ఎంతో ఖ్యాతి గడించిన ఈ ఆధ్యాత్మిక గ్రంథాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేసే ఉద్దేశంతో ఏడేండ్ల క్రితం శీలం పేరున ఒక చిన్న పుస్తకం, ఐదేండ్ల క్రితం ధ్యానం పేరున మరో పుస్తకం సంక్షిప్తంగా అనువదించి ముద్రించడం జరిగింది. మూడవ పుస్తకంగా ప్రజ్ఞను కూడా అనువదించే పని ఇప్పటికి కార్యారూపం దాల్చలేదు. ప్రస్తుతానికి శీలం ధ్యానం పుస్తకాలు కొన్ని సవరణలతో కొత్త రూపాన్ని సంతరించుకొని ఏకగ్రంథంగా పాఠకుల ముందుకు వస్తున్నది.
ఈ పుస్తకంలో ఒకటి రెండు పేజీలు చదివి ఇదొక శుష్కగ్రంథం అని పాఠకులు పొరబడరాదు. భిక్షువులు ఆసక్తికరమైన వృత్తాంతములు 40 పైగానే ఈ పుస్తకంలో అక్కడక్కడా ఉన్నాయి. ఓపిగ్గా చదివేవాళ్ళకు శీలం గురించి ధ్యానం గురించి అనేక విషయాలు ఈ పుస్తకం తెలియజేస్తుంది. మహిమల మీద, అలౌకిక శక్తుల మీద కూడా పాఠకులకు ఒక అవగాహన కలిగించే ప్రయత్నం ఈ అనువాద గ్రంథంలో కనిపిస్తుంది.
ఎంతో ఖ్యాతి గడించిన ఈ ఆధ్యాత్మిక గ్రంథాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేసే ఉద్దేశంతో ఏడేండ్ల క్రితం శీలం పేరున ఒక చిన్న పుస్తకం, ఐదేండ్ల క్రితం ధ్యానం పేరున మరో పుస్తకం సంక్షిప్తంగా అనువదించి ముద్రించడం జరిగింది. మూడవ పుస్తకంగా ప్రజ్ఞను కూడా అనువదించే పని ఇప్పటికి కార్యారూపం దాల్చలేదు. ప్రస్తుతానికి శీలం ధ్యానం పుస్తకాలు కొన్ని సవరణలతో కొత్త రూపాన్ని సంతరించుకొని ఏకగ్రంథంగా పాఠకుల ముందుకు వస్తున్నది. ఈ పుస్తకంలో ఒకటి రెండు పేజీలు చదివి ఇదొక శుష్కగ్రంథం అని పాఠకులు పొరబడరాదు. భిక్షువులు ఆసక్తికరమైన వృత్తాంతములు 40 పైగానే ఈ పుస్తకంలో అక్కడక్కడా ఉన్నాయి. ఓపిగ్గా చదివేవాళ్ళకు శీలం గురించి ధ్యానం గురించి అనేక విషయాలు ఈ పుస్తకం తెలియజేస్తుంది. మహిమల మీద, అలౌకిక శక్తుల మీద కూడా పాఠకులకు ఒక అవగాహన కలిగించే ప్రయత్నం ఈ అనువాద గ్రంథంలో కనిపిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.