భారతీయ వాజ్మయంలో పురాణాలు అత్యంత విశిష్టమైనవి. అవి లోకానికి మిత్రులవలె హితాన్ని ఉపదేశిస్తాయి. కాబట్టి "మిత్రసమ్మితములు" గా ప్రఖ్యాతి వహించాయి. పురాణాలు ప్రాచీనమైనవైనా ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ప్రకాశిస్తూ ఉంటాయి. అవి మన పురాతన విజ్ఞాన సర్వస్వాలు ( Encyclopaedias ) అటువంటి పదునెనిమిది పురాణాల్లో అగ్రగణ్యమైనది "శ్రీ వరాహ మహాపురణం".
శ్రీ మహావిష్ణువు వరాహరూపమును ధరించి పాతాళ లోకము నుంచి భూమిని ఉద్దరించిన వృత్తాంతము ముఖ్య సంబంధము కలది, అయినందున ఈ పురాణమునకు వరాహపురాణము అనే పేరు వచ్చింది.
వరాహ పురాణానికి సౌకర పురాణం అని, ఆదివరాహ పురాణం అని పేర్లు కూడా ఉన్నాయి. శ్రీ మహావిష్ణు అవతారపు పేర్లతో ఉన్న మత్స్య, కూర్మ, వరాహ, వామన పురాణాలలో ఇది మూడవది. పురాణపురుషుడగు శ్రీ మహా విష్ణువు యొక్క 'ఎడమ చీలమండలం' గా ఈ పురాణం తెలుపబడినది. ఈ పురాణంలో విష్ణు సంబంధమైన అనేక వ్రతాలు, వాని మహత్యం, వివరణ కూడా లభ్యమవుతున్నది.
భారతీయ వాజ్మయంలో పురాణాలు అత్యంత విశిష్టమైనవి. అవి లోకానికి మిత్రులవలె హితాన్ని ఉపదేశిస్తాయి. కాబట్టి "మిత్రసమ్మితములు" గా ప్రఖ్యాతి వహించాయి. పురాణాలు ప్రాచీనమైనవైనా ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ప్రకాశిస్తూ ఉంటాయి. అవి మన పురాతన విజ్ఞాన సర్వస్వాలు ( Encyclopaedias ) అటువంటి పదునెనిమిది పురాణాల్లో అగ్రగణ్యమైనది "శ్రీ వరాహ మహాపురణం". శ్రీ మహావిష్ణువు వరాహరూపమును ధరించి పాతాళ లోకము నుంచి భూమిని ఉద్దరించిన వృత్తాంతము ముఖ్య సంబంధము కలది, అయినందున ఈ పురాణమునకు వరాహపురాణము అనే పేరు వచ్చింది. వరాహ పురాణానికి సౌకర పురాణం అని, ఆదివరాహ పురాణం అని పేర్లు కూడా ఉన్నాయి. శ్రీ మహావిష్ణు అవతారపు పేర్లతో ఉన్న మత్స్య, కూర్మ, వరాహ, వామన పురాణాలలో ఇది మూడవది. పురాణపురుషుడగు శ్రీ మహా విష్ణువు యొక్క 'ఎడమ చీలమండలం' గా ఈ పురాణం తెలుపబడినది. ఈ పురాణంలో విష్ణు సంబంధమైన అనేక వ్రతాలు, వాని మహత్యం, వివరణ కూడా లభ్యమవుతున్నది.© 2017,www.logili.com All Rights Reserved.