ఈ పుస్తకంలో "శివమెత్తిన నది ","నీలం రంగు గొడుగు" అన్న రెండు కథలు ఉన్నాయి.ఈ రెండూ ప్రకృతి ప్రేమికుడు అయిన రస్కిన్ బాండ్ రాసినవి. సీత అనే పాత్ర చుట్టూ అల్లుకుని,తేలికగా సాగిపోయే సెలయేరులాటి కథ "శివమెత్తిన నది" నది ఒడ్డున ఉన్న లంకల్లో ఒకదాంల్లో సీత తన అమ్మమ్మ తాతయ్యతో ఉంటుంది.అనారోగ్యంతో ఉన్న అమ్మమ్మను,ఆస్పత్తిలో చేర్పించడానికి తీసుకెడుతాడు తాతయ్య.అదే సమయంలో నదికి వరద రావడం ఒంటరిగా ఉన్న సీత తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో కిషన్ అనే పిల్లవాడి పడవలోకి చేరుకుంటుంది.వరద ఉధృతిలో వివిధ జీవాలు ఎలా ప్రవర్తిస్తాయో తెలియచెప్తుంది.వరదలో అన్నీటినీ,అనారోగ్యంతో అమ్మమ్మనూ కొల్పోయినా సీత,తాతయ్య తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించిన తీరు జీవితంలోని ఒడిదుడుకులను ఆశవాదంతో ఎదుర్కోవాలనే విషయాన్ని వివరిస్తుంది.
ఈ పుస్తకంలో "శివమెత్తిన నది ","నీలం రంగు గొడుగు" అన్న రెండు కథలు ఉన్నాయి.ఈ రెండూ ప్రకృతి ప్రేమికుడు అయిన రస్కిన్ బాండ్ రాసినవి. సీత అనే పాత్ర చుట్టూ అల్లుకుని,తేలికగా సాగిపోయే సెలయేరులాటి కథ "శివమెత్తిన నది" నది ఒడ్డున ఉన్న లంకల్లో ఒకదాంల్లో సీత తన అమ్మమ్మ తాతయ్యతో ఉంటుంది.అనారోగ్యంతో ఉన్న అమ్మమ్మను,ఆస్పత్తిలో చేర్పించడానికి తీసుకెడుతాడు తాతయ్య.అదే సమయంలో నదికి వరద రావడం ఒంటరిగా ఉన్న సీత తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో కిషన్ అనే పిల్లవాడి పడవలోకి చేరుకుంటుంది.వరద ఉధృతిలో వివిధ జీవాలు ఎలా ప్రవర్తిస్తాయో తెలియచెప్తుంది.వరదలో అన్నీటినీ,అనారోగ్యంతో అమ్మమ్మనూ కొల్పోయినా సీత,తాతయ్య తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించిన తీరు జీవితంలోని ఒడిదుడుకులను ఆశవాదంతో ఎదుర్కోవాలనే విషయాన్ని వివరిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.