మంచు పులి తేన్సింగ్ నార్గే ఆత్మ కథ. ఇది తేన్సింగ్ నార్గే శత జయంతి సంవత్సరం. ఆ సందర్భంగా ఆయన ఆత్మ చరిత్రను మీ ముందు ఉంచుతున్నాం. ఆయన స్వతహా నేపాల్ వాడే అయినప్పటికీ భారతీయులు మాత్రం తమ బిడ్డగానే భావించుకొంటారు. నార్గే కూడా 'నేను నేపాల్ గర్భంలో పుట్టాను. ఇండియా ఒడిలో పెరిగాను' అన్నాడు. నార్గే పుట్టినప్పటి పేరు నంగ్యాల్ వాంగ్డీ. తేన్సింగ్ నార్గే అన్నది లామాలు పెట్టిన పేరు. ఒక కూలీగా జీవితం ప్రారంభించిన నార్గే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఇద్దరు తొలి వీరుల్లో ఒకడయ్యాడు.
ఆయన ఎడ్మండ్ హిల్లరీతో కలిసి 1953లో తొలిసారి ఎవరెస్టుని అధిరోహించిననాటి నుంచి నేటివరకు ఆయన కుమారుడు జామ్లింగ్, ఆయన మనమడు తాషీతో సహా అనేకమంది ఆ బాటలో పయనించి విజయం సాధించారు. ఈ ఏడాది మన తెలుగు పిడుగులు పదమూడేళ్ళ పూర్ణ మాలవత్, పదిహేడేళ్ళ ఆనంద కుమార్ అదే విజయాన్ని సాధించారు.
మంచు పులి తేన్సింగ్ నార్గే ఆత్మ కథ. ఇది తేన్సింగ్ నార్గే శత జయంతి సంవత్సరం. ఆ సందర్భంగా ఆయన ఆత్మ చరిత్రను మీ ముందు ఉంచుతున్నాం. ఆయన స్వతహా నేపాల్ వాడే అయినప్పటికీ భారతీయులు మాత్రం తమ బిడ్డగానే భావించుకొంటారు. నార్గే కూడా 'నేను నేపాల్ గర్భంలో పుట్టాను. ఇండియా ఒడిలో పెరిగాను' అన్నాడు. నార్గే పుట్టినప్పటి పేరు నంగ్యాల్ వాంగ్డీ. తేన్సింగ్ నార్గే అన్నది లామాలు పెట్టిన పేరు. ఒక కూలీగా జీవితం ప్రారంభించిన నార్గే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఇద్దరు తొలి వీరుల్లో ఒకడయ్యాడు. ఆయన ఎడ్మండ్ హిల్లరీతో కలిసి 1953లో తొలిసారి ఎవరెస్టుని అధిరోహించిననాటి నుంచి నేటివరకు ఆయన కుమారుడు జామ్లింగ్, ఆయన మనమడు తాషీతో సహా అనేకమంది ఆ బాటలో పయనించి విజయం సాధించారు. ఈ ఏడాది మన తెలుగు పిడుగులు పదమూడేళ్ళ పూర్ణ మాలవత్, పదిహేడేళ్ళ ఆనంద కుమార్ అదే విజయాన్ని సాధించారు.© 2017,www.logili.com All Rights Reserved.