జీవితంలో ఎన్నో ఆటుపోట్లను దైర్యంగా ఎదుర్కొని తుదకు గ్రామాఫోన్ కంపెనీ అఫ్ ఇండియా (H.M.V) సంస్థలో ముప్పది సంవత్సరాలు సరస్వతీ కళామతల్లికి సేవచేసి సౌత్ ఇండియా మదరాస్ (చెన్నై)బ్రాంచ్ లో 1986 చేసి, ఎంతో మంది గొప్ప గొప్ప కళాకారుల చేత పాడించి గ్రామాఫోన్ రికార్డ్లుగా విడుదల చేయించారు. వీరి జీవితంలో అత్యంత ప్రధాన ఘట్టం ఘంటసాల గారి చేత భగవద్గీత గానం చేయించి,ఆ ప్రాజెక్ట్ లో పాలుపంచుకొని, భగవద్గీత సారాంశాన్ని సామాన్య ప్రజలకు కూడా సులువుగా అర్ధమయ్యేలా చేశారు.
ఈ పుస్తకం పేరుకు మంగపతిగారి అనుభవాల సారాంశమే అయినా, ఈ నెపంతో సుప్రసిద్ధ కళాకారుల ప్రతిబా విశేషాలను, స్వభావ రీతులను తెలుసుకునే మంచి అవకాశం కలిగింది. జేసుదాసు, రామకృష్ణ, ఆనంద్ మొదలైన ప్రముఖులనే గాక డి.యల్. నారాయణ, నందికొండ పెద్దన్న లాంటి కొత్త గొంతుకలను ప్రోత్సహించడంలో కూడా చక్కని చొరవ తీసుకున్న మంగపతి గారి విశాల హృదయానికి అందరు జేజేలు చెప్పవలసి ఉంది. అతి పేదవాడు, అనామకుడు అయిన ఆదోని గాయకుడిని, ఎందరు వెక్కిరిస్తున్నా పట్టించుకోక భుజం తట్టి ముందుకు నడిపిన మంగపతి గారి కళాహృదయం ముందు కల్పవృక్షం కూడా తలవంచాల్సిందే.
స్వరకర్తలు, గాయకులు ఘంటసాల గారి నుండి నేర్చుకోవలసిన ఒక ముఖ్య ఆదర్శాన్ని మంగపతి గారు యువతరం కోసమే ఈ గ్రంధంలో చేర్చారనిపిస్తున్నది.బాణీలను స్థిరపరచడంలో ఘంటసాల అనుసరించే ఆ పద్దతిని తప్పక అందరూ చదవాలి (195 వపుట).
-ఏం. పురుశోత్తమాచార్య
జీవితంలో ఎన్నో ఆటుపోట్లను దైర్యంగా ఎదుర్కొని తుదకు గ్రామాఫోన్ కంపెనీ అఫ్ ఇండియా (H.M.V) సంస్థలో ముప్పది సంవత్సరాలు సరస్వతీ కళామతల్లికి సేవచేసి సౌత్ ఇండియా మదరాస్ (చెన్నై)బ్రాంచ్ లో 1986 చేసి, ఎంతో మంది గొప్ప గొప్ప కళాకారుల చేత పాడించి గ్రామాఫోన్ రికార్డ్లుగా విడుదల చేయించారు. వీరి జీవితంలో అత్యంత ప్రధాన ఘట్టం ఘంటసాల గారి చేత భగవద్గీత గానం చేయించి,ఆ ప్రాజెక్ట్ లో పాలుపంచుకొని, భగవద్గీత సారాంశాన్ని సామాన్య ప్రజలకు కూడా సులువుగా అర్ధమయ్యేలా చేశారు. ఈ పుస్తకం పేరుకు మంగపతిగారి అనుభవాల సారాంశమే అయినా, ఈ నెపంతో సుప్రసిద్ధ కళాకారుల ప్రతిబా విశేషాలను, స్వభావ రీతులను తెలుసుకునే మంచి అవకాశం కలిగింది. జేసుదాసు, రామకృష్ణ, ఆనంద్ మొదలైన ప్రముఖులనే గాక డి.యల్. నారాయణ, నందికొండ పెద్దన్న లాంటి కొత్త గొంతుకలను ప్రోత్సహించడంలో కూడా చక్కని చొరవ తీసుకున్న మంగపతి గారి విశాల హృదయానికి అందరు జేజేలు చెప్పవలసి ఉంది. అతి పేదవాడు, అనామకుడు అయిన ఆదోని గాయకుడిని, ఎందరు వెక్కిరిస్తున్నా పట్టించుకోక భుజం తట్టి ముందుకు నడిపిన మంగపతి గారి కళాహృదయం ముందు కల్పవృక్షం కూడా తలవంచాల్సిందే. స్వరకర్తలు, గాయకులు ఘంటసాల గారి నుండి నేర్చుకోవలసిన ఒక ముఖ్య ఆదర్శాన్ని మంగపతి గారు యువతరం కోసమే ఈ గ్రంధంలో చేర్చారనిపిస్తున్నది.బాణీలను స్థిరపరచడంలో ఘంటసాల అనుసరించే ఆ పద్దతిని తప్పక అందరూ చదవాలి (195 వపుట). -ఏం. పురుశోత్తమాచార్య© 2017,www.logili.com All Rights Reserved.