Vaikuntapali

Rs.150
Rs.150

Vaikuntapali
INR
SAHITY1023
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

  1. వైకుంఠపాళి

తెలుగు ఆటయె చూపించు వెలుగుబాట తెలుగు మాటయె చెవినించు తేటిపాట తెలుగు పాటయె రుచిమించు తేనె ఊట

తెలుగు పద్యమ్మె గెలిపించు తెలుగు బాల కొన్ని వేల పద్యాలు, పాటలు, మాటలు అందించగలిగే ధైర్యం ఒక్క తెలుగు ఆట అందిస్తుంది. అదే వైకుంఠపాళి. తెలుగు తోటలో పండిన విక్రమకేళి. దీన్నే ఆధ్యాత్మిక పరిభాషలో “పరమపద సోపాన పటము" అంటారు. కొన్ని ప్రాంతాల్లో “పాము పటం” అంటారు.

'గాలి పటాలతో ఆడటం తప్ప పాము పటాలతో ఆడే ధైర్యం ఇప్పటి పిల్లలకు నేర్పడం లేదు కానీ ఈ వైకుంఠపాళి ఆడిన వాళ్ళెవరూ ఆత్మహత్యలకు పాల్పడరు. నిరాశా నిస్పృహలకు లోనుకారు.

కేవలం నాలుగు గవ్వలతో మూడో, నాలుగో చింత పిక్కలతో జీవితాన్ని ఆస్వాదించగలిగే, అనుభవించగలిగే, ఎదిరించగలిగే ధైర్యాన్ని, సైర్యాన్ని ఇచ్చే ఈ ఆట తెలుగువారి సృష్టి, తెలుగు సంస్కృతిలో పుత్రకామేష్టి

ఇందులో 11 వరుసలుంటాయి. ఒక్కో వరుసలో 11 గడులుంటాయి. మొత్తం 121 గడులు పూర్తయ్యాక 11 గడులలో పరమపద సోపాన పటము' అని 11 అక్షరాలు రాసి ఉంటాయి. ఆ పైన “ధర సింహాసనమై, నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై..... సిరి భార్యామణియై” అన్నట్లుగా పదిమంది దివ్యపురుషుల మధ్యలో శ్రీ మహావిష్ణువు కొలువై యుంటాడు. చివరకు చేరుకోవాల్సిన స్థానం అది. అక్కడకు చేరుకొనేవరకు (జీవితమనే) ఆట ఆడుతూ ఉండవలసిందే. ఈలోగా ఒకటి నుండి 121 వరకు ఎక్కుతూ............

వైకుంఠపాళి తెలుగు ఆటయె చూపించు వెలుగుబాట తెలుగు మాటయె చెవినించు తేటిపాట తెలుగు పాటయె రుచిమించు తేనె ఊట తెలుగు పద్యమ్మె గెలిపించు తెలుగు బాల కొన్ని వేల పద్యాలు, పాటలు, మాటలు అందించగలిగే ధైర్యం ఒక్క తెలుగు ఆట అందిస్తుంది. అదే వైకుంఠపాళి. తెలుగు తోటలో పండిన విక్రమకేళి. దీన్నే ఆధ్యాత్మిక పరిభాషలో “పరమపద సోపాన పటము" అంటారు. కొన్ని ప్రాంతాల్లో “పాము పటం” అంటారు. 'గాలి పటాలతో ఆడటం తప్ప పాము పటాలతో ఆడే ధైర్యం ఇప్పటి పిల్లలకు నేర్పడం లేదు కానీ ఈ వైకుంఠపాళి ఆడిన వాళ్ళెవరూ ఆత్మహత్యలకు పాల్పడరు. నిరాశా నిస్పృహలకు లోనుకారు. కేవలం నాలుగు గవ్వలతో మూడో, నాలుగో చింత పిక్కలతో జీవితాన్ని ఆస్వాదించగలిగే, అనుభవించగలిగే, ఎదిరించగలిగే ధైర్యాన్ని, సైర్యాన్ని ఇచ్చే ఈ ఆట తెలుగువారి సృష్టి, తెలుగు సంస్కృతిలో పుత్రకామేష్టి ఇందులో 11 వరుసలుంటాయి. ఒక్కో వరుసలో 11 గడులుంటాయి. మొత్తం 121 గడులు పూర్తయ్యాక 11 గడులలో పరమపద సోపాన పటము' అని 11 అక్షరాలు రాసి ఉంటాయి. ఆ పైన “ధర సింహాసనమై, నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై..... సిరి భార్యామణియై” అన్నట్లుగా పదిమంది దివ్యపురుషుల మధ్యలో శ్రీ మహావిష్ణువు కొలువై యుంటాడు. చివరకు చేరుకోవాల్సిన స్థానం అది. అక్కడకు చేరుకొనేవరకు (జీవితమనే) ఆట ఆడుతూ ఉండవలసిందే. ఈలోగా ఒకటి నుండి 121 వరకు ఎక్కుతూ............

Features

  • : Vaikuntapali
  • : Garikapati Narisimha Rao
  • : Sri Raghavendra Publications
  • : SAHITY1023
  • : Telugu
  • : 2020
  • : 110
  • : Paperback

Reviews

Be the first one to review this product

Discussion:Vaikuntapali

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam