త్సునేసాబురో మాకిగుచి మేధావి, భోధనా శీలి, జపాన్ విద్య విషయంలో స్పష్టమైన ఆలోచనలు వున్నవాడు. లోక హితార్ధమైన విద్యాబోధనలో ఆనాటి విద్యా ప్రణాళిక అమూల్యమైన పరివర్తన తీసుకురావాలన్నది నాగరికుల ఆలోచనా శీలురకు వుండాలి. ఆయన అభిప్రాయంలో విద్య ప్రధాన భూమిక ఆనందం అందించడంగా ఉండాలి. యీ ప్రాతిపదిక మీదనే విద్యా ప్రణాళికా రచన సాగాలి. కార్యక్రమాలు రూపొందాలి. విద్య, విద్యార్ధులు జీవితలక్ష్యాల కోసం మిళితం కావాలి. ఆనందానికి ఆధారం జీవితపు విలువలు అయివుండాలి. ప్రస్తుతం యీ గ్రంథం మాకిగుచి ప్రేరణ దర్శకత్వాన్ని పురోగామి ప్రతిపాదనలని స్థూల రేఖల్లో మీ ముందు వుంచుతుంది. ఆయన దృష్టిలో జీవితం, విద్య అనేవి రెండూ చలన శీలంగా వుండాలన్న భావం గర్భితమైవుంది.
త్సునేసాబురో మాకిగుచి(రచయిత గురించి) :
త్సునేసాబురో ఒక ఉపాధ్యాయుడు. జపాన్ లోని ఓ గ్రామంలో 1871లో జన్మించారు. 1913లో ఓ ప్రాధమిక పాఠశాల ప్రధానాద్యాపకుడయేడు. 20 యేళ్ళు ఆ వృత్తిలోనే వున్నారు. ఆ రెండు దశాబ్దాల్లోనూ ఆయన చేసిన కృషి, పొందిన అనుభవం యీ పుస్తకంలో ప్రతి ఫలిస్తున్నాయి. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఆనాటి ప్రభుత్వం ఘర్షణలు ఎదుర్కొన్నారు. జైలు శిక్ష కూడా అనుభవించవలసి వచ్చింది. 1944లో జైలులోనే మృతి చెందారు.
డేల్.ఎమ్. బెధేల్ ఒసాకా, జపాన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ లెర్నింగ్ సెంటర్ లో విద్యా, మానవ శాస్త్ర డీన్, ప్రొఫెసర్. ఆయన విద్యాబోధన, శిక్షణ రంగాల్లో ముప్పై యేళ్ళుపైబడి అనుభవం గడించారు. త్సునేసాబురో మాకిగుచి జీవితం గురించి, విద్య దార్శనికత గురించీ, ముప్పై ఏళ్లుగా పరిశోధన చేశారు
- డేల్.ఎమ్. బెధేల్ ఒసాకా
ఆర్వియార్(అనువాదకులు) :
తెలుగు పాఠకులకు సుపరిచితులు, ఈ గ్రంధాన్ని అనువదించారు. వీరు ఒక దశాబ్దంపాటు మాస్కో నందలి రాదుగ ప్రచురణాలయంలో అనువాదకులుగా పనిచేశారు. ఎనబైకి పైగా అనువాదాలూ, పదికిపైగా సొంత రచనలూ చేశారు. చాలా ప్రభుత్వ కళాశాలల్లో ఇంగిషు లెక్చెరర్ గా పనిచేసి తరువాత ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేశారు.
- త్సునెసాబురో మాకిగుచి
త్సునేసాబురో మాకిగుచి మేధావి, భోధనా శీలి, జపాన్ విద్య విషయంలో స్పష్టమైన ఆలోచనలు వున్నవాడు. లోక హితార్ధమైన విద్యాబోధనలో ఆనాటి విద్యా ప్రణాళిక అమూల్యమైన పరివర్తన తీసుకురావాలన్నది నాగరికుల ఆలోచనా శీలురకు వుండాలి. ఆయన అభిప్రాయంలో విద్య ప్రధాన భూమిక ఆనందం అందించడంగా ఉండాలి. యీ ప్రాతిపదిక మీదనే విద్యా ప్రణాళికా రచన సాగాలి. కార్యక్రమాలు రూపొందాలి. విద్య, విద్యార్ధులు జీవితలక్ష్యాల కోసం మిళితం కావాలి. ఆనందానికి ఆధారం జీవితపు విలువలు అయివుండాలి. ప్రస్తుతం యీ గ్రంథం మాకిగుచి ప్రేరణ దర్శకత్వాన్ని పురోగామి ప్రతిపాదనలని స్థూల రేఖల్లో మీ ముందు వుంచుతుంది. ఆయన దృష్టిలో జీవితం, విద్య అనేవి రెండూ చలన శీలంగా వుండాలన్న భావం గర్భితమైవుంది. త్సునేసాబురో మాకిగుచి(రచయిత గురించి) : త్సునేసాబురో ఒక ఉపాధ్యాయుడు. జపాన్ లోని ఓ గ్రామంలో 1871లో జన్మించారు. 1913లో ఓ ప్రాధమిక పాఠశాల ప్రధానాద్యాపకుడయేడు. 20 యేళ్ళు ఆ వృత్తిలోనే వున్నారు. ఆ రెండు దశాబ్దాల్లోనూ ఆయన చేసిన కృషి, పొందిన అనుభవం యీ పుస్తకంలో ప్రతి ఫలిస్తున్నాయి. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఆనాటి ప్రభుత్వం ఘర్షణలు ఎదుర్కొన్నారు. జైలు శిక్ష కూడా అనుభవించవలసి వచ్చింది. 1944లో జైలులోనే మృతి చెందారు. డేల్.ఎమ్. బెధేల్ ఒసాకా, జపాన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ లెర్నింగ్ సెంటర్ లో విద్యా, మానవ శాస్త్ర డీన్, ప్రొఫెసర్. ఆయన విద్యాబోధన, శిక్షణ రంగాల్లో ముప్పై యేళ్ళుపైబడి అనుభవం గడించారు. త్సునేసాబురో మాకిగుచి జీవితం గురించి, విద్య దార్శనికత గురించీ, ముప్పై ఏళ్లుగా పరిశోధన చేశారు - డేల్.ఎమ్. బెధేల్ ఒసాకా ఆర్వియార్(అనువాదకులు) : తెలుగు పాఠకులకు సుపరిచితులు, ఈ గ్రంధాన్ని అనువదించారు. వీరు ఒక దశాబ్దంపాటు మాస్కో నందలి రాదుగ ప్రచురణాలయంలో అనువాదకులుగా పనిచేశారు. ఎనబైకి పైగా అనువాదాలూ, పదికిపైగా సొంత రచనలూ చేశారు. చాలా ప్రభుత్వ కళాశాలల్లో ఇంగిషు లెక్చెరర్ గా పనిచేసి తరువాత ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేశారు. - త్సునెసాబురో మాకిగుచి
© 2017,www.logili.com All Rights Reserved.