కౌగిలించుకున్న ప్రతిదాన్ని
ఎదో ఒకప్పుడు
వదిలించుకు తీరాలి
ఏవేవో లేపనాలు రాసి
మెరుగు పెట్టుకున్న దేహమైనా
మట్టిలో పాతరవ్వాల్సిందే
........................
మనిషి మనిషిగా చిగురు వేయడానికి, పుష్పించడానికి, జీవన సాఫల్యం జుర్రుకోవడానికి కావలసింది వ్యక్తిత్వ వికాసపు బైరాగి చిట్కాలు కానేకాదని ఈ కవితలు గల్లా పట్టుకొని చెబుతాయి.
నా దైర్యమంతా నటన అని
నాకు సమూలంగా తెలుసు
చిరునవ్వుల చీనాంబరం క్రింద
చిరాకుల గొంగళి దాచిన సంగతి ... ని గొప్ప నిర్బీతితో
బయటపెడతాడు.
ఈ కవిత చదువుతుంటే మనసులో లీలగా తిలక్ తలుక్కుమంటాడు. మధ్యతరగతి మనస్తత్వాన్ని తిలక్ తర్వాత అంత గంబీరంగా చెప్పిన కవి రాజగోపాల్
- శిఖామణి
కవిత్వం వసంతం లాంటిది, హేమంతం లాంటిది. చెట్టు రుతువుకి లోబడినప్పుడే అది సజీవంగా ఉందని తెలుస్తుంది. ఒక మనిషి కవిత చెప్పడం అతని ఇంద్రియాలు, జీవితాభిలాషా సజీవంగా ఉన్నాయనడానికి గుర్తు. ఈ కవికీ అంతే
- చిన వీరభద్రుడు
కౌగిలించుకున్న ప్రతిదాన్ని ఎదో ఒకప్పుడు వదిలించుకు తీరాలి ఏవేవో లేపనాలు రాసి మెరుగు పెట్టుకున్న దేహమైనా మట్టిలో పాతరవ్వాల్సిందే ........................ మనిషి మనిషిగా చిగురు వేయడానికి, పుష్పించడానికి, జీవన సాఫల్యం జుర్రుకోవడానికి కావలసింది వ్యక్తిత్వ వికాసపు బైరాగి చిట్కాలు కానేకాదని ఈ కవితలు గల్లా పట్టుకొని చెబుతాయి. నా దైర్యమంతా నటన అని నాకు సమూలంగా తెలుసు చిరునవ్వుల చీనాంబరం క్రింద చిరాకుల గొంగళి దాచిన సంగతి ... ని గొప్ప నిర్బీతితో బయటపెడతాడు. ఈ కవిత చదువుతుంటే మనసులో లీలగా తిలక్ తలుక్కుమంటాడు. మధ్యతరగతి మనస్తత్వాన్ని తిలక్ తర్వాత అంత గంబీరంగా చెప్పిన కవి రాజగోపాల్ - శిఖామణి కవిత్వం వసంతం లాంటిది, హేమంతం లాంటిది. చెట్టు రుతువుకి లోబడినప్పుడే అది సజీవంగా ఉందని తెలుస్తుంది. ఒక మనిషి కవిత చెప్పడం అతని ఇంద్రియాలు, జీవితాభిలాషా సజీవంగా ఉన్నాయనడానికి గుర్తు. ఈ కవికీ అంతే - చిన వీరభద్రుడు© 2017,www.logili.com All Rights Reserved.