'సినిమాపాట పుట్టుపూర్వోత్తరాల గురించి పెద్ద రీసెర్చి ఏమిటి? అదంత కష్టమైన విషయమా? అసలు సినిమాపాట రాయడం, పాడటం పెద్ద విద్యా?' అనే విద్యాధికులకు నేను ఈ పుస్తకం గురించి ఏమి చెప్పినా, ఎంత చెప్పినా సహించదు. ఎందుకంటే నేను ఆ 'లొల్లాయి పాటలు' పాడి పొట్టపోసుకునే వాడిని గనుక. క్లుప్తంగా చెప్పాలంటే ఆ వృత్తి జీవనంలో నేను సగర్వంగా చెప్పుకొనేట్టు చేసిన కొన్ని పనులలో ఈ పుస్తకానికి కొద్దో గొప్పో సహకరించడమనేది అతి ముఖ్యమైనది. 'మామూలు భావుణ్ణి' నాకు మాత్రమే కాదు, మా సినిమాకు సంబంధించిన మహానుభావులకూ తెలియని, తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రతి సినిమా ప్రేక్షకుడు చదవాల్సిన పుస్తకం అంటే అతిశయోక్తి కాదు. సినిమా బ్రతికినంత కాలం వేల కట్టలేని ఈ పుస్తకం, ఈ రచయిత శ్రమా - జీవిస్తాయి.
'సినిమాపాట పుట్టుపూర్వోత్తరాల గురించి పెద్ద రీసెర్చి ఏమిటి? అదంత కష్టమైన విషయమా? అసలు సినిమాపాట రాయడం, పాడటం పెద్ద విద్యా?' అనే విద్యాధికులకు నేను ఈ పుస్తకం గురించి ఏమి చెప్పినా, ఎంత చెప్పినా సహించదు. ఎందుకంటే నేను ఆ 'లొల్లాయి పాటలు' పాడి పొట్టపోసుకునే వాడిని గనుక. క్లుప్తంగా చెప్పాలంటే ఆ వృత్తి జీవనంలో నేను సగర్వంగా చెప్పుకొనేట్టు చేసిన కొన్ని పనులలో ఈ పుస్తకానికి కొద్దో గొప్పో సహకరించడమనేది అతి ముఖ్యమైనది. 'మామూలు భావుణ్ణి' నాకు మాత్రమే కాదు, మా సినిమాకు సంబంధించిన మహానుభావులకూ తెలియని, తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రతి సినిమా ప్రేక్షకుడు చదవాల్సిన పుస్తకం అంటే అతిశయోక్తి కాదు. సినిమా బ్రతికినంత కాలం వేల కట్టలేని ఈ పుస్తకం, ఈ రచయిత శ్రమా - జీవిస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.