శ్రీఆదిశక్తి అవతారాలు భూలోకంలో ఎన్నో ఉన్నట్లుగా వివిధ పురాణాలు పేర్కొంటున్నాయి. ఇలా జగన్మాత ధరించిన అన్ని రూపాల్లో "దశమహావిద్యలు" అనే పది రూపాలు ఎంతో విభిన్నమైనవిగా, విశిష్టమైనవిగా లోకంలో ప్రసిద్ధి పొందాయి. కాళీ, తార, షోడశీ, భువనేశ్వరీ, భైరవీ, చిన్నమస్తా, ధూమావతీ, బగళాముఖీ, మాతంగీ, కమలాత్మికా అనేవి దశమహావిద్యాల నామాలు. పూర్వం దుర్గాదేవి లోకాలని కాపాడాలని దేవతల్ని ఉద్దరించాలని దుర్గముడితో యుద్ధానికి ఉపక్రమించింది. దేవీ దుర్గముల మధ్య భయంకరంగా యుద్ధం కొనసాగుతున్న సమయంలో దేవీ శరీరం నుంచి ఒక్కసారిగా ఈ దశమహావిద్యలు ఆవిర్భవించాయట.
శ్రీదేవి భాగవతంలోని 12వ స్కంధంలో ఆదిపరాశక్తి కొలువుండే మణిద్వీపంలోని నవరత్న ప్రాకారంలో ఈ దశమహావిద్యలన్నీ కొలువుదీరి ఉంటాయని చెప్పటం జరిగింది. దీనిని బట్టి చింతామణి ద్వీప నివాసిని అయిన ఆదిపరాశాక్తికి అత్యంత సమీపంలో నివసించే ఈ మహాశక్తులే దశమహావిద్యలని తెలుస్తుంది. అందుకే ఈ మహావిద్యలకి ఇంత గొప్ప ప్రాముఖ్యత లోకంలో కలిగింది.
శ్రీఆదిశక్తి అవతారాలు భూలోకంలో ఎన్నో ఉన్నట్లుగా వివిధ పురాణాలు పేర్కొంటున్నాయి. ఇలా జగన్మాత ధరించిన అన్ని రూపాల్లో "దశమహావిద్యలు" అనే పది రూపాలు ఎంతో విభిన్నమైనవిగా, విశిష్టమైనవిగా లోకంలో ప్రసిద్ధి పొందాయి. కాళీ, తార, షోడశీ, భువనేశ్వరీ, భైరవీ, చిన్నమస్తా, ధూమావతీ, బగళాముఖీ, మాతంగీ, కమలాత్మికా అనేవి దశమహావిద్యాల నామాలు. పూర్వం దుర్గాదేవి లోకాలని కాపాడాలని దేవతల్ని ఉద్దరించాలని దుర్గముడితో యుద్ధానికి ఉపక్రమించింది. దేవీ దుర్గముల మధ్య భయంకరంగా యుద్ధం కొనసాగుతున్న సమయంలో దేవీ శరీరం నుంచి ఒక్కసారిగా ఈ దశమహావిద్యలు ఆవిర్భవించాయట. శ్రీదేవి భాగవతంలోని 12వ స్కంధంలో ఆదిపరాశక్తి కొలువుండే మణిద్వీపంలోని నవరత్న ప్రాకారంలో ఈ దశమహావిద్యలన్నీ కొలువుదీరి ఉంటాయని చెప్పటం జరిగింది. దీనిని బట్టి చింతామణి ద్వీప నివాసిని అయిన ఆదిపరాశాక్తికి అత్యంత సమీపంలో నివసించే ఈ మహాశక్తులే దశమహావిద్యలని తెలుస్తుంది. అందుకే ఈ మహావిద్యలకి ఇంత గొప్ప ప్రాముఖ్యత లోకంలో కలిగింది.© 2017,www.logili.com All Rights Reserved.