నేటి బాలలే రేపటి పౌరులు! వారు మంచి క్రమశిక్షణతో చక్కగా పెరుగుతూ - విద్యావంతులై.. ఎన్నో రంగాల్లో విశేష ప్రతిభలను కనబరుస్తూ ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళ్ళే బాధ్యత వాళ్ళ మీదుంది. అందుకు.... పసితనం నుండే పిల్లల సంరక్షణ, వాళ్ళలో సరైన నడవడికను అలవాటు చేయండి... విద్యాబుద్ధులు నేర్పించడం మొదలుకుని, వాళ్ళను ప్రయోజకులుగా సమాజం గౌరవించే వ్యక్తులుగా తీర్చిదిద్దే పూర్తి బాధ్యత తల్లి దండ్రులు, గురువులు మీదే వుంటుంది. పిల్లల అభివృద్ధి విషయంలో తల్లిదండ్రులు, గురువులు ఎన్నో విషయాలు మీద చక్కని అవగాహన ఓర్పు కలిగి వుండాలి. అందుకు.. ఆయా వయసులను బట్టి సహజంగా వుండే సైకాలజీని అర్థం చేసుకుంటూ.... వారిని సముదాయించడం, నచ్చజెప్పడం, ఏది మంచో - ఏది చెడో పిల్లలకు అర్థం అయ్యేలా చెపుతూ.. పిల్లల్లో మానసిక వికాసాన్ని పెంపొందించుతూ, తెలివిగలవారిగా తీర్చిదిద్దడం చాలా అవసరం. - డా. వి. రాధికారెడ్డి