తెలుగు 'శారద' - తమిళ నటరాజన్
పుట్టుకతో తమిళుడు. పేరు నటరాజన్. తమిళనాట ఏడవ తరగతివరకు చదువుకున్నాడు. 12 ఏళ్ళ వయస్సులో తండ్రి సుబ్రహ్మణ్యయ్యర్ తో 1937లో తెలుగు గడ్డమీద కాలుమోపాడు. ఆనాటికి అతనికి తెలుగు తెలియదు. బతుకు పోరాటంలో నిత్య శ్రామికుడు. హోటల్ కార్మికుడు. తెనాలిలో వీధి బడి పంతులుగారి వద్ద మూడవ తెలుగులో తరగతి వరకు చదివాడు. నటరాజన్ . కష్టపడి తెలుగు నేర్చుకున్నాడు. 15ఏళ్ళ వయసు. లోకం గురించి తెలుసుకుంటుండగనే తండ్రి 1940లో కనుమూశారు. అదే సమయంలో నటరాజన్కు మూర్ఛల వ్యాధి తోడయింది. జీవితంలో పస్తులతో గడిపిన రోజులు అనేకం. ఆ వ్యాధితోనే అతని జీవితం ముగిసింది.
ఆ గత శతాబ్ది 30వ దశకం ఉత్తరార్థంలో తెనాలి చేరిన నటరాజన్ నాటి స్వాతంత్య్ర ఉద్యమాలను కళ్ళారా చూశాడు. కమ్యూనిస్టు పార్టీ ఆ ధ్వర్యంలో కార్మికులు తమ కనీస హక్కుల కోసం చేసిన పోరాటాలలో ప్రత్యక్ష భాగస్వామి. హెూటల్లో దోశల మీద సుత్తీకొడవలి బొమ్మలు వేసి యజమాని కోపానికి గురయ్యాడు. పని పోగొట్టుకున్నాడు. జీవితాంతం కమ్యూనిస్టుగానే నిలబడ్డాడు. హెూటల్ కార్మికుడిగా రోజుకు 10గంటలు, ఒక్కోసారి 12 గంటలు పనిచేసినా ఖాళీ సమయంలో కొంత చదువుకు కేటాయించాడు. చదవడంలో శ్రమను మర్చిపోవడం అలవాటు చేసుకున్నాడు. చేతికందిన పుస్తకాన్ని వదలకుండా చదివాడు. ఎంతగా అంటే పొయ్యిదగ్గర పదార్థాలు తయారు చేస్తూకూడా ఒకచేతిలో అట్లకాడ ఉంటే మరోచేత పుస్తకం ఉండేది. ఆ కష్టాలు తనకొక్కడివే కాదని అర్థమయింది. సామాజిక సంఘర్షణలను చూస్తున్నాడు. ఆంతరంగిక వేదనకు గురవుతున్నాడు.
బాటలు వేసిన సాహిత్య పాఠశాల
తెనాలిలో ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భవించింది. తెలుగునాట || ప్రగతిశీల సాహిత్య ఉద్యమానికి బాటలు వేసింది. అందులో భాగంగా 1946లో తెనాలి | తాలూక పెదపూడిలో నెల రోజులపాటు సాహిత్య పాఠశాలను నిర్వహించింది. భాషా, సాహిత్య,.................
తెలుగు 'శారద' - తమిళ నటరాజన్ పుట్టుకతో తమిళుడు. పేరు నటరాజన్. తమిళనాట ఏడవ తరగతివరకు చదువుకున్నాడు. 12 ఏళ్ళ వయస్సులో తండ్రి సుబ్రహ్మణ్యయ్యర్ తో 1937లో తెలుగు గడ్డమీద కాలుమోపాడు. ఆనాటికి అతనికి తెలుగు తెలియదు. బతుకు పోరాటంలో నిత్య శ్రామికుడు. హోటల్ కార్మికుడు. తెనాలిలో వీధి బడి పంతులుగారి వద్ద మూడవ తెలుగులో తరగతి వరకు చదివాడు. నటరాజన్ . కష్టపడి తెలుగు నేర్చుకున్నాడు. 15ఏళ్ళ వయసు. లోకం గురించి తెలుసుకుంటుండగనే తండ్రి 1940లో కనుమూశారు. అదే సమయంలో నటరాజన్కు మూర్ఛల వ్యాధి తోడయింది. జీవితంలో పస్తులతో గడిపిన రోజులు అనేకం. ఆ వ్యాధితోనే అతని జీవితం ముగిసింది. ఆ గత శతాబ్ది 30వ దశకం ఉత్తరార్థంలో తెనాలి చేరిన నటరాజన్ నాటి స్వాతంత్య్ర ఉద్యమాలను కళ్ళారా చూశాడు. కమ్యూనిస్టు పార్టీ ఆ ధ్వర్యంలో కార్మికులు తమ కనీస హక్కుల కోసం చేసిన పోరాటాలలో ప్రత్యక్ష భాగస్వామి. హెూటల్లో దోశల మీద సుత్తీకొడవలి బొమ్మలు వేసి యజమాని కోపానికి గురయ్యాడు. పని పోగొట్టుకున్నాడు. జీవితాంతం కమ్యూనిస్టుగానే నిలబడ్డాడు. హెూటల్ కార్మికుడిగా రోజుకు 10గంటలు, ఒక్కోసారి 12 గంటలు పనిచేసినా ఖాళీ సమయంలో కొంత చదువుకు కేటాయించాడు. చదవడంలో శ్రమను మర్చిపోవడం అలవాటు చేసుకున్నాడు. చేతికందిన పుస్తకాన్ని వదలకుండా చదివాడు. ఎంతగా అంటే పొయ్యిదగ్గర పదార్థాలు తయారు చేస్తూకూడా ఒకచేతిలో అట్లకాడ ఉంటే మరోచేత పుస్తకం ఉండేది. ఆ కష్టాలు తనకొక్కడివే కాదని అర్థమయింది. సామాజిక సంఘర్షణలను చూస్తున్నాడు. ఆంతరంగిక వేదనకు గురవుతున్నాడు. బాటలు వేసిన సాహిత్య పాఠశాల తెనాలిలో ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భవించింది. తెలుగునాట || ప్రగతిశీల సాహిత్య ఉద్యమానికి బాటలు వేసింది. అందులో భాగంగా 1946లో తెనాలి | తాలూక పెదపూడిలో నెల రోజులపాటు సాహిత్య పాఠశాలను నిర్వహించింది. భాషా, సాహిత్య,.................© 2017,www.logili.com All Rights Reserved.