"అమ్మపాట" అనే బాలసాహిత్య రచన చేసిన రాజావాసిరెడ్డి మల్లీశ్వరిగారు, అమ్మలందరి నోట పలికే తియ్యని పాటకి అక్షర రూపం ఇచ్చినందుకు రచయిత్రికి నా అభినందనలు. బాలసాహిత్యం అనగానే బాలవాజ్మయ బ్రహ్మ చింతా దీక్షితులు, బాలల నాటికలు రాసిన బాలబంధు ఇల్లిందల సరస్వతీదేవి, బాలానందం ఆకాశవాణిలో నిర్వహించిన... రాఘవరావుగారు కామేశ్వరిగారు - ఇలా స్మరించవలసిన మహనీయులు మరెందరో. బాలసాహిత్యమంటే ఏమిటీ అని ప్రశ్నిస్తే, "శిశువు జన్మించినది మొదలు బాల్యదశవీడేవరకు కూడా వాని మనసుకు రంజకంగా ఉండేది బాల వాజ్మయం" అని నిర్వచించిన చింతా దీక్షితులవారి మాట అక్షర సత్యం!! మల్లీశ్వరిగారు 'అమ్మపాట' లో అరవై పాటల్ని కూర్చారు. పసితనపు సొగసులు పసిడిమొగ్గల్లా పాఠకులకు అందించారు.
"అమ్మపాట" అనే బాలసాహిత్య రచన చేసిన రాజావాసిరెడ్డి మల్లీశ్వరిగారు, అమ్మలందరి నోట పలికే తియ్యని పాటకి అక్షర రూపం ఇచ్చినందుకు రచయిత్రికి నా అభినందనలు. బాలసాహిత్యం అనగానే బాలవాజ్మయ బ్రహ్మ చింతా దీక్షితులు, బాలల నాటికలు రాసిన బాలబంధు ఇల్లిందల సరస్వతీదేవి, బాలానందం ఆకాశవాణిలో నిర్వహించిన... రాఘవరావుగారు కామేశ్వరిగారు - ఇలా స్మరించవలసిన మహనీయులు మరెందరో. బాలసాహిత్యమంటే ఏమిటీ అని ప్రశ్నిస్తే, "శిశువు జన్మించినది మొదలు బాల్యదశవీడేవరకు కూడా వాని మనసుకు రంజకంగా ఉండేది బాల వాజ్మయం" అని నిర్వచించిన చింతా దీక్షితులవారి మాట అక్షర సత్యం!! మల్లీశ్వరిగారు 'అమ్మపాట' లో అరవై పాటల్ని కూర్చారు. పసితనపు సొగసులు పసిడిమొగ్గల్లా పాఠకులకు అందించారు.© 2017,www.logili.com All Rights Reserved.