సుందరం సాహితీ సేద్యం
పంట మార్పిడి విధానంతో ప్రయోజనాలు ఎక్కువని వ్యవసాయ శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. సుందరంగారి రచనలను పరిశీలిస్తే, ఈ సూత్రాన్ని ఆయన సాహిత్యానికి అన్వయించుకున్నారనిపిస్తుంది. కథ, నవల, విమర్శ, జానపద విజ్ఞానం... అలాగే ఇంగ్లీషు, తెలుగు, కన్నడ భాషల్లో ఆయన చేసిన కృషి అమోఘం. సరళంగా, సూటిగా రాయడమే తప్ప సంక్లిష్టత, నిగూఢత ఎక్కడా ఉండవు. ఈ విషయంలో కథ, కవిత అన్న తేడా లేదు.
ఈ పుస్తకంలో మొత్తం ఎనిమిది అంశాలు ఉన్నాయి. ఆధునిక వేమన శతకం అందులో మొదటిది. యజ్ఞములొనరించి రా సోమయాజులు... అంటూ మొదలుపెట్టి సిగరెట్లు మరిగిన నిత్యాగ్నిహోత్రులతో దానిని ముడిపెట్టారు. ముగ్గురు భామలను కట్టుకున్న తన తండ్రి పడ్డ పాట్లే శ్రీరామచంద్రుడికి గుణపాఠమని, అందుకే ఆయన ఏకపత్నీవ్రతుడు అయ్యాడని మరో పద్యంలో చమత్కరించారు.
'సుందర ప్రభవ', 'నది నగరం' అనే రెండూ కవితా సంకలనాలు. నాలుగో విభాగమైన 'ఆల్ ఎలోన్ ఇన్ ద స్కై' అన్న ఆంగ్ల కవితల సంకలనమూ పాఠకులను ఆకట్టుకుంటుంది. అందులో అమ్మపై రాసిన కవిత చాలా బాగుంది. ఆమెకు నేనే ఒక పరీక్ష... అయితే ఆ పరీక్షలో ఆమె ఎప్పుడూ ఫెయిల్ కాలే దు అంటారు. అయిదు, ఆరు విభాగాలైన భావన, విద్యార్థి రెండూ నవలలు. మొదటిది యాత్రా నవల. రెండోది విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని రాసినది. జిమ్మిక్కులు, ట్విస్టులు లేకుండా రాసిన సాదాసీదా నవలలు ఇవి.
ఏడోది- నన్నయ భారతానికి అనుసృజన ఈ పుస్తకానికే హైలైట్. నన్నయ రాసిన ఆది, సభా పర్వాలను తేట తెలుగులో రాశారు. రాజమండ్రి నుంచి వచ్చే ఒక దినపత్రికలో మూడు వందల రోజులపాటు ధారావాహికగా వచ్చింది. ఆ రెండు పర్వాల్లో వచ్చిన వివిధ కథ లను ఇప్పటి తరానికి అర్థమయ్యేలా చక్కగా, సరళంగా రాశారు. తింటే గారెలు, వింటే భారతం - అని ఎందుకు అన్నారో గాని... ఈ అనుసృజన అలాంటి భావన తప్పక కలిగిస్తుంది.
చివరి అంశం 'రచనాస్వాదనం'. తను చదువుకున్న కళాశాల మేగజైన్ కోసం రాసిన 'మతిహీనుడు'తో మొదలుపెట్టి ఇప్పటివరకు తన రచనలు-వాటి నేపథ్యం, అనుభవాలను సంక్షిప్తంగా తెలియజేశారు. అందులో ఒకటి దేశి కవితకు సాహిత్య అకాడమి అవార్డు రావడం గురించి. దానికి అవార్డు ఇవ్వాలని సిఫార్సు చేసిన వ్యక్తి రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. దానికి పీఠిక రాయాలని శర్మగారిని రచయిత అడిగారట.
బహుమతికి సిఫార్సు చేసినందున రాయలేనని శర్మగారు సున్నితంగా తిరస్కరించారట. దానితోపాటు 'మీ రాళ్ళపల్లి, మా రాళ్ళపల్లి ఒకటేనా' అని కూడా అడిగారట. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రచయిత మరొకటి కూడా ఈ సందర్భంలో పేర్కొన్నారు. రాళ్ళపల్లి వంశం నుంచి వచ్చిన రచయితగా ముద్రపడకూడదన్న ఉద్దేశంతో తన పేరును ఆర్వీయస్ సుందరంగా మార్చుకున్నానని చెప్పారు. ఇలాంటివే మరెన్నో ఇందులో ఉన్నాయి. పండితుడు, పామరుడు అన్న తేడా లేకుండా అందర్నీ అలరించడమే కాదు, అందరికీ అర్థం అయ్యేలా రాసిన వివిధ ప్రక్రియలు ఇవి.
- మద్దిపట్ల మణి
రాచపల్లి సుందరం గారి పూర్తి సంకలనం ఇది
కవిత
ఆధునిక వేమన శతకం
సుందర ప్రభవ
నది - నగరం
All Alone in the Sky
నవల
భావన
విద్యార్థి
అనుసృజన
నన్నయ్య భారతం
రచనానుభావాలు
ఈ సంకలనం లో ఉన్నాయి.
సుందరం సాహితీ సేద్యం పంట మార్పిడి విధానంతో ప్రయోజనాలు ఎక్కువని వ్యవసాయ శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. సుందరంగారి రచనలను పరిశీలిస్తే, ఈ సూత్రాన్ని ఆయన సాహిత్యానికి అన్వయించుకున్నారనిపిస్తుంది. కథ, నవల, విమర్శ, జానపద విజ్ఞానం... అలాగే ఇంగ్లీషు, తెలుగు, కన్నడ భాషల్లో ఆయన చేసిన కృషి అమోఘం. సరళంగా, సూటిగా రాయడమే తప్ప సంక్లిష్టత, నిగూఢత ఎక్కడా ఉండవు. ఈ విషయంలో కథ, కవిత అన్న తేడా లేదు.ఈ పుస్తకంలో మొత్తం ఎనిమిది అంశాలు ఉన్నాయి. ఆధునిక వేమన శతకం అందులో మొదటిది. యజ్ఞములొనరించి రా సోమయాజులు... అంటూ మొదలుపెట్టి సిగరెట్లు మరిగిన నిత్యాగ్నిహోత్రులతో దానిని ముడిపెట్టారు. ముగ్గురు భామలను కట్టుకున్న తన తండ్రి పడ్డ పాట్లే శ్రీరామచంద్రుడికి గుణపాఠమని, అందుకే ఆయన ఏకపత్నీవ్రతుడు అయ్యాడని మరో పద్యంలో చమత్కరించారు.'సుందర ప్రభవ', 'నది నగరం' అనే రెండూ కవితా సంకలనాలు. నాలుగో విభాగమైన 'ఆల్ ఎలోన్ ఇన్ ద స్కై' అన్న ఆంగ్ల కవితల సంకలనమూ పాఠకులను ఆకట్టుకుంటుంది. అందులో అమ్మపై రాసిన కవిత చాలా బాగుంది. ఆమెకు నేనే ఒక పరీక్ష... అయితే ఆ పరీక్షలో ఆమె ఎప్పుడూ ఫెయిల్ కాలే దు అంటారు. అయిదు, ఆరు విభాగాలైన భావన, విద్యార్థి రెండూ నవలలు. మొదటిది యాత్రా నవల. రెండోది విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని రాసినది. జిమ్మిక్కులు, ట్విస్టులు లేకుండా రాసిన సాదాసీదా నవలలు ఇవి.ఏడోది- నన్నయ భారతానికి అనుసృజన ఈ పుస్తకానికే హైలైట్. నన్నయ రాసిన ఆది, సభా పర్వాలను తేట తెలుగులో రాశారు. రాజమండ్రి నుంచి వచ్చే ఒక దినపత్రికలో మూడు వందల రోజులపాటు ధారావాహికగా వచ్చింది. ఆ రెండు పర్వాల్లో వచ్చిన వివిధ కథ లను ఇప్పటి తరానికి అర్థమయ్యేలా చక్కగా, సరళంగా రాశారు. తింటే గారెలు, వింటే భారతం - అని ఎందుకు అన్నారో గాని... ఈ అనుసృజన అలాంటి భావన తప్పక కలిగిస్తుంది.చివరి అంశం 'రచనాస్వాదనం'. తను చదువుకున్న కళాశాల మేగజైన్ కోసం రాసిన 'మతిహీనుడు'తో మొదలుపెట్టి ఇప్పటివరకు తన రచనలు-వాటి నేపథ్యం, అనుభవాలను సంక్షిప్తంగా తెలియజేశారు. అందులో ఒకటి దేశి కవితకు సాహిత్య అకాడమి అవార్డు రావడం గురించి. దానికి అవార్డు ఇవ్వాలని సిఫార్సు చేసిన వ్యక్తి రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. దానికి పీఠిక రాయాలని శర్మగారిని రచయిత అడిగారట.బహుమతికి సిఫార్సు చేసినందున రాయలేనని శర్మగారు సున్నితంగా తిరస్కరించారట. దానితోపాటు 'మీ రాళ్ళపల్లి, మా రాళ్ళపల్లి ఒకటేనా' అని కూడా అడిగారట. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రచయిత మరొకటి కూడా ఈ సందర్భంలో పేర్కొన్నారు. రాళ్ళపల్లి వంశం నుంచి వచ్చిన రచయితగా ముద్రపడకూడదన్న ఉద్దేశంతో తన పేరును ఆర్వీయస్ సుందరంగా మార్చుకున్నానని చెప్పారు. ఇలాంటివే మరెన్నో ఇందులో ఉన్నాయి. పండితుడు, పామరుడు అన్న తేడా లేకుండా అందర్నీ అలరించడమే కాదు, అందరికీ అర్థం అయ్యేలా రాసిన వివిధ ప్రక్రియలు ఇవి. - మద్దిపట్ల మణి రాచపల్లి సుందరం గారి పూర్తి సంకలనం ఇది కవిత ఆధునిక వేమన శతకం సుందర ప్రభవ నది - నగరం All Alone in the Sky నవల భావన విద్యార్థి అనుసృజన నన్నయ్య భారతం రచనానుభావాలు ఈ సంకలనం లో ఉన్నాయి.
© 2017,www.logili.com All Rights Reserved.