గతకాలపు సంఘటనలను వివరించేదే చరిత్ర. గతాన్ని విస్మరించిన వ్యక్తికి, జాతికి సరియైన భవిష్యత్తు ఉండదు. అయితే చరిత్ర అధ్యయనం గతంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన తారీఖులను, వ్యక్తుల పేర్లను నేమరువేయడానికే పరిమితమైతే దానివలన ఉపయోగం ఉండదు. గతంలో జరిగిన సంఘటనల కారణాలను, ఫలితాలను, పర్యవసానాలను, మంచి చెడ్డలను గ్రహించి వాటి నుండి గుణపాఠం నేర్వగలిగినప్పుడే చరిత్ర అధ్యయనానికి సార్ధకత ఉంటుంది. - అప్పుడే భవిష్యత్తుకు మార్గ దర్శకమవుతుంది. జాతులు వివేకవంతమవుతాయి. ఈ దృష్టితో చూసినప్పుడు చరిత్ర అధ్యయన ఆవశ్యకత అర్ధమవుతుంది.
అంతర్జాతీయ వాణిజ్యం, శాస్త్రవిజ్ఞానం శీఘ్రగతిని విస్తరిస్తున్న ఆధునికయుగంలో ప్రపంచం రోజురోజుకీ సంకుచితమై వివిధ దేశాలూ పరస్పరాధారభూతమవుతున్నాయి. ఈ స్థితిలో మానవుడు తన దేశ చరిత్రనే కాక ప్రపంచ చరిత్రను కూడా అధ్యాయం చేయవలసిన అగత్యం ఏర్పడింది. అయితే తెలుగులో ప్రపంచ చరిత్ర గ్రంధాలు తగినంతగా లభ్యం కావడం లేదు. ఈ కొరత కొంతవరకైనా తీర్చడమే ఈ సంక్షిప్త గ్రంథ రచనా లక్ష్యం.
- రచయిత
గతకాలపు సంఘటనలను వివరించేదే చరిత్ర. గతాన్ని విస్మరించిన వ్యక్తికి, జాతికి సరియైన భవిష్యత్తు ఉండదు. అయితే చరిత్ర అధ్యయనం గతంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన తారీఖులను, వ్యక్తుల పేర్లను నేమరువేయడానికే పరిమితమైతే దానివలన ఉపయోగం ఉండదు. గతంలో జరిగిన సంఘటనల కారణాలను, ఫలితాలను, పర్యవసానాలను, మంచి చెడ్డలను గ్రహించి వాటి నుండి గుణపాఠం నేర్వగలిగినప్పుడే చరిత్ర అధ్యయనానికి సార్ధకత ఉంటుంది. - అప్పుడే భవిష్యత్తుకు మార్గ దర్శకమవుతుంది. జాతులు వివేకవంతమవుతాయి. ఈ దృష్టితో చూసినప్పుడు చరిత్ర అధ్యయన ఆవశ్యకత అర్ధమవుతుంది. అంతర్జాతీయ వాణిజ్యం, శాస్త్రవిజ్ఞానం శీఘ్రగతిని విస్తరిస్తున్న ఆధునికయుగంలో ప్రపంచం రోజురోజుకీ సంకుచితమై వివిధ దేశాలూ పరస్పరాధారభూతమవుతున్నాయి. ఈ స్థితిలో మానవుడు తన దేశ చరిత్రనే కాక ప్రపంచ చరిత్రను కూడా అధ్యాయం చేయవలసిన అగత్యం ఏర్పడింది. అయితే తెలుగులో ప్రపంచ చరిత్ర గ్రంధాలు తగినంతగా లభ్యం కావడం లేదు. ఈ కొరత కొంతవరకైనా తీర్చడమే ఈ సంక్షిప్త గ్రంథ రచనా లక్ష్యం. - రచయిత© 2017,www.logili.com All Rights Reserved.