రంగన్నిప్పుడు నాలుగోక్లాసు చదువుతున్నాడు. అతడికి తండ్రి లేడు, తల్లి ఉంది. ఆమె రంగన్నను తండ్రి చనిపోయినప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచింది. ఆమె ముద్దుకు తన కొడుక్కు 'రంగారావు' అని పేరు పెట్టుకున్నా, అందరూ వాడిని 'రంగడ'నే పిలిచేవారు. అతడి తల్లిపేరు సీతమ్మ. ఆమె చిన్నప్పటి నుంచీ కాయకష్టం చేయటంలో దిట్ట. అందుకని భర్త చచ్చిపోయినా కొడుకును బళ్లోకి పంపి చదివిస్తున్నది. రంగడిని చెడ్డ వాళ్ళ స్నేహంచేయకుండా చూస్తూ తనకు వచ్చిన మంచి మంచి నీతికథలు చెప్తుండేది. రోజు గడవటం కోసం తాను ధనికుల ఇళ్ళల్లో పనులు చేస్తుండేది.
ఒకనాడు హఠాత్తుగా సీతమ్మకు జ్వరమొచ్చింది. మంచంలో నుంచి లేవలేని స్థితిలో ఉంది. ఆ ఊళ్లోనే ఉన్న నాటు వైద్యుడు రెండు రూపాయలిస్తే మందిస్తానన్నాడు. ఆమె దగ్గర చెల్లి కానీ లేదు. రంగన్నకు ఆమె దుస్థితి చూచి చాలా జాలి వేసింది, పంతులు గారిని అడిగి మూడు రోజులు సెలవు తీసుకొని తనతల్లికి సపర్యలు చేస్తూ ఇంటి దగ్గరే ఉండి పోయాడు.
రంగన్నిప్పుడు నాలుగోక్లాసు చదువుతున్నాడు. అతడికి తండ్రి లేడు, తల్లి ఉంది. ఆమె రంగన్నను తండ్రి చనిపోయినప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచింది. ఆమె ముద్దుకు తన కొడుక్కు 'రంగారావు' అని పేరు పెట్టుకున్నా, అందరూ వాడిని 'రంగడ'నే పిలిచేవారు. అతడి తల్లిపేరు సీతమ్మ. ఆమె చిన్నప్పటి నుంచీ కాయకష్టం చేయటంలో దిట్ట. అందుకని భర్త చచ్చిపోయినా కొడుకును బళ్లోకి పంపి చదివిస్తున్నది. రంగడిని చెడ్డ వాళ్ళ స్నేహంచేయకుండా చూస్తూ తనకు వచ్చిన మంచి మంచి నీతికథలు చెప్తుండేది. రోజు గడవటం కోసం తాను ధనికుల ఇళ్ళల్లో పనులు చేస్తుండేది. ఒకనాడు హఠాత్తుగా సీతమ్మకు జ్వరమొచ్చింది. మంచంలో నుంచి లేవలేని స్థితిలో ఉంది. ఆ ఊళ్లోనే ఉన్న నాటు వైద్యుడు రెండు రూపాయలిస్తే మందిస్తానన్నాడు. ఆమె దగ్గర చెల్లి కానీ లేదు. రంగన్నకు ఆమె దుస్థితి చూచి చాలా జాలి వేసింది, పంతులు గారిని అడిగి మూడు రోజులు సెలవు తీసుకొని తనతల్లికి సపర్యలు చేస్తూ ఇంటి దగ్గరే ఉండి పోయాడు.© 2017,www.logili.com All Rights Reserved.