'శంకర అంటేనే నాకు
శక్కర లెక్కనె ఉంటదయ్య
శివునాగ్నైతది... సీమనైత...
శబ్బాష్ రా... శంకరా!'
ఇదీ కత!
నేను శివసంబధమైన సాహిత్యం చాలా చదివాను. కొన్ని రాశాను. కానీ ఎక్కడా ఒక 'యాస' లో శివస్తుతి చేసిన దాఖలా నాక్కనబళ్ళా! మహాకవి ధూర్జటి అన్నట్టు... భాషకి, ప్రాసకి యాసకీ వాడు లొంగుతాడా!
అయినా సరే... భక్త సులభుడు కదా! అని... తెలంగాణ యాసలో ఓ మొదలెట్టా! ఓ పది రాసి మా బ్రహ్మానందానికి వినిపించాను. శభాషన్నాడు! ఓ పాతిక రాసి కె. విశ్వనాద్ గారూ... బాలూ ఉన్న సభలో చదివాను. వాళ్ళు 'శహభాషె' అన్నారు. తరువాత ఓ షూటింగ్ లో పూరీ జగన్నాధ్ కి వినిపించా. పులకించిపోయాడు.
గురువుగారు వేటూరిగారికి వినిపిస్తే...
"తెలుగు సాహిత్యంలో ఇదో కొత్త ధోరణి" అన్నారు. ఆననందం వేసింది. ఇప్పుడాయన లేకపోయినా ఆయన ఆశీస్సు మాత్రం నిరంతరం నా వెంట ఉంటుంది. అక్కణ్ణించి ధార మొదలయ్యింది.
నాకా రావయ ఓనమాలు
బిల్ కుల్ రాదు చంధస్సు
నువ్వే యతివి... గణాలు సుట్టుముట్టూ
శబ్భాష్ రా శంకరా!
- తనికెళ్ళ భరణి
'శంకర అంటేనే నాకు శక్కర లెక్కనె ఉంటదయ్య శివునాగ్నైతది... సీమనైత... శబ్బాష్ రా... శంకరా!' ఇదీ కత! నేను శివసంబధమైన సాహిత్యం చాలా చదివాను. కొన్ని రాశాను. కానీ ఎక్కడా ఒక 'యాస' లో శివస్తుతి చేసిన దాఖలా నాక్కనబళ్ళా! మహాకవి ధూర్జటి అన్నట్టు... భాషకి, ప్రాసకి యాసకీ వాడు లొంగుతాడా! అయినా సరే... భక్త సులభుడు కదా! అని... తెలంగాణ యాసలో ఓ మొదలెట్టా! ఓ పది రాసి మా బ్రహ్మానందానికి వినిపించాను. శభాషన్నాడు! ఓ పాతిక రాసి కె. విశ్వనాద్ గారూ... బాలూ ఉన్న సభలో చదివాను. వాళ్ళు 'శహభాషె' అన్నారు. తరువాత ఓ షూటింగ్ లో పూరీ జగన్నాధ్ కి వినిపించా. పులకించిపోయాడు. గురువుగారు వేటూరిగారికి వినిపిస్తే... "తెలుగు సాహిత్యంలో ఇదో కొత్త ధోరణి" అన్నారు. ఆననందం వేసింది. ఇప్పుడాయన లేకపోయినా ఆయన ఆశీస్సు మాత్రం నిరంతరం నా వెంట ఉంటుంది. అక్కణ్ణించి ధార మొదలయ్యింది. నాకా రావయ ఓనమాలు బిల్ కుల్ రాదు చంధస్సు నువ్వే యతివి... గణాలు సుట్టుముట్టూ శబ్భాష్ రా శంకరా! - తనికెళ్ళ భరణి© 2017,www.logili.com All Rights Reserved.