మనిషి ఎందుకు నవ్వాలి......? అని ప్రశ్నించుకుంటే.... నవ్వకుండా ఉండలేదు కాబట్టి. ఒక వేళా ఉండగలిగినా సంతోషంగానూ, ఆరోగ్యంగానూ, ఉండలేదు కాబట్టి అని చెప్పుకోవచ్చు. నవ్వు ప్రకృతి మనకు ప్రసాదించిన గొప్పవారం. నవరసాలను ఒలికించగల ఏకైక రసం నవ్వు. ప్రశాంతంగా, కాళాత్మకంగా నవ్వగలగడం ఒక అదృష్టం. అదొక అద్భుతం. మూఖానికి ఎన్ని స్నోలు పూసిన, ఎంత పౌడరు అద్దిన అవి చిరునవ్వు శోభతో సరితూగలేవు. మనసారా నవ్వితే మీ శరీరంలో ఎండార్ఫిస్ లు విడుదలవుతాయి. దాంతో మీ చర్మం మెరుగులు దిద్దుకుంటుంది. మీ ముఖంలో వెలుగు వస్తుంది. అని శాస్త్రం చెబుతుంది. ఎవరి నవ్వు వారిది, ఎవరి అనుభూతి వారిదే కనుక నవ్వును అరువుతెచ్చుకోలేము. ఒక వేళ అలాంటి ప్రయత్నం చేస్తే అది వికృతంగా, వికారంగా తయారవుతుందే కానీ, అది నవ్వు అనిపించుకోలేదు.
కార్టూన్ అంతర్జాతియ భాష, అందుకే కార్టూన్ కళ విశ్వవ్యాప్తమైంది.
ఈ కార్టూన్ పుస్తకంలోని కార్టూన్లు పాఠకులను నవ్వించడమేకాదు, ఆలోచింపజేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
-కళాసాగర్ యెల్లపు.