ఆరు అధ్యాయాలుగల ఈ పుస్తకంలో అంకగణితానికి, జ్యామితికి సంబంధించిన ఎన్నో సరదా సమస్యలు ఇవ్వబడ్డాయి. మహమ్మారి సంఖ్యలు అనే అధ్యాయంలో వాస్తవ ప్రపంచం లో పెద్ద పెద్ద మొత్తాలు ఎలా ఏర్పడుతాయో వివరించబడింది. తన సేవలకు తగ్గ పారితోషికం ఇమ్మని చెయ్యిచాచిన సేనానికి రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ ఆ సేనాని కళ్ళుకప్పి అతడు ఆశించినదానికన్నా చాలా తక్కువ మొత్తాన్ని ఇచ్చి సాగనంపిన కథ ఆసక్తికరంగా ఉంటుంది.
అలాగే జ్యమితికి సంబంధించిన ఆఖరి అధ్యాయంలో ఓ గ్లాసు గోడకు అంటుకొని ఉన్న తేనే బొట్టును ఓ చీమ ఎలా చేరుకుంటుంది అనే సమస్య మెదడును సవాలు చేస్తుంది. ఇలా ఎన్నో సొగసైన సమస్యలతో పాఠకుల మనస్సులో ఏ మూలైనా గణితం అంటే భయం ఉంటే దాన్ని పోగొట్టి దాని స్థానంలో గణితం పట్ల గాఢమైన అభిమానాన్ని కలగజేస్తుంది. ఇలా ఈ పుస్తకంలో గణిత గారడీలు చాలా కలవు. తప్పక చదవండి.
- శ్రీనివాస చక్రవర్తి
ఆరు అధ్యాయాలుగల ఈ పుస్తకంలో అంకగణితానికి, జ్యామితికి సంబంధించిన ఎన్నో సరదా సమస్యలు ఇవ్వబడ్డాయి. మహమ్మారి సంఖ్యలు అనే అధ్యాయంలో వాస్తవ ప్రపంచం లో పెద్ద పెద్ద మొత్తాలు ఎలా ఏర్పడుతాయో వివరించబడింది. తన సేవలకు తగ్గ పారితోషికం ఇమ్మని చెయ్యిచాచిన సేనానికి రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ ఆ సేనాని కళ్ళుకప్పి అతడు ఆశించినదానికన్నా చాలా తక్కువ మొత్తాన్ని ఇచ్చి సాగనంపిన కథ ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే జ్యమితికి సంబంధించిన ఆఖరి అధ్యాయంలో ఓ గ్లాసు గోడకు అంటుకొని ఉన్న తేనే బొట్టును ఓ చీమ ఎలా చేరుకుంటుంది అనే సమస్య మెదడును సవాలు చేస్తుంది. ఇలా ఎన్నో సొగసైన సమస్యలతో పాఠకుల మనస్సులో ఏ మూలైనా గణితం అంటే భయం ఉంటే దాన్ని పోగొట్టి దాని స్థానంలో గణితం పట్ల గాఢమైన అభిమానాన్ని కలగజేస్తుంది. ఇలా ఈ పుస్తకంలో గణిత గారడీలు చాలా కలవు. తప్పక చదవండి. - శ్రీనివాస చక్రవర్తి© 2017,www.logili.com All Rights Reserved.