సంస్కృతం కాని, వేదాంతం కాని, ఏమీ తెలీని నాకు, భగవద్గీత నిఘూఢార్థాన్ని బోధించి రాయించారు ఈశ్వరుడు. భగవద్గీత తెలుగు చెయ్యమని గోల చేసిన కందికొండ సూర్యనారాయణ శాస్త్రిగారి నుంచి, నేను రాశానో, తాము రాశారో సందేహం కలిగేటంతగా నా పక్కన నిలబడి పనిచేసిన నర్తకీ కృష్ణావరకు, దిగజారిపోయే నా ఉత్సాహాన్ని ఎంతమంది ఈ మూడేళ్ళు తిరిగి తిరిగి ఎగసన దోశారో. తెనాలి రామకృష్ణ తనకి రాజుగారిచ్చే బహుమానంలో ద్వారం దగ్గర భటులకి పంచమన్నట్టు, నాకు తెలుగువారిచ్చే బహుమానాన్ని వీరందరూ పంచుకోవాలి.
మనిషి ప్రకృతి గుణాలకి వశ్యుడై చరిస్తున్నాడు. ఆ ప్రకృతి గుణాల అధికారం నుంచి తప్పించుకునే ఉపాయం ఒక్క జ్ఞాన నేత్రాలకే తెలుస్తుంది. క్షేత్రమంటే దేహం. క్షేత్రాలన్నిటినీ తెలుసుకునేది క్షేత్రజ్ఞుడు. క్షేత్రానికి తనని తానుగాని, ఇతరాన్ని గాని తెలుసుకునే శక్తిలేదు. క్షేత్రజ్ఞుడే స్పృహ, తెలివి, చిత్. తెలుసుకునేది ఉంటేనేగాని తెలుసుకోబడేది లేదు. తెలుసుకునే క్షేత్రజ్ఞుడు ఉంటేనే గాని క్షేత్రం లేదు. తెలుసుకునేందుకు క్షేత్రం ఉంటేనే గాని క్షేత్రజ్ఞుడు లేడు. క్షేత్రాన్ని తెలుసుకోనప్పుడు క్షేత్రజ్ఞుడు తనని తాను తెలుసుకునే పరమాత్మ. అసలు సత్యం మానసాతీతం.
- చలం
సంస్కృతం కాని, వేదాంతం కాని, ఏమీ తెలీని నాకు, భగవద్గీత నిఘూఢార్థాన్ని బోధించి రాయించారు ఈశ్వరుడు. భగవద్గీత తెలుగు చెయ్యమని గోల చేసిన కందికొండ సూర్యనారాయణ శాస్త్రిగారి నుంచి, నేను రాశానో, తాము రాశారో సందేహం కలిగేటంతగా నా పక్కన నిలబడి పనిచేసిన నర్తకీ కృష్ణావరకు, దిగజారిపోయే నా ఉత్సాహాన్ని ఎంతమంది ఈ మూడేళ్ళు తిరిగి తిరిగి ఎగసన దోశారో. తెనాలి రామకృష్ణ తనకి రాజుగారిచ్చే బహుమానంలో ద్వారం దగ్గర భటులకి పంచమన్నట్టు, నాకు తెలుగువారిచ్చే బహుమానాన్ని వీరందరూ పంచుకోవాలి. మనిషి ప్రకృతి గుణాలకి వశ్యుడై చరిస్తున్నాడు. ఆ ప్రకృతి గుణాల అధికారం నుంచి తప్పించుకునే ఉపాయం ఒక్క జ్ఞాన నేత్రాలకే తెలుస్తుంది. క్షేత్రమంటే దేహం. క్షేత్రాలన్నిటినీ తెలుసుకునేది క్షేత్రజ్ఞుడు. క్షేత్రానికి తనని తానుగాని, ఇతరాన్ని గాని తెలుసుకునే శక్తిలేదు. క్షేత్రజ్ఞుడే స్పృహ, తెలివి, చిత్. తెలుసుకునేది ఉంటేనేగాని తెలుసుకోబడేది లేదు. తెలుసుకునే క్షేత్రజ్ఞుడు ఉంటేనే గాని క్షేత్రం లేదు. తెలుసుకునేందుకు క్షేత్రం ఉంటేనే గాని క్షేత్రజ్ఞుడు లేడు. క్షేత్రాన్ని తెలుసుకోనప్పుడు క్షేత్రజ్ఞుడు తనని తాను తెలుసుకునే పరమాత్మ. అసలు సత్యం మానసాతీతం. - చలం© 2017,www.logili.com All Rights Reserved.