ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక రకాల భావావేశాలకు, ఒత్తిడులకు, పనులతొందరలకు, లోనై టెన్షన్ కు గురవుతున్నారు. ఫలితంగా శారీరకంగా, మానసికంగా, అనేక రోగాలబారిన పడి బాధలు పడుతున్నారు. సులభంగా ఉపశమనం పొందే మార్గాలకు బదులు వందలు, వేలూ, రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆరోగ్యనష్టం, ధననష్టం, అనుభవిస్తున్నారు. కొన్ని రకాల మందులు, సరిపడక రియాక్షన్లు, సైడ్ ఎఫెక్టులు, కల్గించి అసలు రోగాన్ని మరుగుపర్చి కొత్తకొత్త రోగాలను తెచ్చి పెట్టుకుంటున్నారు. ఈ యాంత్రికయుగంలో ఇది ఒక విషవలమయం.
ఈ విపరీతాల నుండి బయటపడడానికి యోగం, యోగాసనాలు, ధ్యానం, నిరపాయకరమైన సులభసాధనాలని, సంప్రదాయవాదులు, ఆధునిక వైద్యులు కూడా చెబుతున్నారు. అందుకే ఈనాడు ప్రతిచోటా రకరకాల యోగఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ శిక్షణలు ఇస్తున్నారు. అందుచేత యోగం మొదలైన ప్రధాన అంశాల గురించి పరిశీలిద్దాం.
అతి ప్రాచీన కాలంలో పతంజలి, కపిలుడు, చరకుడు, మొదలైన పెద్దలు ఆధునిక యుగంలో రమణమహర్షి, అరవింద యోగి, రామకృష్ణ పరమహంస, శివానంద, యోగానందా, ఈ రంగంలో కోట్లాదిమందికి మార్గదర్శకులయ్యారు. ఇటివలి కాలంలో బాబారామ్ దేవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు రవిశంకర్, అమ్మా గురువులు ఈ యోగసాధనను, ప్రాణాయామసాధనను సులభ పద్ధతులలో సామాన్యులకు బోధించి, వారికి ఆరోగ్యాన్ని రోగ నివారణను, ఆధ్యాత్మిక ఉన్నతిని పంచి పెడుతున్న ఈ గురు పరంపరను అభివందనం చేసి కొన్ని ముఖ్య అంశాలను ఈ పుస్తకంలో అందించడం జరిగింది.
ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక రకాల భావావేశాలకు, ఒత్తిడులకు, పనులతొందరలకు, లోనై టెన్షన్ కు గురవుతున్నారు. ఫలితంగా శారీరకంగా, మానసికంగా, అనేక రోగాలబారిన పడి బాధలు పడుతున్నారు. సులభంగా ఉపశమనం పొందే మార్గాలకు బదులు వందలు, వేలూ, రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆరోగ్యనష్టం, ధననష్టం, అనుభవిస్తున్నారు. కొన్ని రకాల మందులు, సరిపడక రియాక్షన్లు, సైడ్ ఎఫెక్టులు, కల్గించి అసలు రోగాన్ని మరుగుపర్చి కొత్తకొత్త రోగాలను తెచ్చి పెట్టుకుంటున్నారు. ఈ యాంత్రికయుగంలో ఇది ఒక విషవలమయం. ఈ విపరీతాల నుండి బయటపడడానికి యోగం, యోగాసనాలు, ధ్యానం, నిరపాయకరమైన సులభసాధనాలని, సంప్రదాయవాదులు, ఆధునిక వైద్యులు కూడా చెబుతున్నారు. అందుకే ఈనాడు ప్రతిచోటా రకరకాల యోగఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ శిక్షణలు ఇస్తున్నారు. అందుచేత యోగం మొదలైన ప్రధాన అంశాల గురించి పరిశీలిద్దాం. అతి ప్రాచీన కాలంలో పతంజలి, కపిలుడు, చరకుడు, మొదలైన పెద్దలు ఆధునిక యుగంలో రమణమహర్షి, అరవింద యోగి, రామకృష్ణ పరమహంస, శివానంద, యోగానందా, ఈ రంగంలో కోట్లాదిమందికి మార్గదర్శకులయ్యారు. ఇటివలి కాలంలో బాబారామ్ దేవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు రవిశంకర్, అమ్మా గురువులు ఈ యోగసాధనను, ప్రాణాయామసాధనను సులభ పద్ధతులలో సామాన్యులకు బోధించి, వారికి ఆరోగ్యాన్ని రోగ నివారణను, ఆధ్యాత్మిక ఉన్నతిని పంచి పెడుతున్న ఈ గురు పరంపరను అభివందనం చేసి కొన్ని ముఖ్య అంశాలను ఈ పుస్తకంలో అందించడం జరిగింది.© 2017,www.logili.com All Rights Reserved.