స్నేహితులైన వారిని అందరితో పోల్చలేము. దానికి తార్కాణం ప్రమోద్ కుమార్ గారే...
కాలం మర్చిపోయిన ఎన్నో తెరవెనుక చిత్రవిచిత్రాల్ని గుదిగుచ్చి ఒకచోట పరిచిపెట్టిన సమగ్ర స్వరూపమే ఈ "తెరవెనుక తెలుగు సినిమా" పుస్తకం.
- ఈశ్వర్
సుదీర్ఘ సినీ జీవితంలో ఎదుర్కొన్న మధురమైన సందర్భాలను, సున్నితంగా మనసును గాయపరచే కొన్ని సంఘటనలను ప్రమోద్ కుమార్ గారు సమదృష్టితోటే చూసి సమన్వయించుకున్నారు. ఇటువంటి ఎన్నో సంఘటనల రసమాలికా సంపుటి ఈ పుస్తకం.
ఆయనకు అందరూ ఆత్మియులే! కొందరు ఆత్మబంధువులున్నారు. వారిలో దాసరి, రాఘవేంద్రరావు, క్రాంతికుమార్, మోహన్ బాబు, చిరంజీవి ముఖ్యులు. వారందరి ఆత్మీయ స్పర్శను ఆయన సృశించారు, పరవశించారు. అక్కడితో ఆగలేదు. అంతే ఆర్ద్రతతో రంగుల హరివిల్లులాంటి ఏడడుగుల సినీ భవంతినే కాదు, ఆ భవంతి క్రిందనున్న పునాదిరాళ్ళలను గురించి కూడా ఆయన ముచ్చటించారు.
సినిమా క్రెడిట్ కార్డులో పేరుకు నోచుకోని, సామాన్య కష్టజీవులను పలకరించారు. వారిలో నిబద్ధతను, ఆత్మీయతను మనముందుంచారు. వంటల కోటేశ్వరరావు, లైట్ బాయ్స్, కారు డ్రైవర్ ల కష్టం గురించి వివరించారు. సామాన్యంగా సినిమా వ్యాసాలు వ్రాసేవారేవారూ చేయని పని ఇది. అలానే సినీ ప్రముఖల కేంద్ర బిందువుగా నిలబడిన ఆంధ్రా క్లబ్, పానగల్లు పార్కుల గురించి కూడా. శిలాశాసనం, సెలవంటూ సాగిపోయావా తల్లీ, కన్నీటి కాసారాలు మాకు వదిలి అన్న వ్యాసాలు చదివినపుడు మన గుండె బరువెక్కుతుంది. సూటిగా, హృదయానికి తెకేలా చెప్పే గుణం ఆయన ప్రత్యేకత. తినబోతూ రుచెందుకు? వెంటనే చదవండి.
- కాండ్రేగుల నాగేశ్వరరావు (ఉపసంపాదకులు, మిసిమి.)
ఆయన పబ్లిసిటీ ఇన్ చార్జిగా పనిచేసిన అనుభవాలు ఈ పుస్తకంలో ముఖ్యవిషయాలు. దానితోపాటుగా తన జీవనంలో తారసపడ్డ ఎన్నో ప్రమోద ఘటనలు, తమ పూర్వికుల చరిత్రను ఇందులో పదిలపరుచుకున్నారు. ఈ పుస్తకం ఆయన ఆత్మసాక్షికీ దర్పణంగా మనముందుంచబడింది.
- వి. ప్రమోద్ కుమార్
స్నేహితులైన వారిని అందరితో పోల్చలేము. దానికి తార్కాణం ప్రమోద్ కుమార్ గారే... కాలం మర్చిపోయిన ఎన్నో తెరవెనుక చిత్రవిచిత్రాల్ని గుదిగుచ్చి ఒకచోట పరిచిపెట్టిన సమగ్ర స్వరూపమే ఈ "తెరవెనుక తెలుగు సినిమా" పుస్తకం. - ఈశ్వర్ సుదీర్ఘ సినీ జీవితంలో ఎదుర్కొన్న మధురమైన సందర్భాలను, సున్నితంగా మనసును గాయపరచే కొన్ని సంఘటనలను ప్రమోద్ కుమార్ గారు సమదృష్టితోటే చూసి సమన్వయించుకున్నారు. ఇటువంటి ఎన్నో సంఘటనల రసమాలికా సంపుటి ఈ పుస్తకం. ఆయనకు అందరూ ఆత్మియులే! కొందరు ఆత్మబంధువులున్నారు. వారిలో దాసరి, రాఘవేంద్రరావు, క్రాంతికుమార్, మోహన్ బాబు, చిరంజీవి ముఖ్యులు. వారందరి ఆత్మీయ స్పర్శను ఆయన సృశించారు, పరవశించారు. అక్కడితో ఆగలేదు. అంతే ఆర్ద్రతతో రంగుల హరివిల్లులాంటి ఏడడుగుల సినీ భవంతినే కాదు, ఆ భవంతి క్రిందనున్న పునాదిరాళ్ళలను గురించి కూడా ఆయన ముచ్చటించారు. సినిమా క్రెడిట్ కార్డులో పేరుకు నోచుకోని, సామాన్య కష్టజీవులను పలకరించారు. వారిలో నిబద్ధతను, ఆత్మీయతను మనముందుంచారు. వంటల కోటేశ్వరరావు, లైట్ బాయ్స్, కారు డ్రైవర్ ల కష్టం గురించి వివరించారు. సామాన్యంగా సినిమా వ్యాసాలు వ్రాసేవారేవారూ చేయని పని ఇది. అలానే సినీ ప్రముఖల కేంద్ర బిందువుగా నిలబడిన ఆంధ్రా క్లబ్, పానగల్లు పార్కుల గురించి కూడా. శిలాశాసనం, సెలవంటూ సాగిపోయావా తల్లీ, కన్నీటి కాసారాలు మాకు వదిలి అన్న వ్యాసాలు చదివినపుడు మన గుండె బరువెక్కుతుంది. సూటిగా, హృదయానికి తెకేలా చెప్పే గుణం ఆయన ప్రత్యేకత. తినబోతూ రుచెందుకు? వెంటనే చదవండి. - కాండ్రేగుల నాగేశ్వరరావు (ఉపసంపాదకులు, మిసిమి.) ఆయన పబ్లిసిటీ ఇన్ చార్జిగా పనిచేసిన అనుభవాలు ఈ పుస్తకంలో ముఖ్యవిషయాలు. దానితోపాటుగా తన జీవనంలో తారసపడ్డ ఎన్నో ప్రమోద ఘటనలు, తమ పూర్వికుల చరిత్రను ఇందులో పదిలపరుచుకున్నారు. ఈ పుస్తకం ఆయన ఆత్మసాక్షికీ దర్పణంగా మనముందుంచబడింది. - వి. ప్రమోద్ కుమార్
© 2017,www.logili.com All Rights Reserved.