ఋతువులను గురించి కవ్యాగానం చేయడం ఈనాటిది కాదు. అలనాటి వాల్మీకి, కాళిదాసుల దగ్గర నుండి ఈనాటి నారాయణ రెడ్డిగారి ఋతు చక్రం దాకా వస్తూనే ఉంది. ఆచరిత్రలోకి పోయే సందర్భం కాదు కాబట్టి ఆ చర్చను వదిలేస్తున్నాను. శేషేంద్ర ఋతు ఘోష కావ్యానికి చాలా ప్రత్యేకతలున్నాయి. అది ఒక అనుపమాన (యునీక్) ఋతు కావ్యం. కవి పద్యరచనలో చూపిన ప్రౌఢమ మాత్రమే దీనికి ప్రధాన కారణం కాదు. శేషేంద్ర ఎంత గొప్ప కవో అంతటి పండితుడు. సంస్కృతాంధ్రాలలో ఆయనుకున్న పాండిత్యం ఆయన కాలంలో పుట్టిన వారికీ చాలా అరుదైన విషయం. ప్రచారంలోకి రాలేదు. ఆయన కూడా తనను తాను అత్యంత ఆధునికుడుగా చెప్పుకోవడానికి ప్రయటించడం వల్ల శేషేంద్ర సంప్రదాయ పద్యరచనలో పద్య ఛందోనిర్మాణ సంవిధానంలో మరొక విశ్వనాధ అయిఉండేవాడు.
ఋతుఘోష కావ్యం ఇంత గొప్పది అని చెప్పడానికి మొదటి కారణం దీనిలో ఎక్కడా కృత్రిమత్వం లేకపోవడం. అంటే కవి ఋతువుల్ని తాను చదువుకున్న ప్రాచీనకావ్యాల అనుభవంతో దాని ప్రభావంతో మరికొన్ని పద్యాలను ఋతువుల గురించి రాయడం లేదా మరికొన్ని కొత్త వర్ణనలు చేయడం. ఇలా కాక ప్రతి ఋతువును ప్రతి ఋతువులో వచ్చిన ప్రకృతి రమణీయాకాన్ని తను గొంతునిండా అనుభవించి పుడిసిలించిన పద్యాలు ఇవి. అందుకే ప్రతి పద్యం గుండెని సూటిగా తాకుతుంది. ఇందులో (వసంత 18, గ్రీష్మ 7, వర్ష 10, శరత్తు 7 పద్యాలు 5 గేయాలు, హేమంతం 6, శిశిరం 6). మొత్తం 59 పద్యాలే ఉన్నాయి. కాని ప్రతి పద్యం ఒక ఆణిముత్యం, మరువలేనిది. వెంటాడే గుణం కలిగింది.
శేషేంద్ర (రచయిత గురించి) :
తెలుగు సాహిత్యంలో తనదైన ముద్రను, తనదైన మార్గాన్ని నిర్మించుకొన్న కవి ప్రవరుడు శేషేంద్ర. ఆయన 20-10-1927న నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు గ్రామంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ మునిసిపల్ కమీషనర్ గా పనిచేశారు. బాల్యంలోనే సంస్కృతీ వ్యరణం, కావ్యాలు, తర్క అలంకార శాస్త్రాలు, ఉపనిశద్భాష్యాలు, వేదాంత పంచదశి చదువుకున్నారు. తర్వాతికాలంలో యోగ, మంత్ర శాస్త్రాలను కూడా అధ్యయనం చేశారు. ఆంగ్లం నేర్చుకొని బీ.ఏ.బి.ఎల్.పట్టాలుపొందారు. దేశవిదేశాల సాహిత్యరీతులను, కవిత్వపోకడలను బాగా ఆకళింపు చేసుకున్నారు. వాల్మీకి, కాళిదాసు, భవభూతి, శ్రీహర్షుడు, బోదిలేర్, లోర్కా, నెరూడా, శ్రీనాధుడు మొదలైన కవుల నిర్మాణ శిల్పం గురించి సాధికారికంగా తెల్పిన ఘనుడు శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ. ఆయన లేఖిని నుండి వెలువడిన అనేక గ్రంధాలు మానవతా పరిమళాలను, అలంకారిక అందాలను సంతరించుకొన్నాయి. 'నా దేశం - నా ప్రజలు', 'శేషజ్యోత్స్న', 'రక్తరేఖ', 'గొరిల్లా', 'ఆధునిక మహాభారతం', 'జనవంశం', 'ఋతుఘోష', 'మండే సూర్యుడు', 'స్వర్ణహంస', 'షోడశి: రామాయణ రహస్యాలు, సాహిత్యకౌముది లాంటి కావ్యాలు, విమర్శ గ్రంధాలు ఆయన రచించారు.
శేషేంద్ర సాహిత్య కృషికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1994లో తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ప్రధానం చేసింది. 1977లో నాటి ఆధునిక కావ్య శాస్త్రంగా ఆయన 'కవిసేన మానిఫెస్టో' అనే వైజ్ఞానిక ఉద్యమ సిద్ధాంత గ్రంధాన్ని వెలెవరించారు. కవిసేన నాయకుడుగా ముద్రపడ్డారు. ఈయన దబాయింపులు, డాంబికాలు నచ్చని కవి. నోబెల్ ప్రైజ్ కమిటీ ప్రైజ్ కు అర్హమైనవారిలో ఈయనను పరిగణనలోకి తీసుకోవడం మరే తెలుగు కవికి ఇంతవరకు దక్కని ఘనమైన గౌరవం.
ఋతువులను గురించి కవ్యాగానం చేయడం ఈనాటిది కాదు. అలనాటి వాల్మీకి, కాళిదాసుల దగ్గర నుండి ఈనాటి నారాయణ రెడ్డిగారి ఋతు చక్రం దాకా వస్తూనే ఉంది. ఆచరిత్రలోకి పోయే సందర్భం కాదు కాబట్టి ఆ చర్చను వదిలేస్తున్నాను. శేషేంద్ర ఋతు ఘోష కావ్యానికి చాలా ప్రత్యేకతలున్నాయి. అది ఒక అనుపమాన (యునీక్) ఋతు కావ్యం. కవి పద్యరచనలో చూపిన ప్రౌఢమ మాత్రమే దీనికి ప్రధాన కారణం కాదు. శేషేంద్ర ఎంత గొప్ప కవో అంతటి పండితుడు. సంస్కృతాంధ్రాలలో ఆయనుకున్న పాండిత్యం ఆయన కాలంలో పుట్టిన వారికీ చాలా అరుదైన విషయం. ప్రచారంలోకి రాలేదు. ఆయన కూడా తనను తాను అత్యంత ఆధునికుడుగా చెప్పుకోవడానికి ప్రయటించడం వల్ల శేషేంద్ర సంప్రదాయ పద్యరచనలో పద్య ఛందోనిర్మాణ సంవిధానంలో మరొక విశ్వనాధ అయిఉండేవాడు. ఋతుఘోష కావ్యం ఇంత గొప్పది అని చెప్పడానికి మొదటి కారణం దీనిలో ఎక్కడా కృత్రిమత్వం లేకపోవడం. అంటే కవి ఋతువుల్ని తాను చదువుకున్న ప్రాచీనకావ్యాల అనుభవంతో దాని ప్రభావంతో మరికొన్ని పద్యాలను ఋతువుల గురించి రాయడం లేదా మరికొన్ని కొత్త వర్ణనలు చేయడం. ఇలా కాక ప్రతి ఋతువును ప్రతి ఋతువులో వచ్చిన ప్రకృతి రమణీయాకాన్ని తను గొంతునిండా అనుభవించి పుడిసిలించిన పద్యాలు ఇవి. అందుకే ప్రతి పద్యం గుండెని సూటిగా తాకుతుంది. ఇందులో (వసంత 18, గ్రీష్మ 7, వర్ష 10, శరత్తు 7 పద్యాలు 5 గేయాలు, హేమంతం 6, శిశిరం 6). మొత్తం 59 పద్యాలే ఉన్నాయి. కాని ప్రతి పద్యం ఒక ఆణిముత్యం, మరువలేనిది. వెంటాడే గుణం కలిగింది. శేషేంద్ర (రచయిత గురించి) : తెలుగు సాహిత్యంలో తనదైన ముద్రను, తనదైన మార్గాన్ని నిర్మించుకొన్న కవి ప్రవరుడు శేషేంద్ర. ఆయన 20-10-1927న నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు గ్రామంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ మునిసిపల్ కమీషనర్ గా పనిచేశారు. బాల్యంలోనే సంస్కృతీ వ్యరణం, కావ్యాలు, తర్క అలంకార శాస్త్రాలు, ఉపనిశద్భాష్యాలు, వేదాంత పంచదశి చదువుకున్నారు. తర్వాతికాలంలో యోగ, మంత్ర శాస్త్రాలను కూడా అధ్యయనం చేశారు. ఆంగ్లం నేర్చుకొని బీ.ఏ.బి.ఎల్.పట్టాలుపొందారు. దేశవిదేశాల సాహిత్యరీతులను, కవిత్వపోకడలను బాగా ఆకళింపు చేసుకున్నారు. వాల్మీకి, కాళిదాసు, భవభూతి, శ్రీహర్షుడు, బోదిలేర్, లోర్కా, నెరూడా, శ్రీనాధుడు మొదలైన కవుల నిర్మాణ శిల్పం గురించి సాధికారికంగా తెల్పిన ఘనుడు శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ. ఆయన లేఖిని నుండి వెలువడిన అనేక గ్రంధాలు మానవతా పరిమళాలను, అలంకారిక అందాలను సంతరించుకొన్నాయి. 'నా దేశం - నా ప్రజలు', 'శేషజ్యోత్స్న', 'రక్తరేఖ', 'గొరిల్లా', 'ఆధునిక మహాభారతం', 'జనవంశం', 'ఋతుఘోష', 'మండే సూర్యుడు', 'స్వర్ణహంస', 'షోడశి: రామాయణ రహస్యాలు, సాహిత్యకౌముది లాంటి కావ్యాలు, విమర్శ గ్రంధాలు ఆయన రచించారు. శేషేంద్ర సాహిత్య కృషికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1994లో తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ప్రధానం చేసింది. 1977లో నాటి ఆధునిక కావ్య శాస్త్రంగా ఆయన 'కవిసేన మానిఫెస్టో' అనే వైజ్ఞానిక ఉద్యమ సిద్ధాంత గ్రంధాన్ని వెలెవరించారు. కవిసేన నాయకుడుగా ముద్రపడ్డారు. ఈయన దబాయింపులు, డాంబికాలు నచ్చని కవి. నోబెల్ ప్రైజ్ కమిటీ ప్రైజ్ కు అర్హమైనవారిలో ఈయనను పరిగణనలోకి తీసుకోవడం మరే తెలుగు కవికి ఇంతవరకు దక్కని ఘనమైన గౌరవం.
© 2017,www.logili.com All Rights Reserved.