ఓం నమో భగవతే వాసుదేవాయ
మహాభారతము భీష్మ పర్వములో 25వ అధ్యాయము నుండి 42వ అధ్యాయము వరకు గల 18 అధ్యాయములలో భగవద్గీత వర్ణింపబడినది. వ్యాస సంస్కృత భారతము నందు ఈ అధ్యాయములకు పేర్లు ఏమియూ లేనప్పటికి, ఇందలి విషయము అత్యంత విశిష్ట భావప్రాధాన్యత కలిగి యుండుట వలన, అందలి ముఖ్యాంశములే అధ్యాయ నామములుగా తత్త్వజ్ఞులచే ప్రతిష్ఠింపబడి, ప్రతి అధ్యాయమునకు చివర "యోగము" అని పేర్కొనబడినవి.
సనాతన భారతీయ సాహిత్యంలో విపుల ప్రయుక్తమైన శబ్దం "యోగము". వ్యవహారిక భాషలో 'యోగ' అనే శబ్దానికి 'కలయిక' పొందిక' అని అర్థం. సాహితీ జగత్తులో 'సామరస్య సంధానం' అని చెప్పవచ్చు. వేదాంత పరంగా జీవాత్మ పరమాత్మల 'సమ్మేళనం'. బహిక ఆముష్మికాల (ఇహలోక, పరలోక) సమన్వయం.
చిత్తము (మనస్సు)ను ప్రపంచమునందలి విషయముల వైపు పోనీయక నిరోధించిన దుఃఖము నివృత్తి అగును. ఇది యోగశాస్త్రం యొక్క లక్ష్యం మరియు ప్రయోజనం. భగవద్గీత యందు యోగము అనగా 'సమతాభావం' 'క్రియాకౌశలం'. ఈ రెండు నిర్వచనాలు ఒకే నాణానికి ఉన్న బొమ్మ, బొరుసు వలే గీతలో చెప్పబడిన యోగానికి గల రెండు రూపాలు. వాటి అంతిమ లక్ష్యం 'జీవాత్మ-పరమాత్మ'ల ఐక్యమే.
మహాభారతం శ్రీకృష్ణపరమాత్మను ధర్మాద్వైతమూర్తిగా (ధర్మమే భగవంతుడని, జీవునికి భగవంతునికి భేదమేలేదని బోధించిన స్వరూపముగా) కీర్తించినది. భగవద్గీత శ్రీకృష్ణునికి ప్రసాదించిన బిరుదు "యోగీశ్వరుడు",
యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు యోగానికి ఇచ్చిన నిర్వచనం "యోగః కర్మసు కౌశలం" అంటే క్రియా కౌశలం, నిర్వహణా పాటవం, నిర్వహణా చాతుర్యం, నిస్సంగత్వం. కర్మ ఫలముల యందు ఆసక్తి రహితముగా ఉండటం వల్లనే నిస్సంగత్వం సిద్ధిస్తుంది.
ప్రథమాధ్యాయమున గల 47 శ్లోకములలో జ్ఞాన సంబంధమైన బోధ ఏమియూ లేనప్పటికి యోధుడైన అర్జునుడు యుద్ధరంగములో నిలిచియున్న తాతలను, తండ్రులను, సోదరులను, కుమారులను, మిత్రులను, బంధువర్గాన్ని చూచి మోహగ్రస్తుడగుట మరియు జ్ఞానము పొందుటకు అవశ్యమగు శుద్ధ అంతఃకరణము, ధర్మజిజ్ఞాస, భక్తి, వైరాగ్యములు, శరణాగతి మున్నగు విషయాలు ప్రస్ఫుటమయ్యేలా ముగ్గురి (ధృతరాష్ట్ర, దుర్యోధన, అర్జునుల) మనస్తత్వాలను వ్యాస భగవానుడు వివరించినారు.................
ఓం నమో భగవతే వాసుదేవాయ అర్జున విషాదయోగము మహాభారతము భీష్మ పర్వములో 25వ అధ్యాయము నుండి 42వ అధ్యాయము వరకు గల 18 అధ్యాయములలో భగవద్గీత వర్ణింపబడినది. వ్యాస సంస్కృత భారతము నందు ఈ అధ్యాయములకు పేర్లు ఏమియూ లేనప్పటికి, ఇందలి విషయము అత్యంత విశిష్ట భావప్రాధాన్యత కలిగి యుండుట వలన, అందలి ముఖ్యాంశములే అధ్యాయ నామములుగా తత్త్వజ్ఞులచే ప్రతిష్ఠింపబడి, ప్రతి అధ్యాయమునకు చివర "యోగము" అని పేర్కొనబడినవి. సనాతన భారతీయ సాహిత్యంలో విపుల ప్రయుక్తమైన శబ్దం "యోగము". వ్యవహారిక భాషలో 'యోగ' అనే శబ్దానికి 'కలయిక' పొందిక' అని అర్థం. సాహితీ జగత్తులో 'సామరస్య సంధానం' అని చెప్పవచ్చు. వేదాంత పరంగా జీవాత్మ పరమాత్మల 'సమ్మేళనం'. బహిక ఆముష్మికాల (ఇహలోక, పరలోక) సమన్వయం. చిత్తము (మనస్సు)ను ప్రపంచమునందలి విషయముల వైపు పోనీయక నిరోధించిన దుఃఖము నివృత్తి అగును. ఇది యోగశాస్త్రం యొక్క లక్ష్యం మరియు ప్రయోజనం. భగవద్గీత యందు యోగము అనగా 'సమతాభావం' 'క్రియాకౌశలం'. ఈ రెండు నిర్వచనాలు ఒకే నాణానికి ఉన్న బొమ్మ, బొరుసు వలే గీతలో చెప్పబడిన యోగానికి గల రెండు రూపాలు. వాటి అంతిమ లక్ష్యం 'జీవాత్మ-పరమాత్మ'ల ఐక్యమే. మహాభారతం శ్రీకృష్ణపరమాత్మను ధర్మాద్వైతమూర్తిగా (ధర్మమే భగవంతుడని, జీవునికి భగవంతునికి భేదమేలేదని బోధించిన స్వరూపముగా) కీర్తించినది. భగవద్గీత శ్రీకృష్ణునికి ప్రసాదించిన బిరుదు "యోగీశ్వరుడు", యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు యోగానికి ఇచ్చిన నిర్వచనం "యోగః కర్మసు కౌశలం" అంటే క్రియా కౌశలం, నిర్వహణా పాటవం, నిర్వహణా చాతుర్యం, నిస్సంగత్వం. కర్మ ఫలముల యందు ఆసక్తి రహితముగా ఉండటం వల్లనే నిస్సంగత్వం సిద్ధిస్తుంది. ప్రథమాధ్యాయమున గల 47 శ్లోకములలో జ్ఞాన సంబంధమైన బోధ ఏమియూ లేనప్పటికి యోధుడైన అర్జునుడు యుద్ధరంగములో నిలిచియున్న తాతలను, తండ్రులను, సోదరులను, కుమారులను, మిత్రులను, బంధువర్గాన్ని చూచి మోహగ్రస్తుడగుట మరియు జ్ఞానము పొందుటకు అవశ్యమగు శుద్ధ అంతఃకరణము, ధర్మజిజ్ఞాస, భక్తి, వైరాగ్యములు, శరణాగతి మున్నగు విషయాలు ప్రస్ఫుటమయ్యేలా ముగ్గురి (ధృతరాష్ట్ర, దుర్యోధన, అర్జునుల) మనస్తత్వాలను వ్యాస భగవానుడు వివరించినారు.................© 2017,www.logili.com All Rights Reserved.