బోకారో ఎక్స్ ప్రెస్ చీకటిని చీల్చుకుంటూ వేగంగా దూసుకెళ్తోంది. ఇంజన్ రొద, పట్టాల శబ్దం కలగా పులగమై వింతగా ధ్వనిస్తూ నిశ్శబ్దాన్ని చీలుస్తోంది. కిటికీ అద్దాల నుండి బయట పడుతున్న కాంతి దూరంగా పడుతూ బండిని వెంబడిస్తున్నట్లుగా పరిగెడుతూంది.
నేనున్నది రిజర్వుడు కంపార్ట్ మెంట్ అయినా అది రద్దీగానే వుంది. సీట్ల మీద, క్రింద జనం నిద్రతో తూగుతున్నారు. అసౌకర్యంగా వుండటం వలన ఎవరూ పూర్తిగా నిద్రపోలేక పోతున్నారు. తూలు వచ్చినప్పుడల్లా సర్దుకు కూర్చుని, తమ సామాను పరిశీలనగా చూసుకొని తిరిగి నిద్ర కుపక్రమిస్తున్నారు.
అదృష్టం కొలదీ నేను బెర్త్ సంపాదించుకోగలిగినా నిద్ర రావటం లేదు. గరగరమని తిరుగుతున్న ఫాన్ రెక్కల శబ్దం మినహా కంపార్ట్ మెంట్ లో మరే శబ్దం లేదు.
వారం క్రితమే రాఘవను కలిసిన నేను, వాడ్ని కలుసుకోవటానికి తిరిగి ఇంత త్వరగా వెళ్ళాల్సి వస్తుందనుకోలేదు. రాఘవ వుత్తరం చూసిన వెంటనే రెండు రోజులు ఆఫీస్ కు శలవు పెట్టి బయలుదేరాల్సి వచ్చింది.
- పెనుగొండ లక్ష్మీ నారాయణ