ఆలోచనలకు అలవాట్లున్నాయి. అలవాట్లకు ఆసరాలున్నాయి. ఆసరాలకు కొన్నిఆంక్షలు వున్నాయి. సత్యంగారు 46 ఏళ్లుగా రచనలు చేస్తున్నారు. 33 ఏళ్లుగా అమెరికాలో వుంటున్నారు. ఈ 33 ఏళ్ళలో కేవలం 40 వారాలే ఇండియాలో గడిపారు. ఈ మూడు వాక్యాలు చెప్పి, మొదటి మూడు షరతులూ సత్యంగారి రచనలకు అన్వయిస్తే, ఆయన "లోగుట్టు" మనకి అర్ధమవుతుంది. వాటి కధ చెప్పక, చెప్పుతున్నట్టవుతుంది. సత్యంగారు ఇంజనీరు. కధకి ఎలా టంకం వేయాలో, ఏయే లక్షణాలను సమీకరిస్తే కధవుతుందో, దాన్ని ఏయే పాళ్ళల్లో రంగరించాలో చదువును బట్టి, అనుభవాన్ని బట్టి ఆకలించుకున్నారు. ఈ కధలన్నింటికి అందమైన చట్రం వుంది. ఇతివృత్తంలో వైవిధ్యం వుంది. చెప్పడంలో తనదైన ఒడుపు వుంది - వెరసి చెయ్యి తిరిగిన సాక్ష్యం ఉంది.
అయితే వీటిలో కొన్ని మాత్రమే ఇండియా కధలు. అందులో ఎక్కువ కధల ఇతివృత్తాలు, రచయిత ఆలోచనల్లో, అనుభవాల్లో పుట్టినవి. కాగితం మీద సరాసరి బదిలీ అయినవి. "కరణేషు మంత్రి", "పూలు లేని కాడలు", మరో ప్రస్ధానం", అలాంటివి.
సత్యం మందపాటి
ఆలోచనలకు అలవాట్లున్నాయి. అలవాట్లకు ఆసరాలున్నాయి. ఆసరాలకు కొన్నిఆంక్షలు వున్నాయి. సత్యంగారు 46 ఏళ్లుగా రచనలు చేస్తున్నారు. 33 ఏళ్లుగా అమెరికాలో వుంటున్నారు. ఈ 33 ఏళ్ళలో కేవలం 40 వారాలే ఇండియాలో గడిపారు. ఈ మూడు వాక్యాలు చెప్పి, మొదటి మూడు షరతులూ సత్యంగారి రచనలకు అన్వయిస్తే, ఆయన "లోగుట్టు" మనకి అర్ధమవుతుంది. వాటి కధ చెప్పక, చెప్పుతున్నట్టవుతుంది. సత్యంగారు ఇంజనీరు. కధకి ఎలా టంకం వేయాలో, ఏయే లక్షణాలను సమీకరిస్తే కధవుతుందో, దాన్ని ఏయే పాళ్ళల్లో రంగరించాలో చదువును బట్టి, అనుభవాన్ని బట్టి ఆకలించుకున్నారు. ఈ కధలన్నింటికి అందమైన చట్రం వుంది. ఇతివృత్తంలో వైవిధ్యం వుంది. చెప్పడంలో తనదైన ఒడుపు వుంది - వెరసి చెయ్యి తిరిగిన సాక్ష్యం ఉంది. అయితే వీటిలో కొన్ని మాత్రమే ఇండియా కధలు. అందులో ఎక్కువ కధల ఇతివృత్తాలు, రచయిత ఆలోచనల్లో, అనుభవాల్లో పుట్టినవి. కాగితం మీద సరాసరి బదిలీ అయినవి. "కరణేషు మంత్రి", "పూలు లేని కాడలు", మరో ప్రస్ధానం", అలాంటివి. సత్యం మందపాటి© 2017,www.logili.com All Rights Reserved.