సంగీతం రస గంగా ప్రవాహం. అది శిశువునైనా, పశువునైనా ఆకట్టుకుంటుంది. తలలూపిస్తుంది. ఆనందింపజేస్తుంది. మన తొలినాటి సాహిత్య సంపదంతా మౌఖిక సాహిత్యమే. జానపద విజ్ఞాన భాండాగారమే. మనిషి పలుక నేర్చుకున్నాకా తొలుత పాట పుట్టింది. రాత పుట్టాక ముందు మౌఖిక సాహిత్యమే పరివ్యాప్తిలో ఉండేది. ఎన్నో వైవిధ్యభరితమైన పాటల, పదాలు, గేయాలు వ్యాప్తిలో ఉండేవి. మన పాల్కురికి సోమనాధుడు 'బసవపురాణం' లో పేర్కొన్నది ఈ పదాల గురించే. నా చిన్నతనం నుండి నేటి వరకు, మా పిల్లల దాకా ఈ గేయాలను వందలసార్లు విన్నాను. పాడాను. అనుభవించి అనుభూతి పొందాను. విన్న ప్రతిసారీ నన్ను నేను రీచార్జ్ చేసుకుంటాను. బహుశా ఆ చైతన్యమే ప్రవాహమే నాతో కొన్ని బాల గేయాలు రాయించి ఉండొచ్చు. ఆ చైతన్యమే ఎంతో మందిని బాల సాహితీ వేత్తలుగా, తీర్చిదిద్ది ఉండొచ్చు.
సంగీతం రస గంగా ప్రవాహం. అది శిశువునైనా, పశువునైనా ఆకట్టుకుంటుంది. తలలూపిస్తుంది. ఆనందింపజేస్తుంది. మన తొలినాటి సాహిత్య సంపదంతా మౌఖిక సాహిత్యమే. జానపద విజ్ఞాన భాండాగారమే. మనిషి పలుక నేర్చుకున్నాకా తొలుత పాట పుట్టింది. రాత పుట్టాక ముందు మౌఖిక సాహిత్యమే పరివ్యాప్తిలో ఉండేది. ఎన్నో వైవిధ్యభరితమైన పాటల, పదాలు, గేయాలు వ్యాప్తిలో ఉండేవి. మన పాల్కురికి సోమనాధుడు 'బసవపురాణం' లో పేర్కొన్నది ఈ పదాల గురించే. నా చిన్నతనం నుండి నేటి వరకు, మా పిల్లల దాకా ఈ గేయాలను వందలసార్లు విన్నాను. పాడాను. అనుభవించి అనుభూతి పొందాను. విన్న ప్రతిసారీ నన్ను నేను రీచార్జ్ చేసుకుంటాను. బహుశా ఆ చైతన్యమే ప్రవాహమే నాతో కొన్ని బాల గేయాలు రాయించి ఉండొచ్చు. ఆ చైతన్యమే ఎంతో మందిని బాల సాహితీ వేత్తలుగా, తీర్చిదిద్ది ఉండొచ్చు.© 2017,www.logili.com All Rights Reserved.