పిల్లలకు బాలసాహిత్యంలో అనుబంధం పెంచడానికి ఏదైనా సరికొత్త ప్రయోగం చేయాలనిపించింది నాకు. వారిని ఎలాగైనా ఊహాలోకంలోకి తీసుకెళ్ళాలి. మరి ఏం చేయాలి? ఇలా ఆలోచిస్తున్న నాకు ఓ మార్గం దొరికింది. అది అద్భుత రసంతో కూడిన 'సోషియో ఫాంటసీ' నవల. నా ఊహలకు పదును పెట్టి, అద్భుత కథలను అల్లుకోవడం ప్రారంభించాను. ఓ అల్లరి చీమను సృష్టించి, దాన్ని మంచి చీమగా మార్చే లక్ష్యాన్ని ఎన్నుకున్నాను. మరి ఆ అల్లరి చీమను మంచిదానిగా మార్చే మంచి మనసున్న జీవి ఎవరు? ఎంత ఆలోచించినా సరియైన పాత్ర నా మనసుకు తట్టడం లేదు.
ఒకరోజు నేను ఓ తోటలో విహరిస్తున్నాను. ఓ అందాల పాలపిట్ట నా ఎదురుగా ఉన్న మామిడిచెట్టు కొమ్మపై వాలింది. అంతలో ఏదో పురుగు జారి దాని వీపుపై పడింది. ఉన్నట్టుండి పాలపిట్ట రివ్వున లేచి ఎగిరించి. ఆ పురుగు దాని వీపుపైనే ఉండటం గమనించిన నాకు ఓ ఆలోచన తట్టింది. అల్లరి చీమను మంచి చీమగా మార్చే ప్రధాన పాత్రగా 'పాలపిట్ట' ఎంపిక అయిపోయింది. ఇక నా నవలా రచన అప్రతిహతంగా సాగుతూ పది యాత్రలు పూర్తయ్యాయి.
అయితే నవలకు 'అద్భుత' ముగింపు ఇవడం మిగిలింది. నా ఆలోచనలకు పదును పెట్టడం ప్రారంభించాను. ఉన్నట్టుండి నాకు మైసూరులోని 'జూ' లో చూసిన సింహం గుర్తుకొచ్చింది. అది తన జాగాలో దర్జాగా తిరుగుతూ, అప్పుడప్పుడూ గర్జించసాగింది. అప్పుడు నేను 'ఈ సింహం కుందేలంత చిన్నగా మారిపోయి గర్జిస్తే భలేగుంటుంది' అనుకున్నాను. అదే అంశంతో కథ రాస్తే ఈనాడు 'హాయ్ బుజ్జీ' లో ప్రచురితమైంది. బాలసాహిత్యానికి సేవ చేస్తే, మానవాళికి మేలు చేసినట్టేనని విశ్వసించే నేను, బాలల బంగారు భవిష్యత్తు కోసం మరిన్ని నవలలు రాయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నాను.
- పుట్టగుంట సురేష్ కుమార్
పిల్లలకు బాలసాహిత్యంలో అనుబంధం పెంచడానికి ఏదైనా సరికొత్త ప్రయోగం చేయాలనిపించింది నాకు. వారిని ఎలాగైనా ఊహాలోకంలోకి తీసుకెళ్ళాలి. మరి ఏం చేయాలి? ఇలా ఆలోచిస్తున్న నాకు ఓ మార్గం దొరికింది. అది అద్భుత రసంతో కూడిన 'సోషియో ఫాంటసీ' నవల. నా ఊహలకు పదును పెట్టి, అద్భుత కథలను అల్లుకోవడం ప్రారంభించాను. ఓ అల్లరి చీమను సృష్టించి, దాన్ని మంచి చీమగా మార్చే లక్ష్యాన్ని ఎన్నుకున్నాను. మరి ఆ అల్లరి చీమను మంచిదానిగా మార్చే మంచి మనసున్న జీవి ఎవరు? ఎంత ఆలోచించినా సరియైన పాత్ర నా మనసుకు తట్టడం లేదు. ఒకరోజు నేను ఓ తోటలో విహరిస్తున్నాను. ఓ అందాల పాలపిట్ట నా ఎదురుగా ఉన్న మామిడిచెట్టు కొమ్మపై వాలింది. అంతలో ఏదో పురుగు జారి దాని వీపుపై పడింది. ఉన్నట్టుండి పాలపిట్ట రివ్వున లేచి ఎగిరించి. ఆ పురుగు దాని వీపుపైనే ఉండటం గమనించిన నాకు ఓ ఆలోచన తట్టింది. అల్లరి చీమను మంచి చీమగా మార్చే ప్రధాన పాత్రగా 'పాలపిట్ట' ఎంపిక అయిపోయింది. ఇక నా నవలా రచన అప్రతిహతంగా సాగుతూ పది యాత్రలు పూర్తయ్యాయి. అయితే నవలకు 'అద్భుత' ముగింపు ఇవడం మిగిలింది. నా ఆలోచనలకు పదును పెట్టడం ప్రారంభించాను. ఉన్నట్టుండి నాకు మైసూరులోని 'జూ' లో చూసిన సింహం గుర్తుకొచ్చింది. అది తన జాగాలో దర్జాగా తిరుగుతూ, అప్పుడప్పుడూ గర్జించసాగింది. అప్పుడు నేను 'ఈ సింహం కుందేలంత చిన్నగా మారిపోయి గర్జిస్తే భలేగుంటుంది' అనుకున్నాను. అదే అంశంతో కథ రాస్తే ఈనాడు 'హాయ్ బుజ్జీ' లో ప్రచురితమైంది. బాలసాహిత్యానికి సేవ చేస్తే, మానవాళికి మేలు చేసినట్టేనని విశ్వసించే నేను, బాలల బంగారు భవిష్యత్తు కోసం మరిన్ని నవలలు రాయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నాను. - పుట్టగుంట సురేష్ కుమార్
© 2017,www.logili.com All Rights Reserved.