వ్యవసాయం మన జీవన విధానంలో ఒక భాగం. వ్యవసాయం పురోగమించకుండా అభివృద్ధి సాధించడం అసాధ్యమైన విషయం అని మనందరికీ తెలుసు. వ్యవసాయరంగ ప్రగతితో పారిశ్రామిక. సేవారంగాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ తరుణంలో వ్యవసాయ రంగంలో అనుభవజ్ఞులు గొంటుముక్కల రామయ్య గారు ప్రతి వ్యవసాయ విద్యార్థికి, రైతే రాజుకు ఉపయోగపడే విధంగా ఈ 'వ్యవసాయ విజ్ఞాన పదకోశము' అనే నిగంటువును తీర్చదిద్దారు. 30 సంవత్సరాలకు పైగా రామయ్య గారు ప్రభుత్వ వ్యవసాయ అధికారిగా సేవలందించి, తాను గడించిన అనుభవం వ్యవసాయ విధానాలకు సంబంధించిన సనాతన, నూతన పదాలను ఈ నిగంటువులో పదిలపరిచారు. ఈ పుస్తకంలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పాడి, కోళ్ళ పరిశ్రమ సంబంధిత పదాలు వ్యవసాయవిధాన వసతులు, పట్టికలు అన్నీ ఒకే చోట కూర్చబడ్డాయి. ఈ పుస్తకంలో వ్యవసాయ విజ్ఞానంతో పాటు వివిధ జీవజాలము గురించి కూడా వివరించడం జరిగింది.
రైతుల అభ్యున్నతి కోసము ఈ పుస్తకాన్ని రూపొందించడంలో ఎంతో కృషి చేసిన రచయిత రామయ్య గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. వ్యవసాయ విజ్ఞాన పదకోశము అగ్రి విద్యార్థులకు, యువ శాస్త్రవేత్తలకు, విస్తరణ అధికారులకు, రైతులకు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల వారికి, ఉపయోగపడుతుందని నా ప్రగాఢ విశ్వాసం.
- బుట్టా రేణుక
వ్యవసాయం మన జీవన విధానంలో ఒక భాగం. వ్యవసాయం పురోగమించకుండా అభివృద్ధి సాధించడం అసాధ్యమైన విషయం అని మనందరికీ తెలుసు. వ్యవసాయరంగ ప్రగతితో పారిశ్రామిక. సేవారంగాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ తరుణంలో వ్యవసాయ రంగంలో అనుభవజ్ఞులు గొంటుముక్కల రామయ్య గారు ప్రతి వ్యవసాయ విద్యార్థికి, రైతే రాజుకు ఉపయోగపడే విధంగా ఈ 'వ్యవసాయ విజ్ఞాన పదకోశము' అనే నిగంటువును తీర్చదిద్దారు. 30 సంవత్సరాలకు పైగా రామయ్య గారు ప్రభుత్వ వ్యవసాయ అధికారిగా సేవలందించి, తాను గడించిన అనుభవం వ్యవసాయ విధానాలకు సంబంధించిన సనాతన, నూతన పదాలను ఈ నిగంటువులో పదిలపరిచారు. ఈ పుస్తకంలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పాడి, కోళ్ళ పరిశ్రమ సంబంధిత పదాలు వ్యవసాయవిధాన వసతులు, పట్టికలు అన్నీ ఒకే చోట కూర్చబడ్డాయి. ఈ పుస్తకంలో వ్యవసాయ విజ్ఞానంతో పాటు వివిధ జీవజాలము గురించి కూడా వివరించడం జరిగింది. రైతుల అభ్యున్నతి కోసము ఈ పుస్తకాన్ని రూపొందించడంలో ఎంతో కృషి చేసిన రచయిత రామయ్య గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. వ్యవసాయ విజ్ఞాన పదకోశము అగ్రి విద్యార్థులకు, యువ శాస్త్రవేత్తలకు, విస్తరణ అధికారులకు, రైతులకు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల వారికి, ఉపయోగపడుతుందని నా ప్రగాఢ విశ్వాసం. - బుట్టా రేణుక© 2017,www.logili.com All Rights Reserved.