పత్రికలు సమాజానికి వాచ్ డాగ్స్ అయితే రచయితలూ సమాజానికి సాంస్కృతిక సైనికులు. ప్రజల పక్షాన నిలిచి, సాహిత్య సాంస్కృతిక అభ్యుదయాన్ని భాషా, భావపరమైన సంస్కరణోద్యమాలను విస్తృతంగా వ్యాప్తి గావిస్తున్న వామపక్ష పత్రిక గత 64 సంవత్సరాలుగా యావద్భారతంలో విశాలాంద్రే అంటే ఆశ్చర్యం కలగవచ్చు కాని, ఇది స్తవం గాని వాస్తవం. ఆధునిక యుగ త్రిమూర్తులు కందుకూరి, గురజాడ, గిడుగు సాహితీ వారసత్వాన్ని పడునేక్కించి, నార్వోసీ, నీర్వేట్టి సాహితీ ఎర్రమందారాలను వికసింపజేసింది.
'సామాజిక సర్వతోముఖాభివృద్దే" ఎప్పటికీ విశాలాంధ్ర ఏకైన ధ్యేయం. 'వస్తున్నది విశాలాంధ్ర తెస్తున్నది కొత్త వెలుగు' ని కలమేట్టి, గళమెత్తి ఆనాడే నినాదించాడు మహాకవి శ్రీశ్రీ. 'ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతురని' వీర తెలంగాణా యోధులకు విప్లవ జేజేలు పలికి, అభ్యుదయ సాహిత్యాన్ని అన్నార్తులకు అండగా నిలిపింది. అభ్యుదయ సాహితోద్యమానికి విశాలాంధ్ర పెట్టనికోట. పురోగామి ప్రజాశక్తుల ప్రగతిబాట, లౌకిక ప్రజాతంత్రశక్తుల పోరాటాలకు "చెయ్యెత్తి జై కొట్టంది". ఈ అభ్యుదయ, ప్రగతిషీలా సాహిత్యాన్ని మనసు విప్పి చదువుతారని, హృదయం ఉప్పొంగ పరవశిస్తారని ఆశిద్దాం.
పత్రికలు సమాజానికి వాచ్ డాగ్స్ అయితే రచయితలూ సమాజానికి సాంస్కృతిక సైనికులు. ప్రజల పక్షాన నిలిచి, సాహిత్య సాంస్కృతిక అభ్యుదయాన్ని భాషా, భావపరమైన సంస్కరణోద్యమాలను విస్తృతంగా వ్యాప్తి గావిస్తున్న వామపక్ష పత్రిక గత 64 సంవత్సరాలుగా యావద్భారతంలో విశాలాంద్రే అంటే ఆశ్చర్యం కలగవచ్చు కాని, ఇది స్తవం గాని వాస్తవం. ఆధునిక యుగ త్రిమూర్తులు కందుకూరి, గురజాడ, గిడుగు సాహితీ వారసత్వాన్ని పడునేక్కించి, నార్వోసీ, నీర్వేట్టి సాహితీ ఎర్రమందారాలను వికసింపజేసింది. 'సామాజిక సర్వతోముఖాభివృద్దే" ఎప్పటికీ విశాలాంధ్ర ఏకైన ధ్యేయం. 'వస్తున్నది విశాలాంధ్ర తెస్తున్నది కొత్త వెలుగు' ని కలమేట్టి, గళమెత్తి ఆనాడే నినాదించాడు మహాకవి శ్రీశ్రీ. 'ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతురని' వీర తెలంగాణా యోధులకు విప్లవ జేజేలు పలికి, అభ్యుదయ సాహిత్యాన్ని అన్నార్తులకు అండగా నిలిపింది. అభ్యుదయ సాహితోద్యమానికి విశాలాంధ్ర పెట్టనికోట. పురోగామి ప్రజాశక్తుల ప్రగతిబాట, లౌకిక ప్రజాతంత్రశక్తుల పోరాటాలకు "చెయ్యెత్తి జై కొట్టంది". ఈ అభ్యుదయ, ప్రగతిషీలా సాహిత్యాన్ని మనసు విప్పి చదువుతారని, హృదయం ఉప్పొంగ పరవశిస్తారని ఆశిద్దాం.
© 2017,www.logili.com All Rights Reserved.