చరిత్రలో గానీ, సాహిత్య చరిత్రలో గానీ నిశ్శబ్ద కృషి చేసి, కాలంలో కరిగిపోయే వాళ్లుంటారు. పైపైన చూస్తే వాళ్లు ఉన్నత శిఖరాలకి మల్లే కనబడరు. లోతైన సముద్రాలు మాదిరిగానూ కనపడరు. మామూలు మామూలుగా కనపడతారు. మనవి శిఖరాలను మాత్రమే గుర్తించి, గౌరవించే చూపులు కనుక సాధారణంగా అల్లాంటి వాళ్లకి అన్యాయం జరుగుతుంటుంది.
తెలుగు సాహిత్య చరిత్రలో అల్లాంటి నిశ్శబ్ద కృషి చేసిన ఉత్తమ కథకుడు మా గోఖలే. ఆయన కథలకు ఏ కారణం వల్లనో సరైన ప్రచారం రాలేదు. ఇప్పటికీ మన కథాచరిత్ర బొత్తిగా ఇరవై ముప్పై మంది ప్రసిద్ధ కథకుల చరిత్రగానే మిగిలిపోయింది. అయన దానికీ కానిదానికీ వాళ్ల కథల్ని మాత్రమే పదే పదే నెమరెయ్యటం - ఈ పద్ధతి మారాలి. ఇప్పటికీ చర్చించాల్సిన కథలూ, కథకులూ ఎంతో మందున్నారు.
- పాపినేని శివశంకర్