మార్కెట్ 20000 పాయింట్లు సమీపిస్తున్న నేపధ్యంలో పెన్నీ షేర్లు ఎన్నిక చేయడం చాలా కష్టం. ఇక్కడ పెన్నీ షేర్లంటే రూ.10కంటే తక్కువ వున్న షేర్లని అర్ధం. అయితే రూ.10కంటే తక్కువ వున్న షేర్లలో ముఖవిలువ రూ.1 లేదా 2ఉన్న వాటిని కూడా పెన్నీ షేర్లుగా పరిగణించారు.
అంతేకాదు, రూ 20లోపు ఉన్న షేర్లను కూడా పెన్నీ షేర్లే! అయితే అలాంటి వాటిని ఈ పుస్తకంలో చాలా తక్కవ ఇచ్చారు. అయితే రూ.10లోపు వున్న వాటితో పోలిస్తే వీటిలో ఫండమెంటల్స్ కొద్దిగా మెరుగ్గా ఉన్నాయి. పెన్నీ షేర్లంటే అధిక రిస్క్ తో కూడిన వ్యవహారం. ఈ పెన్నీ షేర్లను కొనడమంటే మొత్తం డబ్బుపోయినా ఫర్వాలేదు, వస్తే అనేక రెట్లు వస్తాయి అనుకునే సాహసవంతులు మాత్రమే వాటిలో అడుగు పెట్టాలి. కొంత మందికి ధ్రిల్ కావాలి. అలాంటి వారిలో కొందరు తక్కువ ధరలో పెన్నీ షేర్లు కొని లక్షాధికారులు అయిన వారు ఉన్నారు. అలాగే ఆ షేర్లు ఎక్స్చేంజ్ లో కన్పించకుండా పోయిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి పెన్నీ షేర్లు అధిక రిస్క్ తో ఉందని గుర్తు పెట్టుకోవాలి.
నిజానికి స్టాక్ మార్కేట్ లో పెన్నీ షేర్లు వందలు దొరుకుతాయి. కాని ప్రతి గులకరాయి రత్నంకాదు. అందుకే మేము పెన్నీ షేర్లను చాలా జాగ్రత్తగా విశ్లేషించి ఇచ్చాం. ఈ పెన్నీ షేర్లను ఎన్నుకునే ముందు మీరు కొనేరోజు రేట్లు, ఇతర గణాంకాలు ఒకసారి చూసుకొని మరీ ఓ నిర్ణయానికి రావాలి సుమా!
- డా.కె. కిరణ్ కుమార్
మార్కెట్ 20000 పాయింట్లు సమీపిస్తున్న నేపధ్యంలో పెన్నీ షేర్లు ఎన్నిక చేయడం చాలా కష్టం. ఇక్కడ పెన్నీ షేర్లంటే రూ.10కంటే తక్కువ వున్న షేర్లని అర్ధం. అయితే రూ.10కంటే తక్కువ వున్న షేర్లలో ముఖవిలువ రూ.1 లేదా 2ఉన్న వాటిని కూడా పెన్నీ షేర్లుగా పరిగణించారు. అంతేకాదు, రూ 20లోపు ఉన్న షేర్లను కూడా పెన్నీ షేర్లే! అయితే అలాంటి వాటిని ఈ పుస్తకంలో చాలా తక్కవ ఇచ్చారు. అయితే రూ.10లోపు వున్న వాటితో పోలిస్తే వీటిలో ఫండమెంటల్స్ కొద్దిగా మెరుగ్గా ఉన్నాయి. పెన్నీ షేర్లంటే అధిక రిస్క్ తో కూడిన వ్యవహారం. ఈ పెన్నీ షేర్లను కొనడమంటే మొత్తం డబ్బుపోయినా ఫర్వాలేదు, వస్తే అనేక రెట్లు వస్తాయి అనుకునే సాహసవంతులు మాత్రమే వాటిలో అడుగు పెట్టాలి. కొంత మందికి ధ్రిల్ కావాలి. అలాంటి వారిలో కొందరు తక్కువ ధరలో పెన్నీ షేర్లు కొని లక్షాధికారులు అయిన వారు ఉన్నారు. అలాగే ఆ షేర్లు ఎక్స్చేంజ్ లో కన్పించకుండా పోయిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి పెన్నీ షేర్లు అధిక రిస్క్ తో ఉందని గుర్తు పెట్టుకోవాలి. నిజానికి స్టాక్ మార్కేట్ లో పెన్నీ షేర్లు వందలు దొరుకుతాయి. కాని ప్రతి గులకరాయి రత్నంకాదు. అందుకే మేము పెన్నీ షేర్లను చాలా జాగ్రత్తగా విశ్లేషించి ఇచ్చాం. ఈ పెన్నీ షేర్లను ఎన్నుకునే ముందు మీరు కొనేరోజు రేట్లు, ఇతర గణాంకాలు ఒకసారి చూసుకొని మరీ ఓ నిర్ణయానికి రావాలి సుమా! - డా.కె. కిరణ్ కుమార్© 2017,www.logili.com All Rights Reserved.