పంచతంత్రము అనేది అందరికీ - ముఖ్యంగా చిన్నపిల్లలకూ - ఆసక్తికరమైన కథలతో లోకజ్ఞానాన్నీ నీతిని బోధించే కథల సంగ్రహము అని మనకు అందరికీ తెలుసు. అయితే ఈ పంచతంత్రము అనే ఈ నీతికథా సంగ్రహం ఎందుకోసం ఎవరిచేత ఎలా రచించబడింది? పంచతంత్రము అంటే అర్థం ఏమిటి? అని విశదంగా తెలుసుకుంటే ఈ పుస్తకము వల్ల కలిగే ప్రయోజనం బాగా ఎరిగి మనం దానిని తగిన విధంగా ఉపయోగించుకోగలుగుతాము.
ఈ పంచతంత్రము అనే సమాసంలో 'పంచ' అనే శబ్దానికి ఉన్న 'అయిదు' అనే అర్థం అందరికీ తెలిసిందే. 'తంత్రము' అంటే ప్రస్తుత సందర్భంలో 'సిద్ధాంతము' అని అర్థం. లోకంలో ఏ వ్యక్తులకైనా కానీ ముఖ్యంగా రాజ్యపాలన చేసే రాజులకు గాని కలిగే ఎన్నో చిక్కు సందర్భాలలో ఆ చిక్కులను ఎదుర్కొని తగిన విధంగా వాటిని పరిష్కరించుకోవడానికి పనికివచ్చే ఈ అయిదు సిద్ధాంతములునూ.
పంచతంత్రము అనేది అందరికీ - ముఖ్యంగా చిన్నపిల్లలకూ - ఆసక్తికరమైన కథలతో లోకజ్ఞానాన్నీ నీతిని బోధించే కథల సంగ్రహము అని మనకు అందరికీ తెలుసు. అయితే ఈ పంచతంత్రము అనే ఈ నీతికథా సంగ్రహం ఎందుకోసం ఎవరిచేత ఎలా రచించబడింది? పంచతంత్రము అంటే అర్థం ఏమిటి? అని విశదంగా తెలుసుకుంటే ఈ పుస్తకము వల్ల కలిగే ప్రయోజనం బాగా ఎరిగి మనం దానిని తగిన విధంగా ఉపయోగించుకోగలుగుతాము. ఈ పంచతంత్రము అనే సమాసంలో 'పంచ' అనే శబ్దానికి ఉన్న 'అయిదు' అనే అర్థం అందరికీ తెలిసిందే. 'తంత్రము' అంటే ప్రస్తుత సందర్భంలో 'సిద్ధాంతము' అని అర్థం. లోకంలో ఏ వ్యక్తులకైనా కానీ ముఖ్యంగా రాజ్యపాలన చేసే రాజులకు గాని కలిగే ఎన్నో చిక్కు సందర్భాలలో ఆ చిక్కులను ఎదుర్కొని తగిన విధంగా వాటిని పరిష్కరించుకోవడానికి పనికివచ్చే ఈ అయిదు సిద్ధాంతములునూ.© 2017,www.logili.com All Rights Reserved.