ధులకు, పరిశోధకులకు, ఆయుర్వేద, సాహిత్య వేదాంత విషయాలను అభ్యసించే వారికి ఇది ఒక కరదీపిక.
© 2017,www.logili.com All Rights Reserved.